ఏబీవీ సర్వీస్ ఐదేళ్ల పాటు పొడిగిస్తారా !?

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీవీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ అక్రమం అని క్యాట్ తీర్పు చెప్పింది. ఆయన జీతభత్యాలు మొత్తం ఇవ్వాలని చెప్పింది. ఓ ఐపీఎస్ ఆఫీసర్ టార్గెట్ జీతభత్యాలు మాత్రమే పొందడం కాదు. ఆయన సర్వీసులో ఐదేళ్ల పాటు నష్టపోయారు. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు ?. ఈ నెలాఖరులో రిటైర్ కావాల్సి ఉంది. ఆయనపై తప్పుడు ఆరోపణలు చేసి సస్పెండ్ చేయకపోతే ఆయన డీజీపీ అయి ఉండేవారు. ప్రభుత్వ కక్ష సాధింపుల వల్ల ఆయన ఆ అవకాశాన్ని కోల్పోయారు. ఈ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు ?

ఏబీవీ తప్పు చేశారని ఐదేళ్లకాలంలో నిరూపించలేకపోయారు. కానీ ఆయనపై తప్పుడు ఆరోపణలు చేయడానికి మాజీ డీజీపీ ఒకరు ఫోర్జరీ చేశారు.ఈ విషయాన్ని ఏబీవీనే బయట పెట్టారు. ఇలాంటి తప్పుడు పనులు చేసి అడ్డంగా దొరికిన ఐపీఎస్‌లు ఎంతో మంది ఉన్నారు. వారిలో చాలా మంది సీనియర్లు ఉన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత వారెవరూ.. తాను తప్పు చేయలేదని ఏబీవీలా పోరాడే పరిస్థితి లేదు. ఎందుకంటే వారు చేసిన తప్పులు కళ్ల ముందే సాక్ష్యాలతో ఉన్నాయి. వారిని ఎవరూ కాపాడలేరు అనేది.. తప్పు చేయకపోయినా శిక్ష అనుభవించిన ఏబీవీ ఉదంతమే నిరూపిస్తోంది.

కౌంటింగ్ వచ్చే నెల నాలుగో తేదీన జరుగుతుంది. ఈ నెల 30వ తేదీనే ఆయన రిటైర్ అవ్వాల్సింది. ఫలితాలు వచ్చిన తర్వాత ప్రభుత్వం మారితే… ఆయనను కొనసాగించడానికి కేంద్రానికి ప్రత్యేకమైన విజ్ఞప్తి చేసే అవకాశం ఉంటుంది. కానీ అంతకు ముందే రిటైర్మెంట్ డేట్ రావడం ఇబ్బందికరంగా మారుతుంది. ప్రభుత్వం మారితే ఆయన సర్వీస్ ఖచ్చితంగా కొనసాగుతుంది… అయితే అది నేరుగా సర్వీస్ కొనసాగింపా లేకపోతే.. ప్రత్యేకంగా మళ్లీ ఏదైనా పోస్టు సృష్టించి రిటైర్డ్ అధికారి కేటగిరిలో తీసుకుంటారా అన్నది చూడాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవ్ పార్టీ ఇష్యూ- అడ్డంగా బుక్ అయిన సినీ న‌టి హేమ‌

బెంగుళూరు రేవ్ పార్టీ కొత్త మ‌లుపు తీసుకుంది. రేవ్ పార్టీలో డ్ర‌గ్స్ వాడిన‌ట్లు గుర్తించిన పోలీసులు... నార్కోటిక్ ప‌రీక్ష‌లు చేయిస్తున్నారు. ఇందులో ఏపీకి చెందిన వారే ఎక్కువ‌గా ప‌ట్టుబ‌డ్డ‌ట్లు తెలుస్తుండ‌గా, ఓ...

కంటోన్మెంట్ ఉప ఎన్నిక : విజయం ఎవరిని వరిస్తుందో..?

లోక్ సభ ఎన్నికలతోపాటు తెలంగాణలో జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నిక గురించి పెద్దగా చర్చే లేకుండా పోయింది. పార్లమెంట్ ఎన్నికల హడావిడే ఇందుకు ప్రధాన కారణం. మల్కాజ్ గిరి లోక్ సభతోపాటు...

ఈటీవీ నుంచి మ‌రో ఓటీటీ.. ఈసారి వేరే లెవ‌ల్‌!!

సినిమా ప్ర‌పంచంలో ఓటీటీ భాగం అయిపోయింది. సినిమా వ్యాపారంలో ఓటీటీల‌దే కీల‌క భాగ‌స్వామ్యం. అందుకే ఓటీటీల సంఖ్య పెరుగుతూ వ‌స్తోంది. మీడియా రంగంలో అగ్ర‌గామిగా నిలిచిన‌ ఈనాడు సైతం ఓటీటీలోకి అడుగు పెట్టింది....

క‌థాక‌మామిషు! (వారం వారం కొత్త క‌థ‌ల ప‌రిచ‌యం)

సాహితీ ప్ర‌క్రియ‌లో క‌థ‌ల‌కు విశిష్ట‌మైన స్థానం ఉంది. మాన‌సిక ఉల్లాసానికీ, స‌రికొత్త‌ ఆలోచ‌నా దృక్ప‌థానికీ క‌థ‌లు త‌మ వంతు సాయం అందిస్తుంటాయి. ఆమ‌ధ్య‌కాలంలో క‌థ‌ల‌కు పెద్ద‌గా ప్రోత్సాహం ల‌భించేది కాదు. అయితే ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close