ఆర్కే అంకుల్ డ్యూయల్ రోల్

చిత్త శుద్ధి లేని శివపూజలు వృధా
ఎదుటివాడికి చెప్పేటందుకే నీతులు వున్నాయి.
ఇలాంటి మాంచి సూక్తి ముక్తావళి వాక్యాలు చాలా గుర్తుకు వస్తాయి ఈ రోజు ఆంధ్రజ్యోతిలో ఆర్కే ప్రవచించిన కొత్త పలుకు చదివితే.

ఇప్పటి వరకు సంక్షేమ పథకాల ఊసు ఎత్తని ప్రధాని మోడీ ఒక్కసారిగా పందేరాలు ప్రారంభించడంతో ఇటు చంద్రబాబుకు కావచ్చు, అటు కేసిఆర్ కు కావచ్చు గుబులు మొదలైంది. అది వాస్తవం. ఇప్పుడు ఏం చేయాలి? రెండే మార్గాలు. ఆ పథకాలు అన్నీ డొల్ల అని తిప్పి కొట్టాలి. రెండవది జనాల డబ్బు ఇలా పంచేయడం దారుణం అని అనాలి.

కానీ మొదటిదాన్ని కావాలంటే బాబు అనగలరు. రెండవది మాత్రం అనలేరు. ఎందుకంటే వాళ్లు చేసే పని కూడా అదే. అందువల్ల ఆ మాట ఎవరి చేత చెప్పించాలి? మనదైన మీడియా చేత చెప్పించాలి. అందుకే ఆ బాధ్యత మీదన వేసుకున్నట్లున్నారు ఆర్కే.

బడ్జెట్ మొదటి రోజే ఇన్ కమ్ టాక్స్ పెంపు వల్ల ఒరిగేది లేదని, ఎకరాకు దక్కేది చాలా తక్కువని, దాన్ని 365 చేత భాగిస్తే రోజుకు పదో, పదిహేనో కిడుతుందని ఇలా కథనాలు వండి వార్చారు. రెండో రోజు రెండో పాయింట్ మీద పడ్డారు. పన్నుల ధనం ఇలా వృధా చేసేస్తున్నారు అంటూ పేజీ నింపేసారు. ఇందులో ఏముందో? ఏమి లేదో? చూద్దాం.

శ్రీకారం ఎక్కడ?

దేశంలోనే సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది తమిళనాట. ఎమ్జీఆర్ హయాంలో. అక్కడ నుంచి ఆ స్ఫూర్తితో తెలుగునాటకు తీసుకువచ్చింది ఎన్టీఆర్. రెండు రూపాయల కిలో బియ్యంతో ఎన్టీఆర్ కాదా? కిలో నాలుగు రూపాయలు వున్నపుడు యాభై శాతం సబ్సిడీతో రెండు రూపాయలకు ఇస్తుంటే, ఇప్పుడు కిలో నలభై రూపాయలు వున్నపుడు కూడా రెండు రూపాయలకు ఇస్తున్నది ఎవరు?

సరే ఎన్టీఆర్ తరువాత వైఎస్ హయాంలో సంక్షేమ పథకాలు పెరిగాయి. ఫ్రీ కరెంట్ వచ్చింది, ఫ్రీ ఆరోగ్యం వచ్చింది. సరే, ఇవి కొంత వరకు ఓకె అనుకుందాం. మళ్లీ బాబు పవర్ లోకి వచ్చారు. ఎన్ని ఫ్రీలు వచ్చాయో చూద్దాం

అన్న క్యాంటీన్ అంటూ 70 రూపాయల భోజంనంలో ప్రభుత్వం 65 రూపాయలు భరించి అయిదు రూపాయలకే తిండి పెడుతోంది. అలాగే టిఫిన్ కూడా. ఏడాదికి మూడు నాలుగు సార్లు చంద్రన్న కానుక అంటూ ఫ్రీగా సరుకులు ఇచ్చేస్తున్నారు. ఏడాదికి రెండు సార్లు పసుపు కుంకుమ అంటూ ఇరవై వేలు నేరుగా మహిళలకు అందిస్తున్నారు. నిరుద్యోగులకు నెలకు రెండు వేలు. అసలు ఈ రోజుల్లో నిరుద్యోగిగా వుంటున్నది ఎవరు? ప్రతి ఒక్కరు నెలకు మూడు నాలుగు వేలు సంపాదిస్తున్నారు. అయినా ఇప్పటికీ దుకాణల ముందు, పెట్రొలు బంకుల మందు, హోటళ్ల ముందు స్టాఫ్ కావలెను అన్న బోర్డులు పెద్దగా దర్శనం ఇస్తూనే వున్నాయి. మరి నిరుద్యోగ భృతి ఏమిటి?

ఇంకా చాలా వున్నాయి. అయితే వృద్దులకు ఇస్తున్న పింఛన్లు లాంటివి అవసరం అయినవి కాబట్టి వాటిని ప్రస్తావించడం లేదు. ఆంధ్రలో ఇలా వుంటే కేసిఆర్ తెలంగాణలో ఇంతకు పదింతలు చేస్తున్నారు. వీళ్లను చూసిన తరువాత మోడీ రంగంలోకి దిగారు.

మోడీది తప్పెలా అవుతుంది?

రాష్ట్రాలు ఇలా పంచేస్తుంటే, తనకు చెమటలు పట్టిస్తుంటే ఓ రాజకీయ నేతగా, ఓ రాజకీయ పార్టీ అధినేతగా మోడీ కూడా అదే దోవ పోవడం తప్పెలా అవుతుంది. కానీ ఆర్కేకు ఇటు మోడీది, అటు కేసిఆర్ ది తప్పుగా కనిపిస్తోంది. కొత్తపలుకు మొత్తం భూతద్దం పెట్టి వెదికినా చంద్రబాబు నాయుడు అనే పదం కనిపిస్తుందేమో చూడండి. ఆంధ్ర పథకాల గురించి లేశమాత్రంగా ప్రస్తావించారు తప్ప చంద్రబాబు పేరు లేదు. అలాగే పసుపు కుంకుమ ప్రస్తావన లేదు. అన్న క్యాంటీన్ ముచ్చట, చంద్రన్నకానుకల వైనం లేనే లేదు.

వీటన్నింటికన్నా సూపర్ ఏమిటంటే..లోపల పేజీలో ఈ సూక్తి ముక్తావళి. ఫస్ట్ పేజీలో మాత్రం రాష్ట్రం అంతా సంక్షేమ సంబరాలు అంటూ తెలుగుదేశం పార్టీకి బూస్ట్ పట్టించే వైనం.

నిజానికి ఆర్కే కొత్తపలుకులో ఉద్దేశం మంచిదే కావచ్చు. కానీ బాబు మీద ఈగ వాలనివ్వకూడదని, మోడీ సంక్షేమ బాట సరికాదని చెప్పాలనే డ్యూయల్ రోల్ వల్ల అది కాస్తా పక్కదారి పట్టేసింది. ఈ వైనం ఆయనకు మాత్రం తెలియదని అనుకోవడానికి లేదు. కానీ ఏదో ఆయన ఉభయతారక ప్రయత్నాలు అలా చేస్తూ వుంటారంతే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

`వైల్డ్ డాగ్`… ప్లాన్ బి ఉందా?

నాగార్జున న‌టించిన సినిమా `వైల్డ్ డాగ్‌`. పూర్తి స్థాయి యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇది. చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. ఈసినిమాని ఓటీటీలో విడుద‌ల చేయ‌నున్నార‌ని టాక్. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని...

“ఉద్రిక్తతలు” లేకుండా కేసీఆర్ ప్రచారసభ..!

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల ప్రచారసభలో వ్యూహాత్మక ప్రసంగం చేశారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో ఆయన తూటాల్లాంటి మాటలతో విరుచుకుపడుతారని అందరూ అనుకున్నారు....

ప్రకాష్‌రాజ్‌ సద్విమర్శనూ పాజిటివ్‌గా తీసుకోలేరా..!?

పవన్ కల్యాణ్ రాజకీయ గమనాన్ని..నిర్ణయాల్ని విమర్శించిన ప్రకాష్‌రాజ్‌పై.. పవన్ కల్యాణ్ క్యాంప్ భగ్గుమంది. జనసైనికులు ఎన్నెన్ని మాటలు ‌అన్నా.. జనసేనాని సోదరుడు నాగబాబు చేసిన విమర్శలు మాత్రం పరిగణనలోకి తీసుకోవాల్సినవే. కానీ ప్రకాష్‌రాజ్‌ను...

నవరత్నాలు ఆపేయమని జగన్‌కు ఉండవల్లి సలహా..!

జగన్ శ్రేయోభిలాషిగా అందరికీ గుర్తుండే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవలి కాలంలో ప్రెస్‌మీట్లు పెట్టి.. జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడుతున్నారు. ఆయన చేస్తున్న తప్పులను కరెక్ట్ చేసి.. ఆయనకు మేలు చేద్దామన్న...

HOT NEWS

[X] Close
[X] Close