అదానీ, మేఘాలు కూడా బందరు పోర్టు కోసం టెండర్లు వేయట్లేదట..!

మచిలీపట్నం పోర్టును కట్టాలని ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలుస్తోంది. రూ. 5835 కోట్ల రూపాయలతో మొదటి దశ డీపీఆర్ సిద్ధం చేసింది. ఇక టెండర్లు వేసుకోండి అని ఆఫర్ ఇచ్చింది. ఇంకేముంది అసలే పోర్టు వెల్లువలా సంస్థలు వస్తాయనుకున్నారు. కానీ ఒక్కరు కూడా వచ్చి టెండర్ వేయలేదు. మొదటి సారిఎవరూ వేయకపోవడంతో రెండో సారి టెండర్లు పిలిచారు. రెండో సారీ అదే పరిస్థితి. దీంతో మరో రెండు వారాల పాటు గడువు పొడిగించాలని అనుకంటున్నారు. ఏపీలో పోర్టులంటే ఎగబడి కొనేస్తున్న అదానీ గ్రూప్ కానీ.. ఏపీలో టెండర్లు పడ్డాయంటే ముందు వరుసలో ఉండే మేఘా కానీ ఈటెండర్లపై ఎందుకు దృష్టి పెట్టలేదో ఎవరికీ అర్థం కావడం లేదు.

అదానీ సంస్థ పోర్టులను నిర్మించడంలో ఆసక్తి చూపిస్తోంది. టీడీపీ హయాంలో శ్రీకాకుళం జిల్లా భావనపాడు వద్ద పోర్టు నిర్మాణానికి ఒప్పందం చేసుకుంది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఒప్పందాన్ని రద్దు చేసి.. మళ్లీ ఒప్పందం చేసుకున్నారు. కానీ ఆ పోర్టు నిర్మాణం ప్రారంభమయిందో లేదో తెలియదు. ఇప్పుడు మచిలీపట్నం పోర్టు కోసం కనీసం టెండర్ కూడా అదానీ సంస్థ ఆసక్తిచూపడం లేదు. కట్టేసి భారీ లాభాల్లో ఉన్న పోర్టులు కృష్ణపట్నం, గంగవరంలను అదానీ సంస్థ టేకోవర్ చేసుకుంది.ఇక చాలనుకుందేమో కానీ మచిలీపట్నం పోర్టును లెక్కలోకి తీసుకోవడం లేదు.

తెలుగుదేశం పార్టీ ప్రభఉత్వ హయాంలో మచిలీపట్నంపోర్టు టెండర్‌ను నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ దక్కించుకుంది. పనులు ప్రారంభించింది. అయితే వైసీపీ ప్రభుత్వం రాగానే పోర్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. పోర్టు ప్రాజెక్టుకు సంబంధించిన పలు పనుల కోసం ఇప్పటికే రూ.436కోట్లు వ్యయం చేశామని నవయుగ సంస్థ కోర్టులో పిటిషన్ వేసింది. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో ఉంది. కాంట్రాక్ట్‌ను రద్దు చేసిన ప్రభుత్వం కొత్త వారికి ఇవ్వాలని టెండర్లు పిలుస్తోదంి. కానీ ఎవరూ రావడంలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘పుష్ప’లో రంగమ్మ మంగమ్మ మ్యాజిక్

https://www.youtube.com/watch?v=C70GJYVoZ4Y ''రంగస్థలం' లాంటి క్లాసిక్ తర్వాత సుకుమార్ చాలా గ్యాప్ తీసుకున్నారు. అల్లు అర్జున్ డేట్స్ దొరికేవరకూ వేరే ప్రాజెక్ట్ ముట్టుకోలేదు. చాలా హార్డ్ అండ్ గ్రౌండ్ వర్క్ చేసి ‘పుష్ప' ని సెట్స్...

బీ టౌన్ టాక్ : అల్లు అర్జున్ రాక్ స్టార్

అల్లు అర్జున్ పేరు బాలీవుడ్ న్యూస్ లో హాట్ టాపిక్ అయ్యింది. నిర్మాత కరణ్ జోహార్ అల్లు అర్జున్ ని రాక్ స్టార్ గా పిలిచారు. బుధవారం జరిగిన 'వరుడు కావలెను' ప్రీ...

వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయ ఇన్నింగ్స్ !?

హైదరాబాద్ వెరీ వెరీ స్పెషల్ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయనతో తాము ఇప్పటికే సంప్రదింపులు జరిపామని చేరేందుకు అంగీకరించారని అంటున్నారు. సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి,...

ఆఫీసర్ “మమత” అంటే మజాకానా ?

తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాల్లోని ముఖ్య నేతలు టీఆర్ఎస్‌లో చేరి పదవులు అందుకున్న తర్వాత ఉద్యోగ సంఘాల్లో ద్వితీయ శ్రేణి నాయకత్వం వచ్చింది. అలాంటి వారిలో టీజీవో అధ్యక్షురాలిగా ఉన్న మమత...

HOT NEWS

[X] Close
[X] Close