ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ జగన్ రెడ్డిపై ఓ భయంకమైన ఆటంబాబు వేయగలనని ప్రకటించుకున్నారు.దాని స్విచ్ తన దగ్గర ఉందని తన జోలికి వచ్చిన రోజున దాన్ని పేల్చేసి జగన్ రెడ్డిని నాశనం చేస్తానని చెప్పారు. దీంతో అందరూ.. వైఎస్ కుటుంబంలో పాతికేళ్ల కిందట ఏం విషాదం జరిగింది..దానికి జగన్ ఎలా కారకుడు అని ఆరా తీయడం ప్రారంభించారు. ఎవరికి తోచిన విశ్లేషణలు వారు చేయడం ప్రారంభించారు.
జగన్ రెడ్డి మొదటి నుంచి దూకుడైన నేత. పోలీస్ అధికారిని పోలీస్ స్టేషన్ లోనే దాడి చేసిన ఘటన గురించి అందరికీ తెలుసు. ఆ తర్వాత ఫ్యాక్షన్ రాజకీయాల్లో తన చేతికి మట్టి అంటకుండా చాలా మంది రాజకీయ ప్రత్యర్థుల్ని ఫ్యాక్షన్ బాధితులుగా చేశారని కూడా చెప్పుకుంటారు. అయితే అన్నీ గాసిప్సే. దేనికీ ఆధారాల్లేవు. కానీ వేమూరి రాధాకృష్ణ చెప్పింది మాత్రం కుటుంబంలోని ఘటన. పైగా దాని గురించి ఇప్పటి వరకూ ఎలాంటి లీక్ బయటకు రాలేదని అంటున్నారు.
వేమూరి రాధాకృష్ణ ఇచ్చిన టీజర్ పై వైసీపీ నేతలు ఇంకా స్పందించలేదు. నిజానికి ఇలాంటి అంశాల్లోనే కాదు.. ఏమి మాట్లాడాలన్నా.. ఏమీ చేయాలన్నా.. తాడేపల్లి ప్యాలెస్ నుంచి పార్టీ నేతలకు ఆదేశాలు రావాల్సిందే. ఇప్పటికి అలాంటి సూచనలు, ఆదేశాలు రాలేదని అందుకే స్పందించడం లేదని అంటున్నారు. నిజంగానే అలాంటి ఘోరం పాతికేళ్ల కిందట జగన్ రెడ్డి చేసి ఉంటే.. వైసీపీ నేతలు కిక్కురమనకుండా ఉండే అవకాశం ఉంది.