సిద్ధార్థ్‌కు ఉన్నంత ఫైర్ కూడా మనోళ్లలో లేదా !?

సినీ పరిశ్రమను వేధించవద్దని తమిళ నటుడు సిద్ధార్థ్ వరుసగా చేసిన ట్వీట్లు ఇప్పుడు వైరల్ అయ్యాయి. నిజానికి ఆయన ఫుల్ టైం తెలుగు యాక్టర్ కాదు. కానీ తెలుగులో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ టాలీవుడ్‌ మొత్తం తమకు ఎదురవుతున్న సమస్యల గురించి ఒక్కరంటే ఒక్కరూ స్పందించలేదు. కానీ సిద్ధార్ధ్ స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి వంటి వారు ప్లీజ్… ప్లీజ్ అంటున్నారు. కానీ బతిమాలటంతో ఎప్పుడూ ఫలితాలు ఉండవని.. పోరాడి సాధిస్తేనే ఏదైనా నిలబడుతుందని గుర్తించలేకపోతున్నారు. ఇప్పుడు సిద్ధార్థ్ ఈ విషయంలో అందరికీ ఓ సవాల్ విసిరాడు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. అక్కడి పాలకులు ఏం ఆశిస్తున్నారో కానీ మొత్తంగా ఇండస్ట్రీని పూర్తి స్థాయిలో దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. టిక్కెట్ ధరలు రూ. ఐదు నుంచి ప్రారంభమవుతాయని .. తెలిసి దేశం మొత్తం ఆశ్చర్యంగా చూసింది. ఇక బెనిఫిట్ షోలు… అదనపు ఆటలు ఇలా అనేక ఆంక్షలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి ఉంటే ధియేటర్లు మూసేసుకోవడం మంచిదని ఇప్పటికే అనేక మంది ఎగ్జిబిటర్లు ఫిక్సయ్యారు. కానీ టాలీవుడ్ పెద్దల్లో మాత్రం చలనం లేదు.

ప్రభుత్వంపై తిరగబడితే అసలుకే మోసం వస్తుందని .. ఆస్తులపై దాడులు చేస్తారని.. మరొకటని ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు భయపడుతున్నారనేది బహిరంగసత్యం. అందుకే ప్రభుత్వం ఈ విషయంలో మరింత దూకుడుగా ఉంది. బహిరంగ బెదిరింపులకు పాల్పడుతోంది. తమ అభిప్రాయాలను సైతం నిక్కచ్చిగా చెప్పలేక అణుచుకుంటోంది. నిత్యావసర వస్తువులు.. మద్యం వంటి వాటిపై లేని నియంత్రణ… ప్రజలకు ఇష్టమైతే చూస్తారు..లేకపోతే లేదనే సినిమాపై ఎందుకని ప్రతి ఒక్కరికీ అడగాలని ఉంది. కానీ ఎవరూ అడగడం లేదు.

టాలీవుడ్‌కు ఇప్పుడు సిద్ధార్థ్ ఓ దారి చూపించారు. ఇప్పుడైనా టాలీవుడ్ మొత్తం ఏకమై ప్రభుత్వంపై ఉద్యమం ప్రకటిస్తే సరి.. లేకపోతే మరింతగా అణిచివేస్తారు. టాలీవుడ్ గొంతెమ్మ కోరికలేం కోరడంలేదు.. అన్ని రాష్ట్రాల్లో టిక్కెట్ రేట్లు ఎలా ఉన్నాయో అలానే ఉండాలని కోరుతోంది. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే నిబంధనలు ఉండాలని అంటోంది. ఈ కనీస హక్కులకు కూడా సారగిలపడిపోతే మొదటికే మోసం వస్తుంది.అందుకే కార్యాచరణ ఖరారు చేసుకోవాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్ సర్కార్ చేస్తున్న అప్పుల కన్నా “రీ పే” ఎక్కువ !

రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అప్పులు భారీగా చేస్తోందని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. తాము తెచ్చిన అప్పుల కన్నా చెల్లించేది ఎక్కువని లెక్కలు విడుదల చేసింది. కేసీఆర్...

వైసీపీలో బొత్స వర్సెస్ విజయసాయి..!?

దశాబ్దాల చరిత్ర ఉన్న విశాఖ వాల్తేరు క్లబ్ పై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు పార్టీలో కొత్త వివాదానికి తెరలేపాయి.2014లో వైఎస్ విజయమ్మ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటిగా ...

కవిత కోసం బీజేపీకి కేసీఆర్ సరెండర్ అయ్యారా..?

లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవితను కాపాడుకునేందుకు కేసీఆర్ ప్రధాని మోడీతో కుమ్మక్కయ్యారా..? అందులో భాగంగానే ఐదు లోక్ సభ స్థానాల్లో బీజేపీకి సహకరించేందుకు కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారా..? రాష్ట్రంలో రేవంత్...

డబ్బుతో కొడుతున్నారు : లాజిక్ మిస్సవుతున్న వైసీపీ !

డబ్బుతో ఏమైనా చేయవచ్చా ?. ఏమీ చేయలేరని చాలా ఘటనలులు నిరూపించాయి. చివరికి ఎన్నికల్లో కూడా గెలవలేరని.. డబ్బులు విచ్చలవిడిగా పంచినా.. బీఆర్ఎస్ ఓటమి నిరూపించింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close