యూనిఫాంతో డ్యూటికెళ్లిపోయిన ఏబీవీ !

దాదాపుగా మూడేళ్ల నుంచి యూనిఫాం వేసుకునే అవకాశం లేకపోవడంతో ఇబ్బందిగా ఫీలవుతున్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు…సుప్రీంకోర్టు తీర్పు తర్వతా నేరుగా సెక్రటేరియట్‌కు వెళ్లిపోయారు. యానిఫాంలోనే సెక్రటేరియట్‌కు వెళ్లి సుప్రీకోర్టు ఆదేశాలను చీఫ్ సెక్రటరీకి ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలను సీఎస్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఏబీవీ చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సీఎస్‌కు రిపోర్ట్ చేశానని, పోస్టింగ్, పెండింగ్ జీతభత్యాల విషయాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లానని ఆయన వెల్లడించారు. అవసరమైన ఆదేశాలివ్వాలని సీఎస్‌ను కోరానని, లెటర్ ఇచ్చానని.. పోస్టింగ్ విషయం ప్రాసెస్‌లో పెడతారని ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు.

సుప్రీంకోర్టు ఆదేశాలు ఇంకా అందలేదని.. లేదా మరో కారణం చెప్పి పోస్టింగ్ నిరాకరించే పరిస్థితి లేకుండా ఏబీవీ జాగ్రత్తపడ్డారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏంచేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. డీజీ ర్యాంక్‌లో ఉన్న అధికారికి.. కీలకమైన పోస్టింగే ఇవ్వాల్సి ఉంటుంది. ఆయనపై ప్రభుత్వానికి.. వైఎస్ఆర్‌సీపీకి ఎలాంటి నమ్మకం లేదు. ఆయన పోస్టింగ్ ఇస్తే ప్రభుత్వంలో టీడీపీ నేతను పెట్టుకున్నట్లేనని వారు భావిస్తారు. అందుకే పోస్టింగ్ ఇవ్వకుండా ఉండటానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తారంటున్నారు.

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం ఉల్లంఘిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అందుకే ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వడానికే ప్రాధాన్యం ఇస్తుందని భావిస్తున్నారు. గతంలోలా కోర్టుల్ని తేలిగ్గా తీసుకునే పరిస్థితి ఇప్పుడులేదని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించని పోస్టింగ్ ఇచ్చి… లూప్‌లైన్‌లో కూర్చోబెడతారని అంటున్నారు. అయితే ఏబీవీకి పోస్టింగ్ ఇచ్చేవరకూ ఏదైనా డౌటేనని ఉన్నతాధికారవర్గాలు భావిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గాలికో న్యాయం .. జగన్‌కో న్యాయమా ?

గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కేసులు, జనార్దన్ రెడ్డి తీరు , విచారణ ఆలస్యం అవుతున్న వైనం ఇలా అన్ని విషయాల్లోనూ సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణను ఫాలో అవుతున్న వారికి...

ఇక టీఆర్ఎస్ పార్టీ లేనట్లేనా !?

కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో జాతీయ రాజకీయాలు చేయలేరు. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ కోసమే ఆ పార్టీపెట్టారు. ఇప్పుడు భారతీయ సెంటిమెంట్‌తో భారతీయ రాష్ట్ర సమితి...

ఫ్యాక్ట్ చెక్ ఏపీ.. నిజాలు చెప్పలేక తంటాలు !

ఏపీ పోలీసులు ఫ్యాక్ట్ చెక్ చేస్తామంటూ ప్రత్యేకంగా ఫ్యాక్ట్ చెక్ ఏపీ అంటూ కొత్త విభాగాన్ని చాలా కాలం కిందట ప్రారంభించారు. ఇందులో సామాన్యులు తప్పుడు సమాచారం వల్ల నష్టపోయే...

కొత్త పార్టీ..కొత్త విమానం.. కొత్త హుషారు.. కేసీఆర్ స్టైలే వేరు !

కేసీఆర్ మౌనం వెనుక ఓ సునామీ ఉంటుంది. జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనుకున్న తర్వాత కసరత్తు కోసం ఆయన కొంత కాలం మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన సునామీలా విరుచుకుపడనున్నారు. దసరా రోజు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close