బ‌న్నీ # 21.. కాన్సెప్ట్ అదేనా?

అల్లు అర్జున్ న‌టిస్తున్న 20వ సినిమా `పుష్ష‌`. అది సెట్స్‌పై ఉండ‌గానే 21వ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. ఈ చిత్రానికి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. సుధాక‌ర్ మిక్కిలినేని నిర్మాత‌. ఈ సినిమా కి సంబంధించిన అఫీషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్ ఈ రోజు బ‌య‌ట‌కు వ‌చ్చింది. పోస్ట‌ర్‌లో ఓ వైపు ఎలాంటి సౌక‌ర్యాలు లేని ప‌ల్లెటూరి, అటువైపు అధునాతన హంగుల‌తో ఉన్న ప‌ట్నం క‌నిపిస్తున్నాయి. మ‌ధ్య‌లో ఓ న‌ది. ఇవ‌న్నీ చూస్తుంటే… ప‌ల్లెకీ ప‌ట్నానికీ మ‌ధ్య అంత‌రాన్ని చెప్పే సినిమా ఏమో అనిపిస్తోంది. కొర‌టాల శివ క‌థ‌ల‌న్నీ ఏదో ఓ సామాజిక అంశాన్ని సృశిస్తుంటాయి. ఈసారి..ప‌ల్లె – ప‌ట్నం అనే కాన్సెప్టుని ఎంచుకున్నాడ‌నిపిస్తోంది. ఈ సినిమాలో బ‌న్నీని విద్యార్థి నాయ‌కుడిగా చూపించ‌నున్నార‌ని ముందు నుంచీ ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇవ‌న్నీ ఊహాగానాలేనా? అస‌లు క‌థేమిటి? అనేది తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు ఆగాలి. ఇటు పుష్ష‌, అటు ఆచార్య రెండూ పూర్త‌య్యాకే.. ఈప్రాజెక్టు మొద‌ల‌వుతుంది. బ‌హుశా 2021 చివ‌ర్లో గానీ… ఈసినిమా ప‌ట్టాలెక్క‌దేమో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్‌కు గుడి కాదు చర్చి కట్టాలన్న ఆర్ఆర్ఆర్..!

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ముఖ్యమంత్రి జగన్ కు గుడి కట్టడానికి ఏర్పాట్లు చేయడం.. భూమి పూజ చేయడం వివాదాస్పదమవుతోంది. ఖచ్చితంగా అయోధ్య రామాలయానికి శంకుస్థాపన జరుగుతున్నప్పుడే.. తలారి...

మంచు వారి ‘ఓటీటీ’

ప్ర‌తీ సినీ కుటుంబానికీ ఓ నిర్మాణ సంస్థ ఉండ‌డం ఎంత స‌హ‌జంగా మారిందో, ఇప్పుడు ఓ ఓటీటీ సంస్థ ఉండ‌డం కూడా అంతే రివాజుగా మార‌బోతోంది. ఓటీటీ సంస్థ‌ల ప్రాధాన్యం క్ర‌మంగా పెరుగుతోంది....

వార‌సుడిపై దృష్టి పెట్టిన బాల‌య్య‌

లాక్ డౌన్ లో స్టార్లంతా ఇంటికే ప‌రిమితం అయ్యారు. వివిధ ర‌కాల వ్యాపాల‌తో బిజీగా మారారు. బాల‌కృష్ణ కూడా అంతే. అయితే ఈ విరామాన్ని ఆయ‌న త‌న వార‌సుడి కోసం కేటాయించారు. మోక్ష‌జ్ఞ...

క‌థ‌ల కోసం యూవీ అన్వేష‌ణ‌

యూవీ క్రియేష‌న్స్ పేరు చెప్ప‌గానే సాహో, రాధేశ్యామ్ లాంటి భారీ చిత్రాలు గుర్తొస్తాయి. అయితే ప్ర‌స్తుతం యూవీ చిన్న సినిమాల‌వైపు దృష్టి పెట్టింది. ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాల్ని ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉంది....

HOT NEWS

[X] Close
[X] Close