ముంబై పోలీసులు చర్లపల్లిలో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి ఓ డ్రగ్స్ ముఠాను పట్టుకున్నారు. దానికి రూ. 12 వేల కోట్ల డ్రగ్స్ అనే కలరింగ్ ఇచ్చారు. తీరా చూస్తే అది మెఫిడ్రిన్ . పట్టుకున్నది కూడా వేల కిలోలు కాదు. దాని మొత్తం విలువ రూ. పన్నెండు కోట్ల లోపే ఉంటుందని తాజాగా తేల్చారు. కానీ ముంబై పోలీసులు తమ ఆపరేషన్ ను హైప్ ఇచ్చుకోవడం కోసం వేల కోట్ల కథ చెప్పారు. ఇక్కడి మీడియాను తెలివిగా ఉపయోగించుకున్నారు.
వేల కోట్ల డ్రగ్స్ అంటే సహజంగానే మీడియా అటెన్షన్ ఇస్తుంది. ఇక్కడి పోలీసులు ఎందుకు పట్టించుకోలేదన్న ప్రశ్నలు వస్తాయి. అలాగే వచ్చాయి. అసలేం జరిగిందో పోలీసులు ఆరా తీశారు. ఈగల్ టీం కూడా మొత్తం వివరాలు బయటకు లాగింది. కెమికల్ ప్రాసెసింగ్ పేరుతో మెఫిడ్రిన్ ను వారు తయారు చేస్తున్న విషయం నిజమేనని తేలింది కానీ అది ముంబై పోలీసులు చెప్పినట్లుగా వేల కోట్లు కాదని.. చాలా చిన్న మొత్తమని గుర్తించారు.
మెఫిడ్రిన్ ను.. హైదరాబాద్ చుట్టుపక్కల చాలా కెమికల్ కంపెనీల్లో వాడుతున్నారు. పలుమార్లు అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు కూడా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రగ్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈగల్ టీంను ఏర్పాటు చేశారు. అయితే ముంబై పోలీసులు చేసుకున్న ప్రచారం వల్ల వీరు ఇంత కాలం చేసిన శ్రమ అంతా ..వెనక్కిపోయింది.
