ఆర్కే పలుకు : జగన్ వల్లే కుటుంబంలో చిచ్చు..!

వైఎస్ కుటుంబంలో ఏం జరుగుతుందో… ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు తెలిసిపోతోంది. ఆ కుటుంబం నుంచి ఎవరైనా రాధాకృష్ణకు మిత్రులు ఉన్నారో.. లేకపోతే అంతకు మించిన సోర్స్ ఏమైనా ఏర్పాటు చేసుకున్నారేమో కానీ.. వైఎస్ కుటుంబంలో చీమ చిటుక్కుమన్నా… రాధాకృష్ణకు తెలిసిపోతోంది. అయితే చాలా విషయాలు .. న్యూస్‌గా పత్రిక వెల్లడించడంలేదు. అప్పుడప్పుడూ సందర్భాన్ని బట్టి తన వారంతపు ఆర్టికల్ “కొత్తపలుకు”లో బయట పెడుతూ వస్తున్నారు. తాజాగా.. ఈ వారం… ఆయన పూర్తిగా జగన్ ఫ్యామిలీలో ఏర్పడిన చిచ్చుపైనే ప్రధానంగా దృష్టి పెట్టి కథనం రాశారు. ఏం జరిగింది.. ఏం జరుగుతుంది.. ఏం జరగబోతోందని విశ్లేషించినట్లుగా ఆయన కథనం ప్రకారం… వైఎస్ కుటుంబంలోజగనే చిచ్చు పెట్టారు. ఆ చిచ్చు ఆయననే చుట్టు ముట్టబోతోంది.

వైఎస్ కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి చిచ్చు పెట్టేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అందరూ ఒకే మాట.. ఒకే బాటగా ఉండే కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి.. తన నిర్వాకంతో రెండుగా చీల్చేశాడని.. ఆడవాళ్లందరూ..జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం అయ్యారని… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ విశ్లేషించారు. ప్రతీ వారం తను రాసే ఆర్టికల్‌లో ఎప్పటిలాగానే ఈ వారం కూడా.. జగన్‌ను టార్గెట్ చేశారు. దానికి కావాల్సిన సరంజామాను ఆయనకు ఈ వారం… వైఎస్ సునీత ఇచ్చారు. ఢిల్లీలో తన తండ్రి హత్య కేసు నిందితుల్ని జగన్ కాపాడుతున్నారని ఆమె వ్యక్తం చేసిన ఆవేదనకు.. మరింత ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్‌తో రాధాకృష్ణ… లోతుగా విశ్లేషించారు.

వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు చంపారో.. వైఎస్ కుటుంబంలో అందరికీ తెలుసు. అన్ని వేళ్లూ.. వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి. కానీ చర్యలు తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. నాన్నకు న్యాయం చేయాలని అడగడానికి వెళ్లిన సునీతతో.. జగన్ రెడ్డి వాళ్లను శిక్షిస్తే.. వాళ్లు బీజేపీలోకి వెళ్తారు అని చెప్పారట…దాంతో జగన్ ఎలాగూ కేసును నీరుగారుస్తాడని అర్థమయ్యి… ఆమె సీబీఐ విచారణ కోసం కోర్టుకు వెళ్లింది. సీబీఐ విచారణకు ఆదేశించినా ముందుకు సాగడం లేదు. అక్కడా మేనేజ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సునీత కన్నీరు పెట్టుకునే పరిస్థితి వచ్చింది.

ప్రస్తుతం వైఎస్ కుటుంబం అడ్డంగా చీలిపోయింది. షర్మిల వైపు తల్లి విజయలక్ష్మి ఉన్నారు. జగన్ ఎవర్నీ దగ్గరకు రానీయకుండా చక్రవర్తిలా సింహాసనంపై కూర్చుని పరిపాలిస్తున్నారు. కుటుంబంలో ఏర్పడిన చిచ్చును కూడా ఆయన లైట్ తీసుకున్నారు. ఎవరు ఉంటే ఏంటి.. ఎవరు లేకపోతే ఏంటీ అన్నట్లుగా ఆయన పరిపాలిస్తున్నారు. ఫలితంగా వైఎస్ కుటుంబంలో… ఆడపిల్లలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. చెల్లెళ్లకు న్యాయం చేయలేని జగన్ …తమకేం చేస్తాడని ఇతర ఫ్యామిలీ సభ్యులు.. జగన్‌పై ఆశలు పెట్టుకోడం మానేశారు. వారంతా షర్మిల వైపు చేరుతున్నారు. ఇది త్వరలో పెద్ద చిచ్చుగా మారి జగన్‌నుచుట్టుముట్టే అవకాశం కనిపిస్తోంది. ఇదీ… ఆర్కే।… అంతిమంగా విశ్లేషించిన అంశం. జరుగుతున్నపరిణామాలు చూస్తే.. ఇది అతిశయోక్తి కాదేమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close