సీనియర్ నటి, నిర్మాత ప్రియా రామన్ బీజేపీకి చేరింది. తిరుపతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి సమక్షంలో ఆమె పార్టీ తీర్థం పుచ్చుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే దేశాభివృద్ధి సాధ్యమని నమ్మడం వల్లే తాను బీజేపీలో చేరినట్లు చెప్పింది.
తమిళ్, మలయాళం, తెలుగు, కన్నడ సినిమాల్లో కనిపించారు ప్రియా రామన్ . 1993లో వచ్చిన వాలి ఆమె మొదటి సినిమా. ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే స్వయంగా రజనీకాంత్ రచించి, నిర్మించిన సినిమా ఇది. తర్వాత తమిళ్ తో పాటు మలయాళం తెలుగు సినిమాలు చేశారు. ఆమె నటించిన సీరియల్స్ కూడా మంచి ప్రాచుర్యం పొందాయి. ఇటీవలే ఆమె ‘పడిపడి లేచే మనసు’ సినిమాలో శర్వానంద్ తల్లిపాత్రలో కనిపించారు. ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకున్నారు.