దళిత బంధు : కొత్తగా నాలుగు మండలాలపై హడావుడి ఎందుకు ?

తెలంగాణలో దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ మొత్తం అమలు చేస్తున్నారు. అయితే అక్కడ ఇంకా పూర్తి స్థాయిలో అమలు ప్రారంభం కాలేదు. సర్వే, యూనిట్లు,లబ్దిదారుల దగ్గరే ఉంది. అయితే సీఎం కేసీఆర్ కొత్తగా మరో నాలుగు మండలాలపై దృష్టి పెట్టారు. ఈ ప్రకారం మధిర అసెంబ్లీ నియోజకవర్గంలోని చింతకాని మండలం, తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం, అచ్చంపేట-కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చారగొండ మండలం, జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలాల్లో లబ్దిదారులందరికీ పథకం వర్తింప చేయబోతున్నారు.

ఈ మండలాల్లో పథకం అమలు .. విధి విధానాలు ఖరారు చేసేందుకు సోమవారం సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కేసీఆర్ ముందుగా దళిత బంధుపైనే దృష్టి పెట్టారు. రాష్ట్రానికి నాలుగు దిక్కుల ఉన్న నాలుగు మండలాలను పైలట్ ప్రాజెక్టుగా సీఎం ఎంపిక చేయడంతో ఆ జిల్లాల మంత్రులు, కలెక్టర్లు తదితరులను ఈ మీటింగుకు రావాల్సిందిగా సమాచారం పంపారు. ఈ నియోజకవర్గాల్లోని దళిత కుటుంబాల సంఖ్య, వాటి జీవన ప్రమాణాలు, ఆర్థిక పరిస్థితి, దళితబంధు ద్వారా నిలదొక్కుకోడానికి ఉన్న అవకాశాలపై చర్చిస్తారు.

హుజురాబాద్ ఉపఎన్నిక ఎప్పుడు జరుగుతుందో క్లారిటీ లేదు. పండుగల సీజన్ అయిపోయిన తర్వాత నిర్వహించాలని తెలంగాణ సర్కార్ కోరింది. అంటే దసరా తర్వాత అనుకోవచ్చు. అప్పటికి నవంబర్ వస్తుంది. అప్పటికి కరోనా పరిస్థితి ఏ మాత్రం పెరిగినట్లుగా ఉన్నా.. ఎన్నిక జరిగే అవకాశం లేదు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోనే నిర్వహించే అవకాశం ఉంటుంది. అందుకే కేసీఆర్‌కు బిగ్ ప్లాన్స్ ఉన్నాయని.. ఆ కోణంలోనే నిర్ణయాలు తీసుకుంటున్నారన్న చర్చ నడుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఖ‌మ్మం పంచాయితీ మ‌ళ్లీ షురూ… ఈసారి కాంగ్రెస్ లో!

ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాలు అంటేనే ఎప్పుడూ ఏదో ఒక పంచాయితీ న‌డుస్తూనే ఉంటుంది. అధికార పార్టీలో నాయ‌కుల మ‌ధ్య స‌యోధ్య చాలా క‌ష్టం. మొన్న‌టి వ‌ర‌కు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో తుమ్మ‌ల‌,...

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

తమ్మినేనికి డిగ్రీ లేదట – అది ఫేక్ డిగ్రీ అని ఒప్పుకున్నారా ?

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం నామినేషన్ వేశారు. అఫిడవిట్ లో తన విద్యార్హత డిగ్రీ డిస్ కంటిన్యూ అని పేర్కొన్నారు. కానీ ఆయన తనకు డిగ్రీ పూర్తయిందని చెప్పి హైదరాబాద్ లో...

గుంతకల్లు రివ్యూ : “బెంజ్‌ మంత్రి”కి సుడి ఎక్కువే !

మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు బెంజ్ మంత్రి అని పేరు పెట్టారు టీడీపీ నేతలు. ఇప్పుడా బెంజ్ మంత్రిని నెత్తికి ఎక్కించుకుని మరీ ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించడానికి కృషి చేస్తున్నారు. రాజకీయాల్లో ఓ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close