మీడియా వాచ్ : అనవసర అతితో టీడీపీ నెత్తిన చెయ్యి పెడుతున్న ఏబీఎన్ !

” ఇంత ఓవరాక్షనా ” అని టీడీపీ కార్యకర్తలు కూడా ఏబీఎన్ ను చూసి నోళ్లు నొక్కుకంటున్నారు. వైసీపీ మీద దాడి చేస్తున్నట్లుగా షో చేస్తూ.. టీడీపీని నష్టం చేయడానికి అండర్ కవర్ ఆపరేషన్ ఏమైనా చేస్తున్నారా అన్న డౌట్ అందరికీ వస్తోంది. అవినాష్ రెడ్డిపై సీబీఐ విచారణ విషయంలో కానీ.. ఇతర అమరావతి అంశాల్లో కానీ ఏబీఎన్ తో పాటు.. వెంకటకృష్ణ లాంటి వాళ్లు చేస్తున్న అతి వైసీపీ సోషల్ మీడియాకు వరంలా మారుతోంది.

పథకాలు ఆపేస్తాని టీడీపీనే చెప్పడం లేదు.. కానీ వీకే చెప్పేస్తున్నారు !

వైసీపీ ప్రభుత్వంపై పోరాటమంటే టీడీపీకి మద్దతివ్వడం కాదు. ప్రజల వైపు నిలబడటం. ఆ లైన్ గుర్తించకుండా.. ఇష్టారీతిన కామెంట్లు చేస్తున్నారు వెంకటకృష్ణ. టీవీ5లో ఉన్నప్పుడు.. జగన్ బాకా ఊదిన ఆయన..ఏబీఎన్ కు వచ్చిన తర్వాత దానికి తగ్గట్లుగా మారారు. కానీ మారినట్లుగా కనిపిస్తున్నారేమో కానీ వర్జినల్ క్యారెక్టర్ అలాగే ఉందన్న అభిప్రాయం అప్పుడప్పుడూ చాలా మందికి వస్తూంటుంది. ఇటీవల ఆయన టీడీపీ వస్తే పథకాలు ఆపేస్తారు..ఇళ్ల స్థలాలు వెనక్కి తసుకుంటారని చెబుతున్నారు. ఆయన ఆ మాటలంటారని.. దాన్ని పట్టుకుని ప్రచారం చేసుకోవాలన్నట్లుగా వైసీపీ సోషల్ మీడియా రెడీ అయిపోతోంది. విస్తృతంగా ప్రచారం చేస్తోంది. నిజానికి టీడీపీ కూడా ఎప్పుడూ పథకాలు ఆపేస్తామని చెప్పలేదు.కానీ వెంకటకృష్ణకు ఎందుకంత తుత్తర.

అవినాష్ రెడ్డి అరెస్ట్ విషయంలో అతి మాములుగా లేదు !

అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేస్తుందో లేదో తెలియదు. కానీ ఏబీఎన్ మాత్రం అరెస్ట్ చేసేసింది. విచారణ ప్రతి దశలోనే అత్యంత అతి చూపిస్తూ టీడీపీ సానుభూతిపరులేే విరక్తి వచ్చేలా చేస్తోంది. ఇదిగో అరెస్ట్.. అదిగో కేంద్ర బలగాలు అంటారు. అరెస్ట్ చేసి హెలికాఫ్టర్ తో తీసుకెళ్తారు అంటారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారో కానీ..ఈ అతిని.. వైసీపీ నేతలు మాత్రం కామెడీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి తాము చేయాల్సిన నష్టం అంతా వారే చేస్తున్నారని సంబర పడుతున్నారు.

ప్రజల వైపు నిలబడితే చాలు టీడీపీ తరపున వకాల్తా అక్కర్లేదు !

ధైర్యవంతమైన మీడియాగా ప్రజల తరపున నిలబడితే చాలని.. తెలుగుదేశం పార్టీకి వకాల్తా అక్కర్లేదని..ఆ పార్టీ నేతలు కూడా ఏళ్లుగా గుసగుసలాడుకుంటున్నారు. పార్టీకి మద్దతుగా ఏమీ ఇవ్వాల్సిన పని లేదు.. ఆ పేరుతో ఇంకా డ్యామేజ్ చే్యకపోతే చాలని అనుకుంటున్నారు. ఏబీఎన్ , ఆంధ్రజ్యోతి వల్ల టీడీపీకి లాభం జరుగుతుందని ఆ పార్టీ క్యాడర్ అనుకోవడం లేదు. నష్టం జరుగుతుందని మాత్రం అనుకుంటున్నారు. ప్రభుత్వం పై కొన్ని విషయాల్లో కీలక విషయాలు బయటపెట్టిన మిగతా అతి మాత్రం..టీడీపీ వాళ్లు కూడా భరించలేకపోతున్నారు.

ఏబీఎన్ నిర్వహణ తేలిపోయిందా ?

ఓ టీవీ చానల్ ను మీడియా సంస్థలా కాకుండా హోటల్ లా నిర్వహించడం వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఏబీఎన్ లో పని చేసి వచ్చిన వారు సెటైర్లు వేసుకుంటున్నారు. గతంలో డెడికెటేడ్ జర్నలిస్టుల బృందం ఉండేది. వారికి మంచి అవగాహన ఉండేది. ఏది ఏ స్థాయిలో ఉంచాలో తెలుసుకునేవారు. ఇటీవల అందరూ కొత్త వాళ్లే వచ్చారు. వారు యాజమాన్యంకి ఇలా ఇస్తేనే సంతోషం అన్నట్లుగా చెలరేగిపోతున్నారు. హద్దూ పొద్దూ లేకుండా విరుచుకుపడుతున్నారు. తెలుసుకోవాల్సిన ఏబీఎన్ పెద్దలకూ తీరిక ఉండటం లేదు. నిర్వహణ చేస్తున్న వారు వేరే లోకంలో ఉంటారు. ఇలాంటి పరిస్థితిలో ఏబీఎన్.. నవ్వుల పాలవుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. టీడీపీ క్యాడర్ కూడా..ఏబీఎన్ అతి తగ్గించుకుంటే మంచిదని సలహాలిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవారం బాక్సాఫీస్‌: టాలీవుడ్ ‘సిక్స‌ర్‌’

ఈవారం కూడా బాక్సాఫీసు ద‌గ్గ‌ర సంద‌డి క‌నిపించ‌బోతోంది. ఏకంగా ఆరు సినిమాలు తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. అన్నీ కాస్తో.. కూస్తో క్రేజ్ ఉన్న సినిమాలే. రూల్స్ రంజ‌న్‌, మామా మ‌శ్చింద్ర‌, మంత్...

అలా అయితే రోజాను ఎన్ని సార్లు అరెస్ట్ చేయాలో !?

మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనను అరెస్ట్ చేయాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ డీజీపీకి లేఖ రాస్తే.. రెండు రోజుల తర్వాత అర్థరాత్రి పూట రెండు వందల...

మోడీ సభకు రాని వాళ్లంతా కాంగ్రెస్‌లో చేరిపోతారా !?

తెలంగాణ బీజేపీలో పరిస్థితి రోజు రోజుకు దిగజారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. స్వయంగా ప్రధానమంత్రి తెలంగాణ పర్యటనకు వస్తే..చాలా మంది సీనియర్ నేతలు హాజరు కాలేదు. ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎంపీలు...

టీడీపీ, జనసేన : క్షేత్ర స్థాయిలో కలిసిపోయిన లీడర్ , క్యాడర్

రాజకీయాల్లో ఒకటి ప్లస్ ఒకటి ఎప్పుడూ రెండు కావని... ఒక్కో సారి జీరో అవుతుందని పవన్ కల్యాణ్ అవనిగడ్డ సభ చూసిన తర్వాత అంబటి రాంబాబు ట్వీట్ పెట్టారు. అదే సమయంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close