ప్రపంచంలోనే అతి పెద్ద మురికివాడ ముంబైలోని ధారావి. అక్కడ పరిస్థితుల్ని చూసేందుకు పర్యాటకులు కూడా ఇస్తారంటే.. అక్కడి జీవితం ఎంత విచిత్రంగా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. కేవలం 600 ఎకరాల ప్రాంతంలో 10 లక్షల మంది నివాసం ఉంటారు. అక్కడే వేల కొద్దీ కుటీర పరిశ్రమలు ఉంటాయి. ముంబై ప్రభుత్వం ఇప్పుడా ప్రాంతం మొత్తాన్ని సిటీగా మార్చేయాలని.. ప్రాజెక్టు చేపట్టింది. ఆ టెండర్ ను ఆదాని జాయింట్ వెంచర్ గా చేపట్టింది.
మహారాష్ట్ర ప్రభుత్వం-అడానీ జాయింట్ వెంచర్ నవభారత్ మెగా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి చేపట్టింది. ఈ ప్రాజెక్ట్ 7 సంవత్సరాల్లో పూర్తి అవుతుంది. ఇది రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్ స్పేస్‌లను ఏకీకృతం చేస్తూ, ధారావి ఆర్థిక వ్యవస్థను కాపాడుతుంది. మాస్టర్ ప్లానర్‌గా ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ధారావిలో సర్వే పూర్తయింది. రైల్వే ల్యాండ్ లో డెలవప్మెంట్ కూడా ప్రారంభించారు.
లక్ష కోట్లకుపైగా వెచ్చించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ప్రాజెక్ట్ మహారాష్ట్ర స్లమ్ రిహ్యాబిలిటేషన్ యాక్ట్ ప్రకారం, సెక్టార్లుగా విభజించి అమలు చేస్తారు. మొదటి ఫేజ్ రైల్వే ల్యాండ్ 27.6 ఎకరాలు లో రిహ్యాబ్ యూనిట్లు + రైల్వే ఎంప్లాయీల హౌసింగ్ నిర్మిస్తారు. ప్రాజెక్ట్ హ్యూమన్-సెంట్రిక్: ఎలిజిబుల్ రెసిడెంట్లకు ఉచిత ఫ్లాట్లు, బిజినెస్ రిహ్యాబ్ కల్పిస్తారు. అక్కడ అద్దెకు ఉంటున్న వారికి 70,000+ యూనిట్లు ఇస్తారు. అయితే వీరు పాతికేళ్లుగా అక్కడే ఉండాలి. . ప్రతి ఫ్యామిలీకి 350 చ.అడుగుల ఫ్రీ ఫ్లాట్ ఇస్తారు.
కొంత కాలం నుంచి అక్కడ ఉంటున్న 50,000+ ఫ్యామిలీలకు హైర్-పర్చేజ్ రెంటల్ హౌసింగ్ లేదా కాంపెన్సేషన్ ఇస్తారు. మెరుగైన లైఫ్‌స్టైల్, హెల్త్, ఎడ్యుకేషన్ సదుపాయాలు కల్పిస్తారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే అర్బనైజేషన్ ప్రాజెక్టుల్లో .. ముఖ్యంగా మురికివాడలను అభివృద్ధి చేయడంలో ఓ మోడల్ గా మిగిలే అవకాశం ఉంది.