ఆర్కే పలుకు : తప్పు ఐఏఎస్‌లది కాదు జగన్‌ది..!

ఆంధ్రప్రదేశ్‌లో ఐఏఎస్ అధికారులకు హైకోర్టు విధించాల్సిన శిక్ష నిజంగా వేయాల్సింది సీఎం జగన్‌కు అని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ విశ్లేషించారు. తన వారాంతపు ఆర్టికల్ “కొత్తపలుకు”లో అధికారులకు కోర్టుశిక్ష వేయడంపై సుదీర్ఘంగా విశ్లేషించారు. రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిన అధికారులు అలా ఉండటంలేదని.. అయితే అయితే వారు ఇలా ఉద్దేశపూర్వకంగా చేయరని అంటున్నారు. స్కూళ్లలో ఆర్బీకేలు, సచివాలయాలు పెట్టడానికి నిబంధనలు అంగీకరించవు. ఆ విషయాన్ని అధికారులు ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలకు తెలియ చేసి ఉంటారని కానీ వారి ఒత్తిడి మేరకే అనుమతించి ఉంటారని ఆర్కే భావిస్తున్నారు. అందుకే హైకోర్టు ఈ అంశంలో హైకోర్టు నోట్ ఫైల్స్ పరిశీలించి ఉండాల్సిందని ఆర్కే భావిస్తున్నారు.

గతంలో ఎప్పుడు.. ఎక్కడా.. ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా సివిల్ సర్వీస్ అధికారులు ముఖ్యమంత్రి ఏదనుకుంటే అదే అమలు చేస్తున్నారని రాజ్యాంగాన్ని పాటించడం లేదని ఆర్కే భావన. అంతే కాదు.. కోర్టుతీర్పు తర్వాత ఆ ఎనిమిది మందిలో కొంత మందికి అసలు పశ్చాత్తాపమే కనిపించడలేదట.పైగా ఓ ఐఏఎస్ అధికారి.. “మనం కోర్టు తీర్పునుపాటించకపోతేఎవరికైనా తెలుస్తుందా” అని మాట్లాడారట. కోర్టుల విషయంలో ప్రభుత్వం కోసం.. ప్రభుత్వం రక్షిస్తుందనే ఓ ధీమాతో అందరూ వ్యవస్థను ధిక్కరిస్తున్నారని ఆర్కే అభిప్రాయం అందుకే.. ఆయన అసలు అధికారుల్ని ఉల్లంఘన దిశగా ప్రోత్సహించిన ప్రభుత్వం అంటే.. జగన్‌నే శిక్షించాలని అభిప్రాయపడుతున్నారు.

ఐఏఎస్ అధికారులు ఓ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు దానికి సంబంధించిన ప్రతీ అంశంపైనా నోట్ ఫైల్స్ నమోదుచేస్తారు. నిబంధనలకు విరుద్ధమైతే అదే చెబుతారు. అయినప్పటికీ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ పెద్ద లేదా మంత్రి చెబితే.. ఆ విషయాన్ని నమోదుచేస్తారు. అప్పుడు తప్పు జరిగితే వారే బాధ్యత వహిస్తారు. కానీ పోస్టింగ్‌ల కోసం ఐఏఎస్‌లు మంత్రులు లేదా సీఎం నోటి మాట ద్వారా చెప్పే్ ఆదేశాలను పాటిస్తున్నారు. ఫలితంగా తప్పు అధికారులదే అవుతోంది. అందుకే వారు శిక్షలు అనుభవిస్తున్నారని ఆర్కే అంటున్నారు.

తెలంగాణ రాజకీయాలపైనా ఆర్కే విశ్లేషించారు. గవర్నర్, చినజీయర్‌తో గొడవల దగ్గర్నుంచి .. బీజేపీతో కేసీఆర్ యుద్ధం వరకూ కేసీఆర్ ఆవేశంతోనే నిర్ణయాలు తీసుకుంటున్నారని తేల్చారు. ఏపీలో ఏ మాత్రం వివాదం కాని బియ్యం సేకరణ అంశం.. తెలంగాణలో మాత్రమే ఎందుకు వివాదాస్పదం అవుతోందని ఆర్కే విశ్లేషించారు. తెలంగాణ ప్రభుత్వం నాణ్యమైన బియ్యాన్ని పండించాలని ప్రోత్సహించకపోవడమే తప్పయిందని విశ్లేషించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సాలు .. సాలంటున్న బీజేపీ, టీఆర్ఎస్ !

సొలు దొర - సెలవు దొర అని బీజేపీ అంటూంటే... సాలు మోదీ.. సంపకు మోదీ అని టీఆర్ఎస్ రివర్స్ కౌంటర్ ఇస్తోంది. తమ పార్టీ ఆఫీస్ ముందు డిజిటల్ బోర్డు...

చివరికి కుప్పానికి విశాల్ రెడ్డిని కూడా పిలుస్తున్నారు !

కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామంటున్న వైసీపీకి దారి తెలుస్తున్నట్లుగా లేదు. మున్సిపల్ ఎన్నికల్లో చేసినట్లుగా అసెంబ్లీ ఎన్నికల్లో చేయలేమని అర్థమైందేమో కానీ ఇప్పుడు సినీ హీరోను చంద్రబాబుపై పోటీకి పెట్టాలని ప్లాన్ చేసుకుంటున్నారు. తమిళ...

ఏపీలో అధికారులు ఎవరైనా “కథలు” చెప్పాల్సిందే !

దొంగ లెక్కలు రాయడం.. తప్పుడు కథలు చెప్పడం ఇప్పుడు ఏపీ అధికారులకు ఓ కామన్ ప్రాక్టిస్ అయిపోయింది. పోలీసులు వివిధ కేసుల్లో చెప్పిన కథలు వారిని నవ్వుల పాలు చేశాయి. సోషల్...

దర్శి ఎమ్మెల్యే చెప్పుకున్నారు.. మిగతా వాళ్లు మనసులో దాచుకుంటున్నారు !

గడప గడపకూ వెళ్తే ప్రజలు నిలదీస్తున్నారని వైఎస్ఆర్‌సీపీ కి చెందిన దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్‌సీపీ నియోజకవర్గ ప్లీనరీలో మాట్లాడిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close