ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో ఆయనను ఎప్పుడు అరెస్టు చేస్తారన్న చర్చ ప్రారంభమయింది. గవర్నర్ అనుమతి చార్జిషీటు దాఖలు చేయడానికే.. అరెస్టు చేయడానికి కాదు. అలాగని అరెస్టు చేయడానికి గవర్నర్ పర్మిషన్ ఇవ్వలేదని కాదు. ఎప్పుడో మొదటి సారి విచారణకు అనుమతి ఇచ్చినప్పుడే అరెస్టుకు అవకాశం వచ్చేసింది. కానీ ప్రభుత్వం కేటీఆర్ ను ఉద్దేశపూర్వకంగానే అరెస్టు చేయలేదు.
కేటీఆర్ తనపై కేసును క్వాష్ చేయాలని సుప్రీంకోర్టు వరకూ వెళ్లినా వర్కవుట్ కాలేదు. అప్పుడే అరెస్టుకు ఆటంకాలు అన్నీ తేలిపోయాయి. చాలా సార్లు కేటీఆర్ ను అరెస్టు చేస్తారన్న ప్రచారంతో ఆయన ఇంటి వద్దకు అనుచరులు వచ్చి హడావుడి చేశారు. కేటీఆర్ కూడా దమ్ముంటే అరెస్టు చెయ్ అని సవాల్ చేశారు. కానీ చేయలేదు. అరెస్టు అయితే సానుభూతి వస్తుందని.. అరెస్టు అయితే సీఎం కావొచ్చని అనుకుంటున్నారని రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు.
ఇప్పుడు మరోసారి కేటీఆర్ అరెస్టు అంశం చర్చల్లోకి వచ్చింది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్.. చట్ట ప్రకారమే అంతా జరుగుతుందని చెప్పుకొచ్చారు. అయితే ఏసీబీ పోలీసులు వ్యూహాత్మకంగా ఉన్నారని.. చార్జిషీటు దాఖలు చేసి.. ఆయనను అరెస్టు చేయడానికి కోర్టు నుంచి వారెంట్ తీసుకుంటారని అంటున్నారు. అలా తీసుకుంటే.. రాజకీయ పరమైన అరెస్టు కాదని.. ఆయనకు సానుభూతి రాదని అనుకుంటున్నారు.


