‘రూల‌ర్‌’…. యాక్ష‌న్ ఫీస్ట్‌

బాల‌య్య డైలాగులు చెబితే, మీసం మెలేస్తే… అభిమానుల‌కు పండ‌గే. యాక్ష‌న్‌లోకి దిగితే – ఆ ఊపు మామూలుగా ఉండదు. ‘ఎన్టీఆర్‌’ బ‌యోపిక్కుల్లో బాల‌య్య యాక్ష‌న్ అవ‌తారం చూసే అవ‌కాశం ద‌క్క‌లేదు. ‘రూల‌ర్‌’లో మాత్రం ఆ లోటు పూర్తిగా తీరిపోనుంది. ఎందుకంటే.. ఈ సినిమాని ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ ఓ యాక్ష‌న్ ఫీస్ట్‌లా తయారు చేశాడు. ఇందులో 5 ఫైట్స్ ఉన్నాయి. అందులో 4 ఫైట్స్ మ‌రీ భారీగా ఉంటాయ‌ట‌. మ‌రీ ముఖ్యంగా ఇంట్ర‌వెల్ ముందొచ్చే పోరాటం.. బాల‌య్య అభిమానుల్ని బాగా అల‌రిస్తుంద‌ని తెలుస్తోంది. బీహార్ నేప‌థ్యంలో డిజైన్ చేసిన ఈ పోరాటం సినిమా మొత్తానికే హైలెట్‌గా నిలుస్తుంద‌ని తెలుస్తోంది. మార్కెట్ నేప‌థ్యంలో మ‌రో ఫైట్ ఉంద‌ట‌. ట్రైన్‌లో ఇంకో భారీ పోరాట ఘ‌ట్టం ఉంద‌ట‌. ఇవి రెండూ మాస్ కోస‌మే డిజైన్ చేశార‌ని తెలుస్తోంది. బాలయ్య ట్రైన్ ఫైట్ అంటే న‌ర‌సింహ‌నాయుడు గుర్తొస్తుంది. ఈ ఎపిసోడ్ మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇది వ‌ర‌కు బాల‌కృష్ణ – కె.ఎస్‌.ర‌వికుమార్ కాంబోలో వ‌చ్చిన ‘జై సింహా’లోనూ యాక్ష‌న్ కి పెద్ద పీట వేశారు. ఈసారి ఆ డోసు మ‌రింత ఎక్కువైంద‌ట‌. ఫ్యామిలీ ఆడియ‌న్స్ కోసం ద్వితీయార్థంలో సెంటిమెంట్‌నీ రంగ‌రించార‌ని తెలుస్తోంది. మొత్తానికి అన్ని వ‌ర్గాల్నీ దృష్టిలోఉంచుకునే ‘రూల‌ర్‌’ని డిజైన్ చేశార‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com