జగన్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాల వల్లే ఇప్పుడు ఎవరూ అయ్యో పాపం అని కూడా అనడం లేదని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం కొత్త పలుకులో చెప్పారు. అధికారం ఉందని కుప్పం సహా అన్ని చోట్లా గెలుస్తామని చెప్పి వై నాట్ 175 అని అహంకారం చూపారని కానీ ఇవాళ.. ఆయన పులివెందుల సీటుకే ఎసరు వచ్చిందన్నారు. ఎంత దొంగ ఓట్లు వేసినా… డిపాజిట్ ఎలా కోల్పోతారని వైసీపీ వాదనను ఆయన వీటో చేసి పడేశారు . అదే సమయంలో పులివెందులలో వైఎస్ కుటుంబ బలాన్ని కూడా ఆయన విశ్లేషించారు. అధాకారంలో ఉన్నవాళ్లు గట్టిగా దృష్టి పెడితే.. ఆ కుటుంబాన్ని అక్కడి ప్రజలు ఆదరించరని తేల్చేశారు.
దీనికి ఉదాహరణలు కూడా చెప్పారు. గతంలో వైఎస్ ఐదు వేల ఓట్ల తేడాతో ఎంపీ సీటులో గెలిచారు. అప్పుడు చంద్రబాబునాయుడు.. పులివెందుల విషయంలో చూసీచూడనట్టుగా పోవాలని చెప్పారట. అందుకే అప్పట్లో పరువు పోకుండా ఉందని చరిత్రలో ఎవరికీ తెలియని విషయాన్ని చెప్పారు. అదే సమయంలో ఇంత వరకూ ఎవరూ ఒకరి నియోజకవర్గంలో మరొకరు .. అసాధారణ రాజకీయాలు చేయలేదని.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వారి సామ్రాజ్యాల్లోకి చొరబడాలని అనుకోలేదని కూడా గుర్తు చేశారు. జగన్ రెడ్డి అన్ని హద్దులు దాటేశాడు కాబట్టే.. ఇప్పుడు అనుభవిస్తున్నాడని తేల్చేశారు.
కాంగ్రెస్ పార్టీని , జగన్ రెడ్డిని ఆర్కే ఒకే గాటన కట్టారు. ఇద్దరూ చేసిన తప్పుల వల్లనే అనుభవిస్తున్నారని.. ధర్మాన్ని చెరబట్టబట్టే ఇప్పుడు వారికి ఈ పరిస్థితి వచ్చిందని ఆర్కే చెబుతున్నారు. మోదీ మెప్పు కోసం జగన్ రెడ్డి చేస్తున్న విన్యాసాల వల్ల ఆయనకు సపోర్టు చేసే వారు కూడా లేకుండా పోయారని..జగన్ రెడ్డి. బతుకు ఇక బస్టాండేనన్న అర్థంలోఆర్కే కంక్లూడింగ్ ఇచ్చారు. జగన్ ఇక మారరు.. మారినా ఎవరికీ అవసరం లేదనే స్టేజ్ కు వచ్చేశాయని స్టాంపేశారు. మొత్తానికి పులివెందుల ఓటమితో ఫ్రస్ట్రేషన్ లో ఉన్న జగన్ కు.. మరింతగా భవిష్యత్ పై భయం కలిగించేలా చేయడంలో.. ఆర్కే తన కలం పదును చూపించారనుకోవచ్చు.