జేపీ అసోసియేట్స్ కంపెనీని అదానీకి గ్రూప్ కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు ద్వారా కేవలం సిమెంట్ ప్లాంట్లను మాత్రమే కాకుండా, జేపీ గ్రూప్‌కు ఉన్న భారీ ల్యాండ్ బ్యాంక్ కూడా అదానీ సొంతమయింది. జేపీ గ్రూపు ఇటీవలి కాలంలో అప్పుల్లో కూరుకుపోయింది. ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదు. ఉత్తర భారతదేశంలోని నోయిడా, గ్రేటర్ నోయిడా వంటి ప్రాంతాల్లో జేపీ గ్రూప్‌కు వేల ఎకరాల భూమి ఉంది. ఏళ్ల తరబడి నిలిచిపోయిన ప్రాజెక్టుల వల్ల ఇబ్బంది పడుతున్న దాదాపు 20,000 మందికి పైగా ఫ్లాట్ కొనుగోలుదారులకు అదానీ రాకతో పెద్ద ఊరట లభించనుంది. అదానీ గ్రూప్ తన ఆర్థిక బలంతో ఈ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసే అవకాశం ఉండటంతో, రియల్ ఎస్టేట్ మార్కెట్లో నమ్మకం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
జేపీ గ్రూప్‌కు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగం ద్వారా గతంలో కొన్ని ప్రాజెక్టులలో భాగస్వామ్యం ఉండేది. ఇప్పుడు ఆ ఆస్తులన్నీ అదానీ గ్రూప్ చేతికి రావడంతో, హైదరాబాద్ శివార్లలో అదానీ గ్రూప్ చేపట్టబోయే కొత్త మెగా టౌన్షిప్లకు లేదా కమర్షియల్ హబ్‌లకు ఈ భూములు, వనరులు ఉపయోగపడవచ్చు. జేపీ సిమెంట్ ప్లాంట్లు అదానీ గ్రూప్ పరమవడంతో, దక్షిణాదిలో సిమెంట్ సరఫరా నెట్వర్క్ బలపడుతుంది. దీనివల్ల హైదరాబాద్‌లో నిర్మాణ రంగంలో ఉన్న బిల్డర్లకు మెరుగైన సరఫరా వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది.
అదానీ గ్రూప్ ఇప్పటికే ముంబైలోని ధారావి పునరాభివృద్ధి ప్రాజెక్టు వంటి భారీ పనులను చేపట్టింది. ఇప్పుడు జేపీ అసోసియేట్స్ ఆస్తులను దక్కించుకోవడం ద్వారా, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో లగ్జరీ హౌసింగ్ , ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ల వైపు అదానీ అడుగులు వేసే అవకాశం ఉంది. ముఖ్యంగా గచ్చిబౌలి, తెల్లాపూర్ వంటి హై-గ్రోత్ ఏరియాల్లో అదానీ రియల్టీ తన ఉనికిని చాటుకునేందుకు ఈ డీల్ ఒక బలమైన పునాదిగా మారుతుంది. ఈ ఒప్పందం దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ప్రాజెక్టులకు ప్రాణం పోయడమే కాకుండా, రియల్ ఎస్టేట్ రంగంలో అదానీ గ్రూప్‌ను ఒక తిరుగులేని శక్తిగా నిలబెట్టబోతోందని రియల్ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి.
