కాజల్ కూడా ఐటం సాంగ్ చేస్తోందట

లక్ష్మి కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కాజల్ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లింది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కాజల్ కెరియర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ని సొంతం చేసుకుంది. మహేష్, చరణ్, ప్రభాస్, ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్ వీరందరితో జోడీ కట్టిన ఈ అమ్మడు ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది.

ఓ పక్క తెలుగులో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న అమ్మడు అటు కోలీవుడ్లో కూడా స్టార్ హీరోయిన్ గా వెళుగొందింది. అయితే రీసెంట్ గా అక్కడ కూడా పాయుం పులి సినిమాలో విశాల్ సరసన నటించి మంచి హిట్ అందుకుంది. రోజుకో కొత్త హీరోయిన్ పరిచయమవుతున్న ఈ టైంలో కేవలం పాత్రం ప్రాధాన్యత ఉన్న సినిమాలే చేస్తా అంటే కష్టమనుకుందో ఏమో ఇక రాబోతున్న సినిమాల్లో కొంచం హాట్ హాట్ గా కనబడేందుకు ఓకే చెప్పిందట కాజల్. అంతేకాదు ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే అమ్మడు ఓ స్టార్ హీరో సినిమాలో ఐటం సాంగ్ చేసేందుకు కూడా రెడీ అయ్యిందట.

కాజల్ తను చేసే సినిమాల్లోనే స్పెషల్ సాంగ్స్ చేసేందుకే ఇష్టపడదు మరి అలాంటిది వేరే సినిమాలో ఐటం సాంగ్ అంటే ఆశ్చర్యపడాల్సిందే. అయితే కాజల్ ఈ ఆఫర్ ఓకే చేసినందుకు బాగానే ముట్టచెబుతున్నారట దర్శక నిర్మాతలు. త్వరలో ఈ విషయం బయటపెట్టబోతుందట ఆ చిత్ర యూనిట్. మరి మొదటి సారి ఐటం సాంగ్ చేస్తున్న కాజల్ ఏ విధంగా ఆకట్టుకొనుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నెల్లిమర్ల రివ్యూ : అడ్వాంటేజ్ జనసేన లోకం మాధవి !

తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా జనసేన పట్టుబట్టి తీసుకున్న నియోజకవర్గం నెల్లిమర్ల. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ నియోజకవర్గం పరిధిలోనే బోగాపురం ఎయిర్ పోర్టు నిర్మించాల్సి ఉంది. కానీ జగన్ దాన్ని...

లోకేష్ యువగళం – మరో సారి బ్లాక్ బస్టర్ !

నారా లోకేష్ మంగళగిరిలో సైలెంట్ గా ప్రచారం చేసుకుంటే .. నారా లోకేష్ ఎక్కడ అని వైసీపీ నేతలు ఆరా తీస్తూ ఉంటారు. నారా లోకేష్ బయటకు వస్తే ప్రచారం ప్రారంభిస్తే...

ట్యాపింగ్ కేసులో కీలక పత్రాలు బయటపెట్టిన బండి సంజయ్ – ఎలా ?

ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరును రాధాకిషన్ రావు అనేక సార్లు చెప్పినప్పటికీ ఆయన కోసమే తాము ట్యాపింగ్ చేశామని నిర్దారించినప్పటికీ కేసీఆర్ కు ఇంత వరకూ నోటీసులు ఇవ్వకపోవడానికి కారణం ఏమిటని...

మీడియా వాచ్ : “స్టడీ”గా రవిప్రకాష్ ఈజ్ బ్యాక్ !

సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ చాలా వస్తాయి. కానీ స్టడీలు మాత్రం కొన్నే ఉంటాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో రవిప్రకాష్ స్టడీ హాట్ టాపిక్ అవుతోంది. RTV స్టడీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close