గ‌తాన్ని, భ‌విష్య‌త్తునీ క‌లిపిన ప్రేమ‌క‌థ‌

ఓ పాత కాలం నాటి ఫోన్ ట్రింగ్ ట్రింగ్ అని మోగుతోంది. ఫోన్ మోగ‌డం విచిత్రం కాదు. కానీ.. దానికి ఎలాంటి క‌నెక్ష‌న్ లేకుండా మోగ‌డ‌మే విచిత్రం. అంతేనా..? అవ‌త‌ల ఓ అమ్మాయి గొంతు. ఆమె ఈకాలానికి చెందిన అమ్మాయి కాదు. ఇంకా గ‌తంలోనే ఉన్న అమ్మాయి. తాను భ‌విష్యత్తులో ఉన్న అబ్బాయికి కాల్ చేస్తుంది. కాన్సెప్టు విచిత్రంగా ఉంది క‌దూ. `ప్లే బ్యాక్‌` సినిమా పాయింట్ ఇది. రెండు విభిన్న కాలాల‌కు చెందిన ఇద్ద‌రు వ్య‌క్తులు ప్రేమ‌లో ప‌డితే ఎలా ఉంటుందో చూపిస్తున్నారు.చిన్న సినిమాల‌కు క‌థే బ‌లం. పాయింట్ కొత్త‌గా ఉంటే చాలు. స్టార్లు లేకున్నా ఫ‌ర్వాలేదు. ఇప్పుడు ఆ క‌థాబ‌లంతోనే ఈసినిమా తెరకెక్కించామంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. శుక్ర‌వార‌మే.. ట్రైల‌ర్ విడుద‌లైంది. అందులో కాన్సెప్టు అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. మ‌రి గ‌తానికీ, భ‌విష్య‌త్తుకీ లింకేసిన ఆ ఫోన్ లో ఉన్న మ్యాజిక్ ఏమిటో తెలియాలంటే సినిమా రావాల్సిందే.

దినేష్ తేజ్ హీరోగా అనన్య నాగళ్ళ జంట‌గా న‌టించిన చిత్ర‌మిది. హరి ప్రసాద్ జక్కా దర్శకత్వం వ‌హించారు. మార్చి 5న ఈ చిత్రం విడుదల కాబోతోంది. కొత్త కాన్సెప్టుల‌కు పట్టం క‌ట్టే తెలుగు ప్రేక్ష‌కులు.. ఈ ప్లే బ్యాక్ కి ఎలాంటి స్థానం ఇస్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సాగర్‌లో కేసీఆర్ సభ ఉంటుందా..?

నాగార్జున సాగర్‌లో గెలవడానికి గతంలో చేసిన తప్పులు చేయకూడదని అనుకుంటున్న కేసీఆర్... బహిరంగసభ పెట్టి ప్రచారం చేయాలని అనుకుంటున్నారు. షెడ్యూల్ కూడా ఖరారు చేసుకున్నారు. పధ్నాలుగో తేదీన సభ నిర్వహణకు ఏర్పాట్లు కూడా...

క్రైమ్ : హోంగార్డు భార్య మర్డర్ “మిస్‌ఫైర్”

చేతిలో తుపాకీ ఉంది. ఎదురుగా చంపేయాలన్నంత కోపం తెప్పించిన భార్య ఉంది. అంతే ఆ ఆ పోలీసు ఏ మాత్రం ఆలోచించలేదు. కాల్చేశాడు. తర్వాత పోలీస్ బుర్రతోనే ఆలోచించారు. తుపాకీ మిస్ ఫైర్...

పవన్‌ది అసంతృప్తి క్వారంటైనా..!?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనూహ్యంగా తాను క్వారంటైన్‌లోకి వెళ్తున్నట్లుగా ప్రకటించారు. తన వ్యక్తిగత భద్రతా సిబ్బందికి వైరస్ సోకిందని అందుకే తాను.. వైద్యుల సూచనల మేరకు క్వారంటైన్‌లోకి వెళ్తున్నట్లుగా సందేశం...

వివేకా కేసులో మళ్లీ వచ్చిన సీబీఐ…!

వివేకా హత్య కేసును ఎవరూ తేల్చడం లేదు. ఏపీ పోలీసులు తేల్చలేదు. సిట్‌ల మీద సిట్‌లు వేసినా మార్పు రాలేదు. చివరికి హైకోర్టు సీబీఐకి ఇచ్చినా అదే పరిస్థితి. రెండు విడతలుగా సీబీఐ...

HOT NEWS

[X] Close
[X] Close