ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ జగన్మోహన్ రెడ్డిని పులివెందుల సీఎం చేయాలని డిమాండ్ చేశారు. పులివెందులను ప్రత్యేక రాష్ట్రం చేసి ఆ రాష్ట్రానికి ఆయనను సీఎంను చేస్తే తప్ప..ఏపీపై ఈ దారుణమైన కుట్రలను ఆయన ఆపరని తేల్చేశారు. ఇటీవలి కాలంలో జగన్ రెడ్డి చేస్తున్న రాజకీయ కుట్రలు, ఏపీకి వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారం చూసి విరక్తి పుట్టిన ఆర్కే తన కొత్తపలుకులో ఈ మేరకు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎక్కడైనా నేరం జరిగితే వాళ్లకులాలను తెలుసుకుని .. వెంటనే కుల హత్యలని చేయడం, కొత్త కొత్త నేరెటివ్స్ తీసుకు రావడం.. అవి అత్యంత సైకోతత్వంతో ఉండటంతో ఆర్కే ఇలా ఆశ్చర్యపోయారు.
జగన్ రెడ్డి చేస్తున్న కుట్రల్ని చంద్రబాబు కూడా అడ్డుకోలేకపోతున్నారని .. ఆయన జగన్ పై దృష్టి పెడితే మిగతా వాటికి సమయం ఉండదని అనుకుంటున్నారు. ఏపీకి అత్యంత భారీ పెట్టుబడి వస్తే ఆనందించాల్సి పోయి.. ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కావడం లేదని ఆర్కే అంటున్నారు. అదే సమయంలో తెలంగాణలో ఉండి జగన్ కు మద్దతుగా మాట్లాడే కొంత మంది .. పెయిడ్ ఆర్టిస్టులపై విరుచుకుపడ్డారు. మీడియాపై నిషేధం, వేధింపులు, కేసుల గురించి .. జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని ఆయన సూటిగానే ప్రశ్నించారు.
తెలంగాణలో కేసీఆర్ ఉన్న పదేళ్ల కాలంలో ఆంధ్రజ్యోతికి వేధింపులు ఎదురయ్యాయి. యాడ్స్ ఇవ్వలేదు. ఏబీఎన్నూ బ్యాన్ చేశారు. అప్పుడు ..ఇప్పుడు మాట్లాడుతున్న ఎవరూ నోరెత్తలేదు. చివరికి రఘురామరాజు ప్రెస్మీట్లు లైవ్ ఇస్తున్నారని దేశద్రోహం కేసు పెట్టించారు జగన్ రెడ్డి. అప్పుడు కూడా వీరు మాట్లాడలేదు. ఇలాంటి వారికి ఇప్పుడు మాట్లాడే అర్హత ఎలా ఉంటుందని గట్టిగానే నిలదీశారు. జగన్ రెడ్డి డబ్బులకు కక్కుర్తి పడే ఇలాంటి వారి మాటలకు విలువ ఉండదని ఆయన ఒక్క మాటతో తేల్చేశారు.
కొసమెరుపేమిటంటే.. మీరంతా ఏడుస్తూనే ఉండండి నాయనలారా అనే సంకేతాలు కూడా ఇచ్చారు. ఎందుకంటే మీరు బాధలు పెట్టిన వాళ్లకు.. మీ ఏడుపులు ఇప్పుడు శ్రవణానందంగా ఉంటాయి కదా అని లాజిక్ ను వివరించారు. తాము గొప్పోళ్లమని.. తమను ఎవరూ ఏడిపించలేరని ఇతరులపై విరుచుకుపడిన వారు ఇప్పుడు ఏడుస్తున్నారు. ఈ ఏడుపులు ఆగవని ఆయన భావన. ఈ వారం ఆర్టికల్ లో పార్టీయాలిటీ చూపించేవారు.. కుట్రలు చేసేవారిపై ఆర్కే మనసులో ఉన్న ఆగ్రహం, ఆవేదన.. అంతా బయటకు వచ్చిందని అనుకోవచ్చు.

