ఇక, అసోం వైపు బిజెపీ చూపు

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయజనతాపార్టీ, అంతకుముందు యుపీఏ సారధిగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు అసోం వైపు దృష్టిసారించాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కేవలం నాలుగైదు నెలల్లోనే అసోం అసెంబ్లీ ఎన్నికలు జరగబోతుండటంతో బిహార్ ఎన్నికల ఫలితాల ప్రభావం అసోంపై పడుతుందని రాజకీయపండితులు అంటున్నారు. అది నిజమేనన్నట్టుగా వివిధ పార్టీలు అసోంలో ఎవరి కుంపట్లు వారు రాజేసుకునే పనిలో పడ్డారు.

2011 ఏప్రిల్ లో రెండువిడతలుగా అసెంబ్లీకి పోలింగ్ జరిగింది. అక్కడ మొత్తం 126 నియోజకవర్గాలున్నాయి. 2011లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. తరుణ్ గోగీ ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ సాధించారు. ప్రస్తుత అసెంబ్లీకి ఐదేళ్ల గడువు ముగుస్తున్నందున 2016 మార్చి- ఏప్రిల్ మధ్య ఎన్నికలు నిర్వహించాల్సిఉంది. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదలచేసేలోగానే అక్కడి పరిస్థితులు చక్కబెట్టుకోవాలని భారతీయజనతాపార్టీ భావిస్తోంది. కాగా, తన కంచుకోట ఏమాత్రం చెదరకుండా చూసుకోవాలని మరోపక్క కాంగ్రెస్ అనుకుంటున్నది.

బిహార్ ఎన్నికలప్పుడు మహాకూటమిలో చేరి లబ్దిపొందిన కాంగ్రెస్, తనకు కంచుకోటగా భావిస్తున్న అసోంలో బిజెపీకి ఒక్కసీటు కూడా దక్కకుండా చూడాలనుకుంటున్నది. బిహార్ ఎన్నికల ప్రచారంతో ఉత్సాహాన్ని అందిపుచ్చుకున్న రాహుల్ గాంధీ వచ్చే నెలలో అసోంలో పర్యటించబోతున్నారు. అయితే ఈలోగానే అంటే నవంబర్ 27న భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అసోం వెళ్ళి అక్కడ తన పార్టీని బలోపేతం చేసేపనిలో పడబోతున్నారు. 2011 ఎన్నికలప్పుడు బిజేపీ నామమాత్రంగానే పోటీఇచ్చింది. ఐదు స్థానాలను మాత్రమే అక్కడ గెలుచుకోగలిగింది. అయితే, 2014 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బిజెపీ హవా పెంచుకుని 14 స్థానాలకుగాను ఏడింటిలో విజయం సాధించగలిగింది. అసోం రాజకీయాల్లో ఇదో సంచలనం. దీంతో బిజెపీ అసోంపై శ్రద్ధపెట్టడం మొదలుపెట్టింది. పార్లమెంటరీనియోజకవర్గాల పరిధిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహంనింపే కార్యక్రమాలను అమిత్ షా మొదలుపెట్టబోతున్నారు. దిబ్రుగఢ్ లో 27న పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారని అసోం రాష్ట్ర బిజెపీ కార్యదర్శి బహబేష్ కలితా చెప్పారు. అమిత్ షా రాకతో పార్టీలో నూతనోత్సాహం వెల్లివిరుస్తుందని అనుకుంటున్నారు. బిజెపీ కూడా ఈ అసెంబ్లీ ఎన్నికలను గతంలో లాగా ఆషామాషీగా తీసుకోదలచుకోలేదు, 2016 ఎన్నికల్లో అసోం కాషాయమయం అయిపోవడంఖాయమని పార్టీ భావిస్తోంది. అందుకే ఇప్పటి నుంచే అమిత్ షా అసోంవైపు దృష్టిసారించారు. బిహార్ లో లాగా మోదీని ప్రచారసభలకు దింపుతారా, లేక వేరే వ్యూహం అనుసరిస్తారా- అన్నది ఇంకా తేలాల్సిఉంది.

అయితే , బిహార్ ఎన్నికల ఫలితాలు బిజెపీకి మిగిల్చిన చేదు అనుభవం ఆ పార్టీకి మైనస్ పాయింట్ అనే చెప్పాలి. దీన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ చేసే విమర్శలను ఎలా తిప్పికొట్టాలో కూడా అమిత్ షా ఆలోచించాలి. మరో విశేషమేమంటే, అమిత్ షా అసోం పర్యటన పూర్తిచేసుకుని వెళ్లగానే రాహుల్ గాంధీ అక్కడకు వెళ్లబోతున్నారు. నిజానికి ఇద్దరూ ఇంచుమించు ఒకే తేదీలో అసోం కార్యక్రమాలకు వెళ్ళాల్సిఉన్నప్పటికీ, రాహుల్ పర్యటన వాయిదాపడింది. రాహుల్ తన అసోం పర్యటనలో కచ్చితంగా బిహార్ లో బిజెపీ పతనాన్ని ఎండగట్టవచ్చు. మొత్తానికి బిహార్ తర్వాత బిజెపీ-కాంగ్రెస్ వార్ కు అసోం కేంద్రబిందువు అవబోతున్నది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close