జమ్మలమడుగు నియోజకవర్గంలో సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యాలను వేధిస్తున్నారని వస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి స్పందించారు. తన తప్పు ఉందంటే రాజకీయాల నుంచి వైదొలుగుతానని ప్రకటించారు. సిమెంట్ ఫ్యాక్టరీలు పనులను స్థానికులకు ఇవ్వాలని కానీ ఇతర ప్రాంతాల వైసీపీ నేతలకు పనులు ఇస్తున్నారని మండిపడ్డారు.
సిమెంట్ పరిశ్రమలకు ముడిపదార్థాలు సరఫరా కాకుండా తాను అడ్డుకోవడం లేదని ఆయన చెప్పడం లేదు. బయట జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించడం లేదు. కానీ తాను తప్పు చేయలేదని అంటున్నారు. సిమెంట్ పరిశ్రమ యాజమాన్యాలే మీడియాకు లీక్ చేశాయి. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వైసీపీ నేతలే అన్ని పనులు చేసుకుంటే తమ కార్యకర్తలు ఏం కావాలని ఆదినారాయణ రెడ్డి ప్రశ్నగా కనిపిస్తోంది.
రాయలసీమలో పరిశ్రమలు ఉన్న చోట ప్రభుత్వాలు మాటగానే అన్ని రకాల పనులు చేసే వాళ్లు మారిపోతారు. ముఖ్యంగా ట్రాన్స్ పోర్టు, క్యాంటీన్లు, పరిశ్రమలు ఔట్ సోర్సింగ్ కు ఇచ్చే పనులు అన్నీ.. అధికారంలో ఉన్న పార్టీ సానుభూతిపరుల చేతుల్లోకి మారిపోతాయి. వైసీపీ రాగానే అన్నీ అలాగే లాక్కున్నారు. కానీ టీడీపీ వచ్చినా వైసీపీ వాళ్ల దగ్గర నుంచి ఆ పనులు తీసుకోలేకపోతున్నారు.