ఆర్కే పలుకు : బీజేపీ, జనసేన మైండ్ ట్యూన్ చేస్తున్న ఆర్కే !

ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై జనసేన, బీజేపీ మైండ్‌లను ట్యూన్ చేసే ప్రయత్నాలను ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్రారంభించారు. తన వారాంతపు ఆర్టికల్ ” కొత్తపలుకు”లో తాను రెండు పార్టీలకు చెప్పాలనుకున్నది చెప్పడమే కాదు.. బీజేపీ హైకమాండ్ కూడా మనసు మార్చుకుంటోందని.. టీడీపీతో పొత్తుకు రెడీ అవుతోందని కొన్ని కారణాలు చెప్పారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ చేసిన మూడు ఆప్షన్ల ప్రకటన వ్యూహాత్మకంగా ఎంత తప్పిదమో కూడా వివరించే ప్రయత్నం చేశారు.

ఈ వారం ఆర్కే “కొత్తపలుకు”లో అన్ని పార్టీలకు పరోక్ష సందేశాలే ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. మహానాడు సక్సెస్ తర్వాత వార్ వన్‌సైడ్ అంటున్న టీడీపీ అధినేతకూ ఆయన పరోక్షంగా సలహా పంపించారు. పెద్ద ఎత్తున డబ్బులు, అధికార దుర్వినియోగానికి పాల్పడనున్న జగన్‌ను తట్టుకోవాలంటే కేంద్రంలో అధికారం మద్దతుగా ఉండాలన్న సందేశాన్ని పంపించారు. బీజేపీతో పొత్తు విషయంలో టీడీపీలో అంత సానుకూలత లేదు. జనసేనతోనూ పొత్తు వద్దని ఎక్కువ మంది నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకే చంద్రబాబు కూడా ఇటీవలి కాలంలో పొత్తుల మాటలు తగ్గించారు. ఇది మంచిది కాదని కలసి పోటీ చేయాలని ఆర్కే తన ఆర్టికల్ తన సందేశాన్ని పరోక్షంగా పంపారని అనుకోవచ్చు.

పవన్ కల్యాణ‌్ రహస్యంగా ఢిల్లీ వెళ్లి ఏపీ వ్యవహారాలు చూసే బీజేపీ ముఖ్యులతో సమావేశాలు జరిపి ఏపీలో పరిస్థితిని వవరించారు. వైసీపీని ఓడించాలంటే ఖచ్చితంగా టీడీపీతో పొత్తు పెట్టుకుని తీరాల్సిందేనని చెప్పారన్న కొత్త విషయమూ ఆర్కే చెప్పారు. పవన్ కల్యాణ్ అలా చెప్పారో లేదో తెలియదు కానీ.. పవన్ చెప్పిన విషయంలో మ్యాటర్ ఉందని బీజేపీ హైకమాండ్ భావిస్తోందని.. వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉందని నిర్ణయానికి వచ్చిందని భావిస్తున్నారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ ఓట్లు చీలనివ్వబోమని ప్రకటన చేసిన తర్వాత షరతులు పెట్టడం ఏమిటన్నవాదన కూడా తీసుకొచ్చారు. ముందే చెప్పాల్సిందన్నారు.

మొత్తంగా పొత్తుల విషయంలో దూర దూరంగా ఉంటున్న పార్టీలను ఆర్కే తన ఆర్టికల్ ద్వారా దగ్గర చేసేందుకు ప్రయత్నించారు. పరిస్థితుల్ని వివరించి వారి మైండ్‌ను ట్యూన్ చేసే బాధ్యతను ఎంచుకున్నట్లుగా కనిపిస్తోంది. మరో వైపు ఎప్పట్లాగే జగన్ తీరును.. ఆ పార్టీ నేతల తీరును కూడా సుదీర్ఘంగా విశ్లేషించారు. పతనానికి చాలా స్పష్టమైన సంకేతాలున్నాయని తేల్చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సాలు .. సాలంటున్న బీజేపీ, టీఆర్ఎస్ !

సొలు దొర - సెలవు దొర అని బీజేపీ అంటూంటే... సాలు మోదీ.. సంపకు మోదీ అని టీఆర్ఎస్ రివర్స్ కౌంటర్ ఇస్తోంది. తమ పార్టీ ఆఫీస్ ముందు డిజిటల్ బోర్డు...

చివరికి కుప్పానికి విశాల్ రెడ్డిని కూడా పిలుస్తున్నారు !

కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామంటున్న వైసీపీకి దారి తెలుస్తున్నట్లుగా లేదు. మున్సిపల్ ఎన్నికల్లో చేసినట్లుగా అసెంబ్లీ ఎన్నికల్లో చేయలేమని అర్థమైందేమో కానీ ఇప్పుడు సినీ హీరోను చంద్రబాబుపై పోటీకి పెట్టాలని ప్లాన్ చేసుకుంటున్నారు. తమిళ...

ఏపీలో అధికారులు ఎవరైనా “కథలు” చెప్పాల్సిందే !

దొంగ లెక్కలు రాయడం.. తప్పుడు కథలు చెప్పడం ఇప్పుడు ఏపీ అధికారులకు ఓ కామన్ ప్రాక్టిస్ అయిపోయింది. పోలీసులు వివిధ కేసుల్లో చెప్పిన కథలు వారిని నవ్వుల పాలు చేశాయి. సోషల్...

దర్శి ఎమ్మెల్యే చెప్పుకున్నారు.. మిగతా వాళ్లు మనసులో దాచుకుంటున్నారు !

గడప గడపకూ వెళ్తే ప్రజలు నిలదీస్తున్నారని వైఎస్ఆర్‌సీపీ కి చెందిన దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్‌సీపీ నియోజకవర్గ ప్లీనరీలో మాట్లాడిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close