వరదసాయంలో కూడా ఆంధ్రప్రదేశ్ పై చిన్నచూపే ?

కేంద్రంతో సఖ్యతగా వుంటే రాష్ట్రానికి అధిక నిధులు తెచ్చుకోవచ్చన్న  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నమ్మకం బలహీనమైపోతోంది. వరద సాయంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కేంద్రప్రభుత్వం చూపించిన వివక్షే ఇందుకు తాజా ఉదాహరణ.

తమిళనాడుకు రూ.940 కోట్ల వరద సాయం ప్రకటించిన కేంద్రం, ఆంధ్ర ప్రదేశ్‌కు మొండిచెయ్యి చూపడం దారుణమైన అన్యాయం. వర్షాలు, వరదలకు తమిళనాడుతో పాటు దక్షిణాంధ్రలోని మూడు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. వేలాది కుటుంబాలు జలదిగ్బంధనలో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి. లక్షలాది హెక్టార్లలో పంట నీట మునిగాయి. రెండు రాష్ట్రాల్లోనూ కొన్ని జిల్లాలను కోలుకోలేని దెబ్బతీశాయి. మన రాష్ట్రంలో ఇప్పటికే ఈ వర్షాలు, వరదలకు 32 మంది చనిపోయారు. మూడువేల కోట్లకు పైగా ఆస్తినష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. ఒక్క నెల్లూరు జిల్లాలోనే రూ.1350 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో తమిళనాడుకు మాత్రమే సాయం ప్రకటించి, ఆంధ్రప్రదేశ్‌ను విస్మరించడం కేంద్ర ప్రభుత్వ సంకుచిత, ఏకపక్ష వైఖరిని బైటపెడుతోంది. రెండు వేల కోట్ల వరద సాయం కావాలని కోరిన తమిళనాడుకు రూ. 940 కోట్లు ఇచ్చారు. కేంద్ర బృందాన్ని త్వరలో అక్కడికి పంపి నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన మీదట మరింత సాయం అందిస్తామని చెప్పారు. తమిళనాడులో వరద నష్టం రూ.8,481 కోట్లు అని , కేంద్రం తక్షణ సాయం కింద రెండు వేల కోట్లు ఇచ్చి ఆదుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత  కేంద్రానికి లేఖ రాసిన వెంటనే కేంద్రం సాయం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మూడు వేల కోట్ల వరద నష్టాన్ని చూపి తక్షణ సాయంగా వెయ్యి కోట్లు కావాలని కోరితే ముఖం చాటేసింది.

అయితే తమిళనాడుకి తక్షణ సాయం ప్రకటించాక ఎపి ఏడ్చిపోతుందనుకున్నారో ఏమో 700 కోట్ల రూపాయలు విడుదల చేశారు. అది వరదసాయం కాదు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధుల, పోలవరం ప్రాజెక్టు నిధుల బకాయిలు మాత్రమే!

ఆంధ్రప్రదేశ్‌ పట్ట కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందనడానికి ఇది మరో నిదర్శనం. విభజనానంతరం కేంద్ర ప్రభుత్వం నుండి తీవ్ర నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటున్న ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజలకు ఇది పుండుమీద కారం రాయడమే అవుతూంది.

గత ఏడాది ఉత్తరాంధ్రను కుదిపేసిన హుదూద్‌ తుపాను విషయంలోనూ కేంద్రం ఇలాగే వ్యవహరించింది. ప్రధాని నరేంద్రమోదీ ఆనాడు స్వయంగా ప్రకటించిన వెయ్యి కోట్లు రూపాయలలో 650 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. సర్దుబాటు పేరుతో అందులోనూ 150 కోట్ల రూపాయలు కోత పెట్టి చివరికి రు 400 కోట్లు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు.

అప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపలేదు. విభజన సమయంలో ఆంధ్ర ప్రదేశ్‌ పునర్నిర్మాణానికి ప్రత్యేక హోదాతో సహా కేంద్రం ఇచ్చిన పలు హామీలను మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కుతుంటే గుడ్లప్పగించి చూడడమే తప్ప దీనిపై నిలదీసే రాష్ట్ర పాలకులకు రావడంలేదు. వరదల విషయంలోనూ కేంద్రానికి విన్నపాలతోనే సరిపెడుతున్నది తప్ప కేంద్రంతో పోట్లాడడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావడం లేదు.

చంద్రబాబునాయుడు ఇప్పటికైనా ఆలోచనమార్చుకోవాలి.న్యాయంగా, ధర్మంగా రాష్ట్రానికి రావలసిన నిధుల విడుదల, హక్కుల అమలు కోసం నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని విన్నపాల వైఖరినుంచి – ప్రశ్నించే, నిలదీసే నిర్మొహమాట ధోరణికి కార్యాచరణను మార్చుకోవాలి.

రాష్ట్రం తన వంతు బాధ్యత నిర్వర్తిస్తూనే, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన విపత్తు సహాయక నిధులను రాబట్టేందుకు కృషిచేయాలి. ఈ విషయంలో కేంద్రం మెడ వంచేలా అఖిల పక్ష బృందాన్ని పంపాలి. శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీసేలా పార్టీ ఎంపిలను సిద్ధం చేయాలి.

బిజెపి రాష్ట్ర నాయకులు కూడా అన్నివిధాలా నష్టపోయివున్న ఆంధ్రప్రదేశ్ పట్ల ఏవిధమైన వివక్షా చూపరాదని ఆ పార్టీ కేంద్ర నాయకులకు నచ్చజెప్పాలి. లేని పక్షంలో వచ్చే ఎన్నికల అనంతరం ఈ పార్టీని ఓదార్చేవారు కూడా ఆంధ్రప్రదేశ్ లో వుండరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close