ఆర్కే పలుకు : రెండు రాష్ట్రాల్లోనూ అధికార మార్పిడి ఖాయం..!

ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే తన “కొత్త పలుకు”లో అధికార పార్టీలపై ఘాటు తగ్గిస్తున్నప్పటికీ… తనదైన శైలిలో తాను చెప్పాలనుకున్న విషయాన్ని ప్రజలకు చేర వేస్తున్నారు. ఈ వారాంతంలో తన ఆర్టికల్ “కొత్త పలుకు” ద్వారా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు పూర్తి కాలం మనబోవనే సంకేతాలను పంపారు. మామూలుగా అయితే.. రెండు ప్రభుత్వాలు అత్యంత సుస్థిరమైనవి. ప్రతిపక్షాలు దరిదాపుల్లో కూడా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు మనలేవని అంచనా వేయడం అతిశయోక్తి అవుతుంది. అయితే… ఆర్కే ఈ విషయంలో.. తాను చెప్పేది నిజమేనని అనిపించేలా.. కొన్ని విషయాలను ప్రస్తావించి ప్రజల్లో చర్చకు పెట్టే ప్రయత్నం చేశారు. అయితే.. ప్రభుత్వాల మార్పిడికి అవకాశం ఉన్న ఒకే ఒక్క అంశం… కేసులు. బీజేపీ ఆ దిశగానే అడుగులు వేస్తోందని… ఈ విషయం ఇద్దరు ముఖ్యమంత్రులకు అర్థం అయిందని.. అందుకే వారు ప్రత్యామ్నాయాన్ని కూడా చూసుకున్నారని అంటున్నారు.

జగన్మోహన్ రెడ్డిని బుక్ చేయాలంటే.. బీజేపీకి ఒక్క రోజులో పని. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు కాబట్టి.. బీజేపీకి ఎదురెళ్లే ప్రయత్నమే చేయడం లేదు. జీఎస్టీ నిధులు ఎగ్గొట్టినా పోలవరంకు పైసా అడగకపోయినా .. రాజకీయంగా మాత్రం… సహకారం తీసుకుంటూ… ఇబ్బంది లేకుండా బండి నడుపుతున్నారు. కానీ బీజేపీఅలా సంతృప్తి పడటం లేదట. ఇటీవల ఏపీలో పెరిగిపోతున్న ఆలయాలపై దాడులు.. ఇతర ఘటనతో బీజేపీ తనదైన రాజకీయం ప్రారంభించేసిందని.. జగన్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లేనని అంటున్నారు. ఏం జరిగినా… జగన్ కూడా సిద్ధమయ్యారని.. తన భార్య భారతికి ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నారని కూడా చెబుతున్నారు.

అయితే.. జగన్‌తో పోలిస్తే.. కేసీఆర్‌పై కేసులు పెట్టడం.. చాలా కష్టం. ఎదుకంటే ఇప్పటి వరకూ కేసీఆర్‌పై పెద్దగా కేసుల్లేవ్. పాత కేసులేవో ఉన్నా.. బీజేప ప్రభుత్వమే వాటిలో నుంచి కేసీఆర్ పేరును తప్పించేసింది. దీంతో ఇప్పుడు కొత్త కేసులు పెట్టాల్సిందే. అయితే.. కేసీఆర్ అవినీతిపై ఆధారాలు ఉన్నాయని… జైలుకు పంపుతామని.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ అదే పనిగా ప్రకటనలు చేస్తున్నారు. ఇది ఉత్తుత్తి బెదిరింపు కాదని… స్కెచ్ ఉందని ఆర్కే అనుమానిస్తున్నారు. అదే సమయంలో.. కేసీఆర్ జాతీయ రాజకీయాల హడావుడి వెనుక కారణం కూడా ఇదే అంటున్నారు. ఒక వేళ తనను కేసుల పేరుతో టార్గెట్ చేస్తే.. తాను జాతీయ రాజకీయాల్లోకి రాకుండా కట్టడి చేసేందుకునేనని కేసీఆర్ వాదించుకుంటారని.. అంతే కాదు.. ఆ పేరుతో సులువుగా.. తన కుమారుడ్ని పీఠంపై కూర్చోబెడతారని.. విశ్లేషించారు.

అధికార మార్పు అనేది చిన్న విషయం కాదు. కానీ… అసాధ్యం అయితే ఏమీ కాదు. ఈ విషయంలో ఆర్కేకు క్లారిటీ ఉంది. అందుకే ఆయన ఇప్పటికిప్పుడు జరగొచ్చు అని చెప్పడం లేదు కానీ.. జరిగే అవకాశం ఉందని అంటున్నారు. దానికి కారణాలు కూడా.. చెప్పి.. ఆర్కే ఈ వారం.. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు అని.. ప్రజల్లో చర్చకు కారణమయ్యే ఆర్టికల్ రాశారు. అయితే… ఇక్క రింగ్ మాస్టర్ ఒక్క బీజేపీ మాత్రమే. బీజేపీ ఏం చేయాలనకుంటుందో అది చేస్తుంది..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

తమ్మినేనికి డిగ్రీ లేదట – అది ఫేక్ డిగ్రీ అని ఒప్పుకున్నారా ?

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం నామినేషన్ వేశారు. అఫిడవిట్ లో తన విద్యార్హత డిగ్రీ డిస్ కంటిన్యూ అని పేర్కొన్నారు. కానీ ఆయన తనకు డిగ్రీ పూర్తయిందని చెప్పి హైదరాబాద్ లో...

గుంతకల్లు రివ్యూ : “బెంజ్‌ మంత్రి”కి సుడి ఎక్కువే !

మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు బెంజ్ మంత్రి అని పేరు పెట్టారు టీడీపీ నేతలు. ఇప్పుడా బెంజ్ మంత్రిని నెత్తికి ఎక్కించుకుని మరీ ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించడానికి కృషి చేస్తున్నారు. రాజకీయాల్లో ఓ...

బ్యాండేజ్ పార్టీ : వైసీపీ డ్రామాలపై జనం జోకులు

వెల్లంపల్లి కంటికి బ్యాండేజ్ వేసుకుని తిరుగుతున్నారు. ఈ విషయంలో పక్కనున్న జనం నవ్వుతున్నారని కూడా ఆయన సిగ్గుపడటం లేదు. కంటికి పెద్ద ఆపరేషన్ జరిగినా రెండు రోజుల్లో బ్యాండేజ్ తీసేస్తారు నల్లకళ్లజోడు పెట్టుకోమంటారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close