ఆర్కే పలుకు : జగన్‌కు సపోర్టు చేసే వాళ్లుండటం కలికాలమే !

ప్రచారసభల్లో జగన్మోహన్ రెడ్డి అమాయకంగా తనపై కుట్రలు చేస్తున్నారని.. తాను ఎంతో మంచి వాడినని .. ఇది కలికాలం అంటూ చేస్తున్న వ్యాఖ్యలు ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణను సూటిగా తగిలాయి. ఆయనకు కూడా అలాగే అనిపించినట్లుగా ఉంది. ఈ కొత్తపలుకును పూర్తిగా ఆ కలికాలానికే కేటాయించారు. ఎంత కలి కాలం కాకపోతే.. అడ్డగోలుగా హత్యలు చేసి..దోపిడీలు చేసి.. అరాచకం చేసి… రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి.. కూడా జగన్మోహన్ రెడ్డి కొంత మంది మద్దతు పొందుతారని ఆయన డౌట్. కళ్ల ముందు ఇంత కనిపిస్తున్నా జగన్మోహన్ రెడ్డికి కొంత మంది ఓటు వేసే వాళ్లు ఉండటం కలికాలమేనని ఆర్కే భావన.

కలికాలం పేరుతో జగన్ చెబుతున్న మాటలకు.. ఆయన చేసిన పనులు.. చేస్తున్న పనులకు పొంతన లేకపోవడంతో ఆర్కేకు కోపం వచ్చినట్లుగా ఉంటుంది. వైఎస్ వివేకా హత్య కేసు నుంచి ప్రతి విషయాన్ని విశ్లేషించే ప్రయత్నం చేశారు. చివరికి న్యాయం చేయమని అడుగుతున్న చెల్లెళ్లపైనా ఇష్టం వచ్చినట్లుగా నిందలు వేసి.. హంతకుడ్ని కాపాడుతున్న తీరు కలికాలమేననేది ఆర్కే భావన. అయితే ఈ కలికాలంలో కలి ఎవరో ప్రజలకు క్లారిటీ వచ్చిందని ముఖ్యంగా కడప ప్రజలకూ క్లారిటీ వచ్చిందని ఆర్కే చెబుతున్నారు. దానికి బస్సు యాత్ర పరిస్థితుల్నే సాక్ష్యంగా చూపిస్తున్నారు.

టీడీపీ కూటమి పొత్తులు పెట్టుకున్న తర్వాత వైసీపీ పరిస్థితి మెరుగు అయిందంటూ వైసీపీ మీడియా, సోషల్ మీడియా చేస్తున్నప్రచారంపైనా సెటైర్లు వేశారుు. వైసీపీ పరిస్థితి మెరుగు అయితే పార్టీ నేతలు ఎందుకు వెళ్లిపోతారని ఆర్కే ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే టిక్కెట్లు ఇచ్చిన వారిలోచాలా మంది తమకు చాన్స్ ఇస్తే కూటమి నుంచి పోటీ చేస్తామని రాయబారాలు నడుపుతున్నారని ఆర్కేచెబుతున్నారు. ఎంతగా ప్రచారం చేయిచినా ప్రయోజనం లేదని ఆర్కే తేల్చేశారు.

అయితే కలికాలం అంతరించి మంచి కాలం వస్తుందని కూడా ఆర్కే పరోక్షంగా జగన్ కు హెచ్చరికలు పంపారు. ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో బీఆర్ఎస్ పరిస్థితిని చూపి హింట్ ఇచ్చారు.అంతేనా… షర్మిల కాంగ్రెస్ లో చేరి రాజకీయం చేస్తోంది 2029 ఎన్నికల కోసమేనని అంటున్నారు. అంటే.. అప్పటికే జగన్ జైల్లో ఉంటాడు.. పార్టీ మళ్లీ కాంగ్రెస్ గా మారిపోతుందని చెప్పకనే చెప్పారు. కలికాలం అంటూ జగన్ అన్న ఒక్క మాటతో ఆర్కే ఇంత ర్యాగింగ్ చేశారని అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

ఎన్నారై కనిపిస్తే వణికిపోతున్నారేంటి

డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే అమెరికా డాక్టర్.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు అక్కడ ఉన్నారు. అప్పుడే జగన్ రెడ్డి తన అత్యంత విలాసవంతమైన స్పెషల్ ఫ్లైట్‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close