ఆది సాయికుమార్ నటిస్తున్న మిస్టికల్ థ్రిల్లర్ ‘శంబాల’. యుగంధర్ ముని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. “పరమశివుడికి, అసురుడికి మధ్య జరిగిన యుద్ధమే ఈ కథకు మూలం” అంటూ సాయికుమార్ వాయిస్‌తో ట్రైలర్ ప్రారంభమైంది.
ట్రైలర్లో కథని ఆసక్తికరంగా ప్రజెంట్ చేశారు. దేవుడు, నమ్మకం, సైన్స్ — ఈ మూడింటి మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్తో నడిచే కథ ఇది. మిస్టికల్ ఎలిమెంట్స్‌తో కూడిన సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ట్రైలర్లో హీరో క్యారెక్టర్ ఆర్క్ను కూడా రివీల్ చేశారు. సైన్స్ మాత్రమే సత్యమని నమ్మే హీరో, చివరికి సైన్స్ కంటే మించిన శక్తి ఉందని గ్రహిస్తాడు.
శంబాల గ్రామంలో జరిగే కొన్ని సంఘటనలు హారర్, మిస్టరీ ఫీలింగ్‌ను తీసుకొచ్చాయి. ఆది సాయికుమార్ ఇప్పటివరకు చేయని పాత్రలో కనిపించాడు. అర్చన అయ్యర్, రవివర్మ పాత్రలు కీలకంగా కనిపించాయి. మ్యూజిక్, కెమెరా వర్క్, సిజీ వర్క్ డీసెంట్‌గా ఉన్నాయి. ఆదికి చాలా కాలంగా విజయం దూరమైపోయింది. శంబాల ట్రైలర్ పాజిటివ్‌గా ఉంది. మరి ఈ సినిమా ఆది కెరీర్‌కు కొత్త టర్న్ అవుతుందేమో చూడాలి.
