దుర్గగుడి ఫ్లై ఓవర్ పనులు ప్రారంభం

హైదరాబాద్: విజయవాడ నగరంలో ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్ దుర్గగుడి ఫ్లై ఓవర్‌కు ఎట్టకేలకు మోక్షం కలిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ కోసం రు.467 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. పనులను రెండు ప్యాకేజిలుగా విభజించి వేర్వేరు కాంట్రాక్టర్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా ఒక ప్యాకేజ్‌లోని రు.282 కోట్ల నిర్మాణ పనులను సోమా కంపెనీ కైవసం చేసుకుంది. మరోవైపు ఫ్లై ఓవర్ కోసం నిర్వాసితులయ్యే వారికి పరిహారం చెల్లింపులు పూర్తవటంతో వారి ఇళ్ళు, దుకాణాల భవనాలను తొలగించే కార్యక్రమం ప్రారంభమయింది.

హైదరాబాద్‌నుంచి విజయవాడలోకి ప్రవేశించటానికి దుర్గగుడి ప్రాంతంలో తరచూ ఏర్పడే ట్రాఫిక్ సమస్యలు తీవ్ర ఆటంకంగా ఉన్నాయి. దీనికి పరిష్కారంగా ఒక ఫ్లై ఓవర్ నిర్మించాలని నగరవాసులు ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీనికోసం పార్టీలకతీతంగా ఉద్యమాలుకూడా జరిగాయి. తాము అధికారంలోకి వస్తే ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం చేపడతామని టీడీపీ గత ఎన్నికలలో హామీఇచ్చింది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వంనుంచి అనుమతితోపాటు నిధులుకూడా మంజూరు చేయించుకుంది. ఈ టెండర్‍‌కోసం సోమా, నవయుగ, ఎల్ అండ్ టీ సంస్థలు పోటీపడగా సోమా దక్కించుకుంది. శంకుస్థాపన కార్యక్రమం కొద్దిరోజులలో జరుగనుంది. నిర్మాణం పూర్తికావటానికి రెండేళ్ళు పడుతుందని అధికారులు చెబుతున్నారు. కృష్ణానదిలో పిల్లర్‌లు వేసి బ్యారేజి మీదగా నాలుగు లైన్‌లతో ఫ్లై ఓవర్ నిర్మిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close