రివ్యూ: ఆది కేశవ


Aadikeshava Movie Telugu Review

తెలుగు360 రేటింగ్ : 2.25/5

కమర్షియల్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ ‘మెగా’ హీరోలు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అందరు హీరోలు కమర్షియల్ మాస్ మసాలా సినిమాలతో అలరించినవారే. ఇప్పుడా లిస్టులో చేరడానికి తనవంతు ఓ ప్రయత్నం చేశాడు వైష్ణవ్‌ తేజ్‌. ఉప్పెన తర్వాత వైష్ణవ్‌ తేజ్‌కి మళ్ళీ చెప్పుకొదగ్గ సినిమా పడలేదు. కొండపొలం, రంగరంగ వైభవంగా చిత్రాలు నిరాశ పరిచాయి. అయితే ఇప్పుడా మూడు చిత్రాలకు భిన్నంగా ‘ఆది కేశవ’తో ఒక పూర్తి స్థాయి మాస్ మసాలా మూవీ చేశాడు. ట్రైలర్ చూడగానే ఈ విషయం అర్ధమైయింది. అటు చిత్ర యూనిట్ కూడా ఇది మాస్ కమర్షియల్ సినిమాగానే ప్రచారం చేసింది. ఈ తరహ సినిమాలకి కొన్ని కొలతలు వుంటాయి. ఆ కొలతలు సరిగ్గా కుదరాలి. అందులోనే కొత్తదనం చూపించాలి. అప్పుడే జనరంజకంగా వుంటుంది. మరి ఈ విషయంలో ఆది కేశవ ఎంత కొత్తదనం చూపించింది? మాస్ మసాలా కమర్షియల్ అంశాలు ప్రేక్షకులకు ఎంతలా వినోదాన్ని పంచాయి? తొలిసారి మాస్ అవతార్ లో కనిపించిన వైష్ణవ్‌ తేజ్‌ ఎంతలా మెప్పించాడు ?

అనంతపురంలోని బ్రహ్మసముద్రం అనే గ్రామంలో చెంగారెడ్డి( జోజు జార్జ్) అరాచకాలు రాజ్యమేలుతుంటాయి. అతడి దాష్టికానికి అడ్డు అదుపు వుండవు. ఆ గ్రామంలో పెద్దలకు పని వుండదు. చిన్న పిల్లలకు చదువు వుండదు. పిల్లలని చదువుమాన్పించి వాళ్ళతో క్వారీలో పని చేయిస్తుంటాడు చెంగారెడ్డి. అతడి దురాశకు హద్దులేదు. భూములని అన్యాయంగా ఆక్రమించి చివరికి గ్రామంలోని శివాలయాన్ని కూడా తవ్వించేయాని చూస్తాడు. కట్ చేస్తే.. హైదరాబాద్ వుండే బాలు ( వైష్ణవ్‌ తేజ్‌) పనీపాట లేకుండా తిరిగే ఓ జులాయి. బాలు తండ్రి ( జయప్రకాష్) ఎక్సైజ్ శాఖలో ఉద్యోగి, తల్లి( రాధిక శరత్ కుమార్), అన్నయ్య డాక్టర్. ఇంట్లో బాలు ఒక్కడే గాలికి తిరుగుతుంటాడు. ఎదో ఒక ఉద్యోగంలో చేరమని ఇంట్లో వాళ్ళు బలవంతం చేస్తుంటారు. ఇంట్లో బాధ భరించలేక ఓ కాస్మోటిక్ కంపెనీ ఇంటర్వ్యూ కి వెళ్తాడు. ఆ కంపనీ సిఈవో చిత్ర( శ్రీలీల) బాలు తెలివితేటలు చూసి ఉద్యోగం ఇస్తుంది. వాళ్ళ మధ్య పరిచయం ప్రేమకూడా మారుతుంది. అయితే ఇంతలో బాలుకి ఓ నిజం తెలుస్తుంది. దీంతో బ్రహ్మసముద్రం గ్రామానికి వెళ్ళాల్సివస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది ? బాలు తెలుసుకున్న నిజం ఏమిటి ? ఈ కథలో మహా కాళేశ్వర్ రెడ్డి (సుమన్) వజ్ర కాళేశ్వర్ రెడ్డి ( అపర్ణ దాస్) పాత్రల ప్రాధన్యత ఏమిటి ? చెంగారెడ్డి అరాచకాలకు బాలు ముగింపు పలికాడా లేదా ? అనేది మిగతా కథ.

ముందే చెప్పినట్లు ఇది కమర్షియల్ సినిమా కొలతల్లో నడిచిన కథ. బ్రహ్మసముద్రం లోని చెంగారెడ్డి అరాచకాలతో కథ మొదలౌతుంది. ఈ కథకు మూలం బ్రహ్మసముద్రంలో వుంది. అయితే దాన్ని మొదటి సీన్ దగ్గరే వదిలేసి.. దాదాపు ఇంటర్వెల్ వరకూ రొటీన్ మాస్ మసాలా కమర్షియల్ ఫిల్లర్స్ ని పేర్చుకుంటూ వెళ్ళాడు దర్శకుడు. ఒక రొటీన్ ఫైట్ తో హీరో ఎంట్రీ ఇస్తాడు. అంతే రొటీన్ స్టయిల్ లో నాలుగైదు హిట్టు పాటలకు డ్యాన్స్ చేస్తూ హీరోయిన్ శ్రీలీల తెరపైకి వస్తుంది. హీరోయిన్ ఎంట్రీ రొటీన్ గా ఉన్నప్పటికీ శ్రీలీలని కేవలం డ్యాన్స్ కోసమే తీసుకున్నారని సింబాలిక్ చెప్పినట్లయింది. ఇక హీరో, హీరోయిన్ ట్రాక్ కూడా రొటీనే. హీరోయిన్ ఓ ప్రముఖ కంపెనీ సిఈవో. ఆ కంపెనీలో హెచ్ఆర్ లేరేమో.. స్వయంగా సిఈవోనే ఇంటర్వ్యూ చేసి హీరోని సెలెక్ట్ చేస్తోంది. కమర్షియల్ సినిమాల రూలు ప్రకారం రెండో సీన్ లోనే ఇద్దరికీ ఫీలింగ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. ఓ రెండు పాటల తర్వాత ఇంటర్వెల్ సన్నివేశం కూడా వచ్చేస్తింది. అప్పటివరకూ కథ ఏం జరగలేదని తెలుసుకున్న దర్శకుడు.. ఓ రొటీన్ ట్విస్ట్ ని తెరపైకి తెచ్చి ఇంటర్వెల్ కార్డ్ వేస్తాడు.

తొలి సగంతో పోల్చుకుంటే రెండో సగం కొంతలో కొంత బెటరు. బాలు బ్రహ్మసముద్రం వెళ్ళాక కథ కాస్త ముందుకు కదిలినట్లనిపిస్తుంది. చెంగారెడ్డితో వార్ మొదలైన తర్వాత వచ్చే సన్నివేశాలు కాస్త ఆసక్తిని రేపుతాయి. మహా కాళేశ్వర్ రెడ్డి స్థానంలో వజ్ర కాళేశ్వర్ రెడ్డిని ఎన్నికల్లో నిలబెట్టడం, గుడిలో తనపై దాడి చేసిన వ్యక్తిని సజీవంగా దహనం చేయడం కొంత ఉత్కంఠని రేపుతాయి. అయితే తెరపై సన్నివేశాలు జరుగుతుంటాయి కానీ అందులో ఎమోషన్ ప్రేక్షకులకు పట్టదు. అటు హీరో పాత్ర కూడా కథని వోన్ చేసుకునే విధంగా వుండదు. కారణం.. ఈ పాత్రని రాసుకున్న తీరులోనే ఎమోషన్ లేదు.

పిల్లల రూపంలో ఎమోషన్ పిండాలని ప్రయత్నించారు కానీ అది కాస్త ఓవర్ డ్రమటిక్ గా అనిపించింది. హీరోలో ఎమోషన్ రావడానికే చనిపోయిన పాపకి నెయిల్ పాలిష్ వేసే సన్నివేశం పెట్టినట్లు ఉంటుందని కానీ అందులో అంత నిజాయితీ కనిపించదు. ఇందులో ప్రధానంగా వుండే మరో సమస్య ఏమిటంటే.. హీరో, విలన్ కి ఒక లక్ష్యాన్ని అంటూ నిర్దేశించలేదు దర్శకుడు. అందుకే తెరపై వస్తున్న సన్నివేశాలు ప్రేక్షకులకుని ఎటువైపు డ్రైవ్ చేయలేకపోయాయి. ఏవేవో సినిమాల్లోని సీన్స్ చూస్తున్నట్లు అనిపిస్తాయి తప్పితే.. వాటికి ఒక లక్ష్యం అంటూ లేకుండాపోయింది. హీరో, విలన్ ఎదురుపడి ఒక ఫైట్ చేస్తే అయిపోయే కథని ఎందుకు ఇంత సాగదీస్తున్నారనే భావన కలుగుతుంది. దర్శకుడు కూడా ఈ కథని, అందులో ని ఎమోషన్ ని అంత సీరియస్ గా తీసుకోలేదని చివర్లో ఇచ్చిన మరో ట్విస్ట్ చూస్తే అర్శమౌతుంది. అయితే అలాంటి ఆలోచన వున్నప్పుడు సన్నివేశాలని అల్లుకున్న తీరు మరోలా ఉండాల్సింది.

వైష్ణవ్‌ తేజ్‌ హుషారుగా కనిపించాడు. దాదాపు సన్నివేషాల్లో చలాకీగా నటించాడు. యాక్షన్ సీన్స్ లో తన యీజ్ చూపించాడు. అయితే ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్, గుడి దగ్గర వచ్చే ఫైట్స్ లో బోయపాటి హీరోగా మారిపోయాడు. అయితే అంత వైలెన్స్ ని మోసే ఇమేజ్ వైష్ణవ్‌ తేజ్‌కి ఇంకా రాలేదనే చెప్పాలి. అలాగే చాలా చోట్ల పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ని అనుకరిస్తునట్లు కనిపించాడు. శ్రీలీలని కేవలం డ్యాన్సుల కోసం తీసుకున్నారని చెప్పాలి. లీలమ్మ పాటతో పాటు మిగతా పాటల్లో కలర్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ తో ఆకట్టుకుంది. హీరో, హీరోయిన్ ఇద్దరూ అతి మంచి వాళ్ళే. ఎక్కడైన పిల్లలు కనిపిస్తే భోజనాలు పెట్టేస్తారు, రొటీన్ గా దానధర్మాలు చేసేస్తారు. దీంతో వారి పాత్రల మధ్య కాంఫ్లిక్ట్ క్రియేట్ అవ్వదు. చెంగారెడ్డిగా చేసిన జోజు జార్జ్ నటన బావుంది కానీ అతని విలనిజంలో బలం లేదు. భార్యని అడ్డుపెట్టుకొని తను చేసిన విలనిజం కాలం చెల్లిపోయిన భావన కలిగిస్తుంది. పైగా అతని పాత్రలో ఒక ఫ్లో వుండదు. హీరో, విలన్ కి మధ్య వార్ రక్తికట్టలేదు. రాధిక శరత్ కుమార్, జయప్రకాష్, సుదర్శన్, సుమన్, అపర్ణ దాస్, తనికెళ్ళ భరణి పాత్రలు పరిధిమేర వున్నాయి.

జీవి ప్రకాష్ అందించిన నేపధ్య సంగీతంలో బలం వుంది. యాక్షన్ సీన్స్ లో అది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే పాటలు కూడా కమర్షియల్ మీటర్ లో చేశారు. లీలమ్మో పాట చూడటానికి కూడా కలర్ ఫుల్ గా వుంది. డడ్లీ కెమరాపనితనం రెగ్యులర్ కమర్షియల్ సినిమాకి సరిపోయింది. నిర్మాతలు కథకు కావాల్సింది సమకూర్చారు. పక్కా కమర్షియల్ సినిమాని తీయాలనే ప్రయత్నం చేశాడు దర్శకుడు. దానికి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ సమకూర్చుకున్నాడు. అయితే అవన్నీ రొటీన్ గా తెరపైకి వచ్చాయి.

తెలుగు360 రేటింగ్ : 2.25/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close