మద్యం విధానంపై బాబు ప్రభుత్వం యూటర్న్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం యూటర్న్‌లకు పేరుగాంచిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వంకూడా తెలంగాణ బాటలో నడుస్తున్నట్లుంది. మద్యం విధానం విషయంలో ఏపీ ప్రభుత్వం మనసు మార్చుకుంది. మద్యం వ్యాపారంనుంచి వైదొలగాలని నిర్ణయించింది. 13 జిల్లాలలో ఎక్సైజ్ శాఖ నడుపుతున్న 427 మద్యం దుకాణాలను ముసేయాలని తీర్మానించింది.

పొరుగు రాష్ట్రం తమిళనాడు తరహాలో మద్యం వ్యాపారాన్ని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకోవాలని, వైన్ షాపులను తామే నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం కొద్ది నెలల క్రితం నిర్ణయించింది. అయితే తర్వాత ఏమనుకుందో ఏమోగానీ, జులైలో ఎక్సైజ్ విధానాన్ని రూపొందించే సమయానికి కేవలం 10 శాతం దుకాణాలనే ఎక్సైజ్ శాఖకు వదిలింది. ఇప్పుడు ఆ 10 శాతం దుకాణాలనుకూడా ప్రైవేట్ వ్యాపారులకు వదిలేయాలని నిర్ణయించింది. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖలో తీవ్రమైన సిబ్బంది కొరతను దీనికి కారణంగా ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రైవేట్ లిక్కర్ లాబీ ఒత్తిడివలనే ప్రభుత్వం తన మనసు మార్చుకుందని సమాచారం. ప్రభుత్వం నడిపే దుకాణాలు మంచి క్వాలిటీ, క్వాంటిటీ మద్యాన్ని అమ్ముతుండటంతో స్వల్పకాలంలోనే బాగా ప్రజాదరణ పొందాయని, ఆ పరిణామాన్ని భరించలేని ప్రైవేట్ వ్యాపారులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారని అంటున్నారు. ప్రైవేట్ వ్యాపారులు ఎంఆర్‌పీ కంటే ఎక్కువ రేటుకు అమ్ముతుంటారని, క్వాలిటీకూడా ఉండదన్న వాదన వినిపిస్తోంది. ప్రభుత్వ దుకాణాలలో మంచి మద్యం అందిస్తుండటంతో ప్రైవేట్ వ్యాపారులుకూడా అదే క్వాలిటీ మద్యాన్ని అమ్మాల్సి వస్తోంది.

తమిళనాడు తరహాలో వైన్ షాపులను నడపాలని నిర్ణయం తీసుకుంది సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే అయినప్పటికీ ఇప్పుడు ప్రభుత్వమే మనసు మార్చుకోవటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే సిబ్బంది కొరతే కారణమని, కొత్త నియామకాలకేమో ప్రభుత్వ ఆమోదం లేదని అధికారులు అంటున్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న 427 వైన్ షాపులను నవంబర్ నెలాఖరులోపు వేలంద్వారా కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జ‌గ‌న్ బ్యాండేజీ.. మ‌ళ్లీ ట్రోల్స్ షురూ!

అదేదో యాడ్‌లో చెప్పిన‌ట్టు.. 'ఏపీలో ఏం న‌డుస్తోంది' అంటే 'బ్యాండేజీల ట్రెండ్ న‌డుస్తోంది' అంటారు అక్క‌డి జ‌నం. ప్ర‌చార స‌భ‌లో జ‌గ‌న్‌పైకి ఎవ‌రో ఓ అగంత‌కుడు గుల‌క‌రాయి విసిరిన ద‌గ్గ‌ర్నుంచీ ఈ బ్యాండేజీ...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close