ఆర్కే పలుకు : గెలుపు నమ్మకం లేకనే కేసీఆర్ హడావుడి..!

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తన వారంతపు ఆర్టికల్ “కొత్తపలుకు” ద్వారా ఒక వాలీడ్ పాయింట్‌ను ప్రజల్లోకి పంపే ప్రయత్నం చేశారు. అదే ప్రజాధనంతో ప్రభుత్వాలు ఓట్లను కొనుగోలు చేయడం. ప్రస్తుతం హుజూరాబాద్ ఉపఎన్నికలో … ప్రజాధనాన్ని రూ. రెండు వేల కోట్ల వరకూ పంపిణీ చేసేందుకు కేసీయార్ సర్కార్ ప్రణాళికలు వేస్తోంది. దీన్ని నిశితంగా విమర్శించిన వేమూరి రాధాకృష్ణ.. డబ్బులు పంచితే గెలుస్తారనుకోడం అపోహనేనని తేల్చారు. దానికి రెండు ఉదాహరణలు కూడా చెప్పారు. ఒకటి చంద్రబాబు గత ఎన్నికలకు ముందు పసుపు- కుంకుమ పేరుతో మహిళలకు రూ. పదివేల కోట్లు పంచి పెట్టినా ఓడిపోయారు. అలాగే గ్రేటర్ ఎన్నికల్లో వరద సాయం పేరుతో ప్రతి ఇంటికి రూ. పదివేలు పంచి పెట్టినా టీఆర్ఎస్‌కు అనుకున్న ఫలితాలు రాలేదని గుర్తు చేశారు. ఇప్పుడు హుజూరాబాద్‌లో ప్రతి ఇంటికి రూ. పది లక్షలు పంపిణీ చేయడం వల్ల గెలుస్తారన్న నమ్మకం లేదని ఆయన తేల్చేశారు.

కేసీఆర్ హుజూరాబాద్ విషయంలో ఇంత టెన్షన్ పడటానికి కారణం అక్కడ సానుకూల పరిస్థితులు లేకపోవడమేనని విశ్లేషించారు. ఉన్న పళంగా ఉపఎన్నిక తెచ్చుకుని ఇప్పుడు ఇంత టెన్షన్ పడటం ఎందుకని ఆర్కే .. కేసీఆర్‌ను ఓ రకంగా ప్రశ్నించారు. రాష్ట్రం మొత్తం దళిత బంధు అమలు చేయాలంటే.. రూ. లక్షన్నర కోట్ల వరకూ నిధులు కావాలని.. కేవలం హుజూరాబాద్ దళితులను మభ్య పెట్టడానికే ప్రస్తుత పథకం అని ఆర్కే తేల్చారు. గ్రేటర్ ఎన్నికలకు ముందు కొంత మందికి రూ. పదివేలు ఇచ్చి.. తర్వాత పంపిణీని నిలిపివేశారని.. ఎన్నికల తర్వాత కూడా ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు.

ఏపీకి సంబంధించి త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పథకాలను ఆర్థిక కారణాలతో నిలిపివేయబోతున్నారని పరోక్షంగా చెప్పారు. ఆ పథకాల నిలివేతకు కారణం చంద్రబాబేనని పెద్దఎత్తున ప్రచారం చేయబోతున్నారని కూడా విశ్లేషించారు. ప్రస్తుతం ఏపీ సర్కార్ పెద్ద ఎత్తున అప్పులు చేసిందని ఇప్పుడు.. అప్పులు కూడా పుట్టని పరిస్థితి వచ్చిందని ఆయన తేల్చారు. అందుకే.. త్వరలో పథకాలకు నిధులు అందవు కాబట్టి… చంద్రబాబు ఆయన పార్టీ నేతలు ఫిర్యాదులు చేసి.. బ్యాంకులను బెదిరించి అప్పులు రాకుండా చేశారని అందుకే పథకాలకు డబ్బులు పంపిణీ చేయలేకపోతున్నామని ప్రచారం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారని తేల్చారు. దానికి సంబంధించి ఇప్పటికే… ఆరోపణల పర్వం ప్రారంభించేశారని కూడా ఆర్కే చెప్పుకొచ్చారు.

తమపై దాఖలైన రాజద్రోహం కేసులో .. సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ వేసిన అఫిడవిట్‌పైనా వేమూరి రాధాకృష్ణ సెటైర్లు వేశారు. అంతంతం మంది సలహాదారులను పెట్టుకుని కూడా ఈ తలాతోక లేని పనులు ఎందుకు చేస్తున్నారని ఆర్కే ఆశ్చర్యపోయారు. తమకు ఇప్పుడే తెలివి వచ్చిందని సుప్రీంకోర్టులో ప్రభుత్వ లాయర్ వాదించడాన్ని ఆర్కే కామెడీచేశారు. అఫిడవిట్‌లు వేయడమే కాదు… ఆధారాలు చూపించాలని కూడా గుర్తు చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎయిడెజ్ కాలేజీలపై ప్రభుత్వ విధానంతో మైనస్సే !

దశాబ్దాలుగా విద్యా సేవ అందిస్తున్న ఎయిడెడ్ కాలేజీలను అయితే ప్రభుత్వానికి స్వాధీనం చేయాలి లేకపోతే ప్రైవేటుగా నిర్వహించుకోవాలని ప్రభుత్వం ఆదేశించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఎయిడెడ్ కాలేజీలు ప్రభుత్వానివిగానే సాగుతున్నాయి....

తెలంగాణలో కూడా ప్రభుత్వ మటన్ !

ఏపీ ప్రభుత్వం మటన్ మార్టుల పేరుతో ఓ కాన్సెప్ట్‌ను ‌తమ అధికార మీడియా ద్వారా ప్రజలకు తెలియచెబితే జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. చివరికి పశుసంవర్థక మంత్రి అలాంటి ఆలోచనలేదని. అలా...

కేశినేనివి బెదిరింపులా ? నిజంగానే విరక్తి చెందారా ?

కేశినేని నాని ఇక ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లుగా టీడీపీని వ్యతిరేకించే.. వైసీపీకి దగ్గరగా ఉండే మీడియాలో ప్రచారం జరిగింది. ఆయనే ఈ విషయాన్ని చెప్పినట్లుగా ఆ మీడియా చెప్పుకొచ్చింది. తన ఆశక్తతను...

టీ కాంగ్రెస్ సీనియర్ల అసంతృప్తి కూడా కామెడీ అయిపోతోందా !?

తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్లుగా చెలామణి అయ్యే కొంత మంది నాయకులను రేవంత్ రెడ్డి ప్రణాళిక ప్రకారం సైడ్ చేస్తున్నట్లుగా ఉన్నారు. కలసి వస్తే సరే లేకపోతే వారి అసంతృప్తిని కూడా లెక్కలోకి రాకుండా...

HOT NEWS

[X] Close
[X] Close