ఆచార్య టీజ‌ర్‌: ధ‌ర్మ‌స్థ‌లిలో.. యాక్ష‌న్ షురూ!

చిరంజీవి – కొర‌టాల శివ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం `ఆచార్య‌`. కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. చ‌ర‌ణ్ ఓ కీల‌క పాత్ర‌ధారి. కొద్దిసేప‌టి క్రిత‌మే టీజ‌ర్ విడుద‌లైంది. ధ‌ర్మ‌స్థ‌లి నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. ఆ ప్రాంతం.. అక్క‌డి.. ఇబ్బందులు.. వాటిని పాల‌ద్రోల‌డానికి వ‌చ్చిన ఓ ఆచార్య‌… ఇదీ టీజ‌ర్ స‌రంజామా. చ‌ర‌ణ్ వాయిస్ ఓవ‌ర్‌తో టీజ‌ర్ న‌డిచింది.

ఇత‌ర‌కుల కోసం జీవించే వాళ్లు దైవంతో స‌మానం. అలాంటి వారి జీవితాలే ప్ర‌మాదంలో ప‌డితే.. ఆ దైవ‌మే వ‌చ్చి కాపాడాల్సిన ప‌నిలేదు…

చివ‌ర్లో “పాఠాలు చెప్పే అల‌వాటు లేక‌పోయినా అంద‌రూ ఎందుకో ఆచార్య అంటుంటారు. బ‌హుశా.. గుణ పాఠాలు చెబుతాన‌నేమో..” అనే చిరు డైలాగ్ తో టీజ‌ర్ క‌ట్ అయ్యింది.

ఈ టీజ‌ర్‌లో యాక్ష‌న్ కే పెద్ద పీట వేశారు. చివ‌ర్లో డంబుల్స్‌తో చిరు ఇచ్చిన కిక్ హైలెట్ అని చెప్పుకోవాలి. ఆచార్య దేవోభ‌వ‌- ఆచార్య ర‌క్షోభ‌వ‌.. అంటూ టీజ‌ర్‌లోనే.. మ‌ణిశ‌ర్మ త‌న మార్క్ బీజియ‌మ్స్ రుచి చూపించాడు. ఈ సినిమా కోసం అతి పెద్ద టెంపుల్ సెట్ వేసిన సంగ‌తి తెలిసిందే. టీజ‌ర్‌లో ఆ టెంపుల్ సెట్ పై బాగానే ఫోక‌స్ చేశారు. క‌ల‌రింగ్, ఆర్ట్ వ‌ర్క్ ఇవ‌న్నీ బాగా కుదిరాయి. ఈ వేస‌వికి `ఆచార్య‌` త‌న‌దైన హ‌వా చూపిస్తాడ‌న్న న‌మ్మ‌కం మ‌రింత బాగా క‌లిగించింది ఈ టీజ‌ర్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.