‘ఆర్‌.ఆర్.ఆర్` ని ఫాలో అవుతున్న ‘ఆచార్య‌’

ప‌బ్లిసిటీ ప‌రంగా `ఆర్‌.ఆర్‌.ఆర్‌` సినిమా మొద‌ట్నుంచీ చివ‌రి వ‌ర‌కూ ఓ స్ట్రాట‌జీని కొన‌సాగిస్తూ వ‌చ్చింది. అది వ‌ర్క‌వుట్ అయ్యింది కూడా. కాక‌పోతే చివ‌ర్లో మీడియా ఇంట‌ర్వ్యూల విష‌యంలో.. మొక్కుబ‌డి వ్య‌వ‌హారంలా తంతు న‌డిపించేశారు. కేవ‌లం ప్రీ ఆర్గ‌నైజ్డ్ ఇంట‌ర్వ్యూలే బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అంటే.. ఓ యాంక‌ర్ ని పెట్టుకోవ‌డం, కావ‌ల్సిన క్వ‌శ్చ‌న్స్‌తో ఇంట‌ర్వ్యూ న‌డిపించ‌డం, దాన్నే… అన్ని ఛాన‌ళ్ల‌కూ పంచి పెట్ట‌డం… ఇలా జ‌రిగిపోయింది. రానా, సందీప్ రెడ్డి వంగా, సుమ‌, అనిల్ రావిపూడి.. కీర‌వాణి.. ఇలా ఇంట‌ర్వ్యూ ఎవ‌రు చేయాలి? అనే విష‌యంలోనూ ఆచి, తూచి వ్య‌వ‌హ‌రించారు. దాదాపుగా ఆర్‌.ఆర్‌.ఆర్ ప్ర‌చారం.. ఈ ప్లానింగ్ తోనే సాగింది.

ఇప్పుడు ఇదే స్ట్రాట‌జీని.. ఆచార్య కూడా ఫాలో అవుతోంద‌ని అనిపిస్తోంది. ఈనెల 29న `ఆచార్య‌` వ‌స్తోంది. అయితే ప‌బ్లిసిటీ ఇంకా మొద‌లెట్ట‌లేదు. ఇంకో వారం రోజుల్లో సినిమా ఉంద‌గా.. ప‌బ్లిసిటీ కి ప‌చ్చ జెండా ఊప‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఈలోగా.. ఓ ప్రీ ఆర్గ‌నైజ్డ్ ఇంటర్వ్యూ వ‌దిలారు. ఇది ఆరంభం మాత్ర‌మే. ఇలాంటి ఆర్గ‌నైజ్డ్ ముఖాముఖిలు. ఇంకొన్ని ఉన్నాయ‌ని స‌మాచారం. ఆర్‌.ఆర్‌.ఆర్ విష‌యంలో మీడియా గుర్రుగా ఉంది. పాన్ ఇండియా సినిమా తీసి, తెలుగు మీడియాకు ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌లేద‌ని అలిగింది. ఇప్పుడు అదే స్ట్రాట‌జీని ఆచార్య కూడా అనుస‌రిస్తే.. ఇలాంటి విమ‌ర్శ‌లు త‌ప్ప‌వు. కాక‌పోతే… చిరంజీవి ఎప్పుడూ మీడియాకు అందుబాటులోనే ఉండే హీరో. మీడియాతో ఎలా మ‌సులుకోవాలో ఆయ‌న‌కు బాగా తెలుసు. మ‌రి ఈసారి ఆయ‌న ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అడ‌గొద్దంటూనే అప్ డేట్ ఇచ్చిన ఎన్టీఆర్‌

ఆర్‌.ఆర్‌.ఆర్ త‌ర‌వాత ఎన్టీఆర్ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్ల‌లేదు. కొర‌టాల సినిమా ఓకే అయినా దానికి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ బ‌య‌ట‌కు రావ‌డం లేదు. దీంతో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరుత్సాహంగా ఉన్నారు....

పవన్ ఫ్యాన్స్‌తో లొల్లి పెట్టుకున్న బండ్ల గణేష్ !

బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసుల్లో కోర్టుల చుట్టూ తిరగడంతో పాటు ఆన్ లైన్‌లో తనకు ఉపయోగపడతారనుకున్న వారిపై పొగడ్తలు.. తనకు ఇష్టం లేని వారిపై తిట్లు కురిపిస్తూ టైం పాస్ చేస్తూంటారు....

జగన్ అడ్డుకోకపోతే 10 రోజుల్లోనే వివేకా హంతకులు దొరికేవారు : దస్తగిరి

వివేకా హత్యకేసులో త్వరలో నిజాలు తెలనున్నాయని, వాస్తవాలు బయటపడే రోజు దగ్గర పడిందని దస్తగిరి అన్నారు. ఇప్పటి వరకూ దస్తగిరి చెప్పింది అబద్దమని అన్నారని, ఇకపై తాను చెప్పిన నిజాలు ఏంటో...

ఒక్క బటన్ నొక్కండి – మహారాష్ట్ర ప్రజలకు కేసీఆర్ పిలుపు !

భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన తర్వాత తొలి సారిగా మహారాష్ట్రలోని నాందేడ్‌లో బహిరంగసభ ఏర్పాటు చేసిన కేసీఆర్.. ఒక్క బటన్ నొక్కితే దేశమంతా మారిపోతుందని ప్రజలకు పిలుపునిచ్చారు. యుద్ధం చేయమని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close