సింగరేణిలోకీ అదానీ ఎంట్రీ – కేసీఆర్ కూడా ఆపలేరు !

తెలంగాణలోని సింగరేణిలో అదానీ గ్రూప్ ఎంటరయ్యే అవకాశం కనిపిస్తోంది. సింగరేణి కోల్ మైన్స్ నిర్వహించిన టెండర్ ప్రక్రియలో అతి తక్కువ ధరతో అదానీ గ్రూప్ ఎల్-1 గా నిలిచారు. ఒడిశాలోని నైని కోల్ బ్లాక్‌లలో మైనింగ్ ప్రక్రియతో పాటు ఆపరేషన్ల కోసం ఆహ్వానించిన సింగరేణి ఈ టెండర్లను ఆహ్వానించింది. అందరి కంటే తక్కువకు కోట్ చేసి అదానీ మొదటి స్థానంలో నిలిచారు. టెండర్ అదానీ గ్రూప్‌కు ఇవ్వక తప్పని పరిస్థితి.

ఒడిశాలోని నైని కోల్ బ్లాక్‌ సింగరేణికి ఎనిమిదేళ్ల కిందట కేటాయించారు. మరే సంస్థతో భాగస్వామ్యం లేకుండా పూర్తి షేర్లు సింగరేణికే ఉన్నాయి. అక్కడ బొగ్గు తవ్వకాలకు ఇటీవలే అనుమతి లభించింది. అన్ని రకాల అనుమతులు రావడంతో ఏటా 10 మిలియన్ టన్నుల మేర బొగ్గు తవ్వకాలు, ఆపరేషన్ కోసం సింగరేణి సంస్థ టెండర్లను ఆహ్వానించగా ఐదు కంపెనీలు ఆసక్తి చూపాయి. అదానీ, అంబానీలకు దేశ సంపదను దోచిపెడుతున్నట్లు మోడీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ సర్కారు నిప్పులు చెరుగుతున్న సమయంలో సింగరేణి ఆధ్వర్యంలోని నైని కోల్ బ్లాక్ టెండర్‌లలో పాల్గొని మొదటి స్థానంలో నిలవడంతో ఇప్పుడు ప్రభుత్ నిర్ణయం ఎలా ఉంటుందన్న చర్చ ప్రారంభమయింది.

నైని కోల్ బ్లాక్ టెండర్ల ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగినట్లు పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో ఆరోపణలు చేశారు. ఇదే విషయాన్ని పార్లమెంటు వేదికగా కూడా ప్రశ్నించారు. విదేశీ బొగ్గుకు అదానీ సంస్థ మన దేశంలో ఏకైక ఇంపోర్టర్‌గా ఉన్నదని, ఆ సంస్థకు లాభాలు చేకూర్చి పెట్టడానికే థర్మల్ విద్యుత్ ప్లాంట్లన్నీ తప్పనిసరిగా విదేశీ బొగ్గును బ్లెండింగ్ చేసేలా దిగుమతి చేసుకోవాలన్న నిబంధన తీసుకొచ్చారని కేసీఆర్ ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సింగరేణిలోకి అదానీ ఎంట్రీని కేసీఆర్ అంగీకరిస్తారా ? అడ్డుకుంటారా అన్నది కీలకంగా మారింది. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికే మెజారిటీ వాటా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు – జైలు – వాయిదాలు !

ఎఫ్ఐఆర్ కూడా లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కానీ న్యాయం కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్లపై తీర్పులు మాత్రం.. అంత వేగంగా రావడం లేదు. ఎప్పుడొస్తాయో తెలియదన్నట్లుగా సీన్...

అనసూయ కన్నీళ్లకి అసలు కారణం ఇదే

యాంకర్, నటి అనసూయ ఇటివలే షేర్‌ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో ఆమె కన్నీటి పర్యంతమవుతూ కనిపించారు. ఆన్‌లైన్‌ల ట్రోల్స్ వల్లే ఆమె కన్నీళ్లు పెట్టుకుందని నెట్టింట ప్రచారం...

ప్రభాస్ ‘కల్కి’తో జాగ్రత్త!

ప్రభాస్‌ తో నాగ్ అశ్విన్‌ రూపొందిస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’. కమల్‌ హాసన్‌ విలన్‌, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, దీపిక పదుకొణె, దిశా పటానీ ఇలా...

అసెంబ్లీలో 10 మంది టీడీపీ ఎమ్మెల్యేల్ని ఎదుర్కోలేక నైతిక పతనమైన వైసీపీ!

అసెంబ్లీలో వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీకి గట్టిగా పదిహేను మంది ఉన్నారు. వారిలో ఐదుగురు సైలెంట్ గా ఉంటారు. మహా అయితే గట్టిగా ఓ పది మంది టీడీపీ సభ్యులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close