ఆంధ్రప్రదేశ్లో జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం ఓ సంచలనం. ఆ స్కామ్ చేసిన విధానం చూసి పెద్ద పెద్ద డాన్లు కూడా ఆశ్చర్యపోతారు. అలాంటి స్కెచ్ తో ప్రజల రక్త మాంసాలను కూడా కొల్లగొట్టారు. సీఐడీ సిట్ అధికారులు మొత్తం బయటకు తీసి నిందితుల్ని బయట పెట్టారు. ఈ క్రమంలో .. కొంత మంది ఔత్సాహికులు డాక్యుమెంటరీ తరహాలో ఓ సినిమాను కూడా రెడీ చేశారు. ఆ సినిమా ట్రైలర్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.
ద రియాలిటీ – లిక్కర్ స్కాం అనే పేరుతో వచ్చిన ట్రైలర్ వైరల్ అయింది. అయితే ఈ సినిమాలో కల్పిత కథగా చెప్పడం లేదు. నేరుగా జరిగిన కథగా చెబుతున్నారు. ఇందులో కల్పిత పాత్రలు ఉన్నాయి. మందు బాబులు, వారి కుటుంబాల వ్యధలు, జగన్ అండ్ గ్యాంగ్ అమ్మిన నాసిరకం లిక్కర్ వల్ల ప్రజలు పడిన బాధలతో పాటు.. సంపాదించిన డబ్బులు ఎలా .. సర్క్యూలేట్ చేశారు.. ఎలా వైట్ గా మార్చారన్నది కూడా ఇందులో వివరించినట్లుగా తెలుస్తోంది.
లిక్కర్ స్కాం జరిగిందని ప్రతి ఒక్కరూ నమ్ముతారు. అందుకే లిక్కర్ స్కాం విషయంలో ఎలాంటి వార్త బయటకు వచ్చిన సంచలనం అవుతోంది. పూర్తి స్థాయి సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నదానిపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఇది ధియేటర్లలో విడుదల చేసే అవకాశం లేదు. యూట్యూబ్ లోనే విడుదల చేసే అవకాశం ఉంది. గతంలో వివేకా హత్యపైనా.. వివేకం పేరుతో.. సైలెంట్ గా సినిమా షూట్ చేసి.. యూట్యూబ్లో రిలీజ్ చేశారు.