ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లిందంటే, ఆ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారు, జోనర్ ఏమిటి? టైటిల్ ఏమిటి? అనే విషయాల్ని మీడియా ముందుగా లీక్ చేసేస్తోంది. పెద్ద పెద్ద సినిమాలకు ఈ లీకేజీ బెడద ఎక్కువగా ఉంటోంది. అయితే అల్లు అర్జున్ – అట్టీ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకూ ఒక్క విషయం కూడా రివీల్ కాలేదు. అంతగా టీమ్ జాగ్రత్తలు తీసుకొంటోంది. ఈ సినిమా టైటిల్ ఏమిటన్న విషయంలో ఇప్పటి వరకూ ఒక్క క్లూ కూడా దొరకలేదు.
ఈనెల 8న బన్నీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా టైటిల్ ఏమిటన్నది అధికారికంగా రివీల్ చేస్తారు. టైటిల్ ఏమిటన్న విషయంలో ఇప్పటి వరకూ ఒక్క లీక్ కూడా లేకుండా జాగ్రత్త పడ్డారు. బన్నీ, అట్లీ లకు తప్ప టైటిల్ ఏమిటన్నది ఎవ్వరికీ తెలీదు. ఆఖరికి బన్నీ పీ.ఆర్ టీమ్ కి కూడా. సోషల్ మీడియాలో వదలడానికి పది నిమిషాల ముందు మాత్రమే కంటెంట్ ఇస్తానని అట్లీ చెప్పాడట.
ఇంత పకడ్బందీగా వ్యవహరిస్తున్నారంటే.. టైటిల్ తో ఏదో షాక్ ఇవ్వబోతున్నట్టే అనిపిస్తోంది. మరోవైపు బన్నీ వాసు, ఎస్కేఎన్, బన్నీ పర్సనల్ పీఆర్ శరత్ ట్విట్టర్లో చిన్న చిన్న హింట్స్ ఇచ్చి.. ఫ్యాన్స్ ని ఊరిస్తున్నారు. నిజానికి ఈ టైటిల్ ఏమిటన్నది వాళ్లకు కూడా తెలీదని సమాచారం. ‘వైల్డ్ ఫైర్’ అనే టైటిల్ మాత్రం ఫిల్మ్ ఛాంబర్ లో ఓ నిర్మాత రిజిస్టర్ చేయించారు. ఆ టైటిల్ కీ, ఈ సినిమాకీ ఏమైనా సంబంధం ఉందా? అనేది కూడా సస్పెన్సే.మంగళవారం ప్రీ లుక్ తో ఓ ఎనౌన్స్మెంట్ పోస్టర్ వదలబోతున్నారు. బుధవారం టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రివీల్ చేస్తారు.బన్నీ సినిమా టైటిల్ తెలియాలంటే.. బుధవారం వరకూ ఆగాల్సిందే.