ఇక సిమెంట్ ఫ్యాక్టరీలకు అదానీ బోర్డులు..!

కాబోయే ప్రపంచ కుబేరుడు గౌతమ్ అదానీ దృష్టి సిమెంట్ కంపెనీలపై పడింది. ఆయనకు ఉన్న పోర్టులు.. ఎయిర్‌పోర్టులు..మైనింగ్… వ్యాపారాలకు తోడు కొత్తగా సిమెంట్ రంగంలోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఇందు కోసం ప్రత్యేకమైన కంపెనీని ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని స్టాక్ మార్కెట్లకు తెలిపారు. అదానీ వ్యాపార వ్యూహం భిన్నంగా ఉంటుంది. ఆయన ఎప్పుడూ సంపదన సృష్టించరు. సృష్టించిన సంపదను కొనుగోలు చేస్తారు. వాటి షేర్లు ఆమాంతం పెరుగుతాయి. ఆయన కుబేరుడు అయిపోతాడు. వ్యాపార రంగంలో అదానీ పేరు వినిపించడం ప్రారంభించిన తర్వాత అతి కొద్ది కాలంలోనే కుబేరుడు అవడానికి ఆ వ్యాపార రహస్యమే కారణం.

బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన దశ తిరిగిపోయింది. నిధులను ఎన్ని బ్యాంకుల నుంచి లోన్లుగా తీసుకుంటున్నారో.. సొంతంగా సమీకరిస్తున్నారో తెలియదు కానీ ఇటీవలి కాలంలో వేల కోట్లు పెట్టి… పోర్టులు.. ఎయిర్ పోర్టులు కొనుగోలు చేసేస్తున్నారు. అన్నింటికీ అదానీ బ్రాండ్ తగిలించేస్తున్నారు. ఇప్పుడు.. సిమెంట్ రంగంలోకి అడుగు పెడుతున్నారు కాబట్టి… దేశవ్యాప్తంగా పేరెన్నికగన్న సిమెంట్ కంపెనీలకు మూడినట్లుగానే భావిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీలకు అదానీ బోర్డు తగిలించడం ఖాయమని చెబుతున్నారు. ఇప్పటి వరకూ పోర్టులకు… అదానీ పేరు తగిలించారు. త్వరలో ఎయిర్ పోర్టులకూ తగిలిస్తారని చెబుతున్నారు. ఇక నుంచి సిమెంట్ ఫ్యాక్టరీల వంతు.

గౌతం అదానీ సంపద అంతా.. ఆయన టేకోవర్ చేసే కంపెనీల కారణంగా.. పెరిగే షేర్ల విలువ మీదే ఆధారపడి ఉంది. ప్రపంచ కుబేరుడు అయిన బిల్ గేట్స్.. ప్రపంచాన్ని మార్చే కంప్యూటర్లను అందుబాటులోకి తెచ్చాడు… మరో కుమారుడు జెఫ్ బెజోస్…అమెజాన్‌ను అడవిలా ప్రపంచం మొత్తం విస్తరింప చేశారు.. ఇండియాకుబేరుడు… అంబానీ.. ప్రజల రోజువారీ ఖర్చులన్నీ తన కంపెనీల ఉత్పత్తులతోనే కొనాలన్నట్లుగా మార్చారు. కానీ నయా కుబేర్ అదానీ మాత్రం.. ఏం చేసి… కుబేరుడయ్యాడో ఎవరూ చెప్పలేరు. అడిగినంత రేటు ఇచ్చి అమ్మితే సరే.. లేకపోతే… దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించి మరీ… భయపెట్టి కొనుగోలు చేయడం…వంటివి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును స్వాధీనం చేసుకునే వ్యవహారాల్లోనే కనిపించాయి. ఇక ముందు సిమెంట్ కంపెనీలకు ఆ గతి పట్టవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క్రైమ్‌ : బెంగళూరులో స్పాలు,క్లబ్‌ల వ్యాపారం “అదే”నా..!?

వారాంతం వస్తే మెట్రో నగరాల్లో సందడి సగమైతాదని అందరూ చెప్పుకుంటారు.. కానీ సందట్లో సడేమియాలో కూడా రెట్టింపు అవుతాయి. ఈ విషయం పోలీసులు రైడింగ్ చేసినప్పుడల్లా తెలిసిపోతుంది. బెంగళూరు పోలీసులు ఖాళీగా ఉన్నామని...

కేసీఆర్ ఫటాఫట్ : రూ. 50వేల రైతుల రుణాలు ఈ నెలలోనే మాఫీ..!

ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ హామీని అమలు చేయలేదని వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ ఏడాది రూ. యాభై వేల వరకూ ఉన్న రైతుల రుణాలను చెల్లించాలని...

ఒలింపిక్స్ : సింధుకు కాంస్య పతకం..!

టోక్యో ఒలింపిక్స్‌లో  పీవీ సింధు రజతం గెల్చుకున్నారు. రజతం కోసం జరిగిన పోరులో చైనా షట్లర్ హీ బింగ్జియాని రెండు వరుస సెట్లలో మట్టి కరిపించిన సింధు.. రజతం కైవసం చేసుకున్నారు. సెమీస్‌లో...

జాబ్ క్యాలెండ్‌లో మార్పులకు జగన్ రెడీ..!?

జాబ్ క్యాలెండర్ విషయంలో నిరుద్యోగుల ఆందోళనలు అంతకంతకూ పెరిగిపోతూండటంతో ఏపీ సర్కార్ పునరాలోచనలో పడినట్లుగా కనిపిస్తోంది. నాలుగు, ఐదు తేదీలలో అన్ని నిరుద్యోగ, విద్యార్థి సంఘాలు భారీ ఎత్తున నిరసనల ప్రదర్శనలకు పిలుపునిచ్చాయి....

HOT NEWS

[X] Close
[X] Close