‘ఆచార్య‌’ని మ‌ళ్లీ రేసులోకి తెచ్చిన సిద్ధ‌

ఆచార్య‌…. చిరంజీవి – కొర‌టాల కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న సినిమా. ఎప్పుడో విడుద‌ల కావాల్సింది. కానీ ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ఇది చిరంజీవి సినిమా. పైగా అప‌జ‌యం అంటూ ఎరుగ‌ని కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సినిమా. అందులోనూ… రామ్ చ‌ర‌ణ్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఎలా చూసినా ఈ సినిమా క్రేజు ఆకాశాన్ని తాకాల్సిందే. కానీ.. అనుకున్నంత హైప్ ఈ సినిమాకి లేద‌న్న‌ది నిజం. దానికి కార‌ణాలెన్నో. ఓ వైపు పుష్ప‌.. మ‌రోవైపు ఆర్‌.ఆర్‌.ఆర్… టాలీవుడ్ ని షేక్ చేసేస్తున్నాయి. ఈ రెండు సినిమాల గురించి జ‌నం మాట్లాడుకున్నంత‌గా మ‌రో సినిమా గురించి చ‌ర్చించుకోవ‌డం లేదు. దాంతో.. మిగిలిన సినిమాలు కంటికి ఆన‌డం లేదు. పైగా.. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో సినిమాల గురించి మాట్లాడుకునే తీరికే ఎవ‌రికీ లేకుండా పోతోంది. సినిమా బాగుంటే చూస్తారు. లేదంటే ప‌ట్టించుకోరు. అందుకే.. ఏ సినిమాపైనా ప్ర‌త్యేకమైన అంచ‌నాలు పెట్టుకోవ‌డం లేదు. ఆ కోవ‌లో ఆచార్య చేరిపోయింది.

అయితే స‌డ‌న్ గా ఆచార్య‌ని రేస్‌లోకి తీసుకొచ్చింది సిద్ధ టీజ‌ర్‌. రామ్ చ‌ర‌ణ్ ఈ సినిమాలో సిద్ధ‌గా క‌నిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. సిద్ధ పాత్ర‌ని ప‌రిచ‌యం చేస్తూ.. ఆదివారం ఓ టీజ‌ర్ వ‌దిలారు. నిజానికి ఈ టీజ‌ర్‌పై కూడా ఎలాంటి బ‌జ్ లేదు. కాక‌పోతే.. టీజ‌ర్ అంద‌రికీ న‌చ్చేసింది. ముఖ్యంగా చిరుత‌నీ, చిరుత పిల్ల‌నీ చిరు, చ‌ర‌ణ్‌ల‌తో పోల్చుతూ.. తీసిన చివ‌రి షాట్ అయితే – ఫ్యాన్స్‌కి మ‌రింత బాగా న‌చ్చేసింది. ఇలాంటి సీన్లు థియేట‌ర్లో చూస్తే.. ఆ కిక్కే వేరుగా ఉంటుంది. యూ ట్యూబ్‌లో ప్ర‌స్తుతానికి ఈ టీజ‌రే ట్రెండింగ్‌.సోష‌ల్ మీడియాలో ఈ షాట్ గురించి మాట్లాడుకోవ‌డం మొద‌లెట్టారు. మార్కెట్ వ‌ర్గాల దృష్టి కూడా ఒక్క‌సారిగా ఆచార్య‌పై మ‌ళ్లింది. కొర‌టాల శివ ఏదో మ్యాజిక్ చేయ‌బోతున్నాడ‌న్న ధీమా.. ఈ టీజ‌ర్ తో మ‌రింత క‌లిగింది. ఇప్పుడు ఇలాంటి స‌ర్‌ప్రైజ్ మూమెంట్స్‌.. ఆచార్య నుంచి ఇంకొన్ని కావాలి. ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల అవుతోంది కాబ‌ట్టి.. ఆచార్య ప్ర‌మోష‌న్ల‌కు కావ‌ల్సినంత స‌మ‌యం ఉంది. మెల్ల‌మెల్ల‌గా జోరు పెంచుకుంటూ పోతే.. సంక్రాంతిసినిమాల హ‌డావుడి త‌గ్గాక – ఆచార్య ప్ర‌మోష‌న్లు స్పీడందుకుంటే… మ‌ళ్లీ ఆచార్య రేసులోకి రావ‌డం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పవన్ ఫ్యాన్స్‌తో లొల్లి పెట్టుకున్న బండ్ల గణేష్ !

బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసుల్లో కోర్టుల చుట్టూ తిరగడంతో పాటు ఆన్ లైన్‌లో తనకు ఉపయోగపడతారనుకున్న వారిపై పొగడ్తలు.. తనకు ఇష్టం లేని వారిపై తిట్లు కురిపిస్తూ టైం పాస్ చేస్తూంటారు....

జగన్ అడ్డుకోకపోతే 10 రోజుల్లోనే వివేకా హంతకులు దొరికేవారు : దస్తగిరి

వివేకా హత్యకేసులో త్వరలో నిజాలు తెలనున్నాయని, వాస్తవాలు బయటపడే రోజు దగ్గర పడిందని దస్తగిరి అన్నారు. ఇప్పటి వరకూ దస్తగిరి చెప్పింది అబద్దమని అన్నారని, ఇకపై తాను చెప్పిన నిజాలు ఏంటో...

ఒక్క బటన్ నొక్కండి – మహారాష్ట్ర ప్రజలకు కేసీఆర్ పిలుపు !

భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన తర్వాత తొలి సారిగా మహారాష్ట్రలోని నాందేడ్‌లో బహిరంగసభ ఏర్పాటు చేసిన కేసీఆర్.. ఒక్క బటన్ నొక్కితే దేశమంతా మారిపోతుందని ప్రజలకు పిలుపునిచ్చారు. యుద్ధం చేయమని.....

ప్ర‌శాంత్ వ‌ర్మ‌… మైథ‌లాజిక‌ల్ ట‌చ్‌!

కొత్త త‌ర‌హా క‌థ‌లు ఆలోచించ‌డంలో ప్ర‌శాంత్ వ‌ర్మ దిట్ట‌. ఆ, క‌ల్కి, జాంబిరెడ్డి... ఇలాంటి సినిమాలే. హ‌ను - మాన్‌తో ఫాంట‌సీకి మైథ‌లాజిక‌ల్ ట‌చ్ ఇస్తున్నాడు. తేజా స‌జ్జా హీరోగా న‌టిస్తున్న ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close