ఆదినారాయణ వద్దకు వివేకా హత్య కేసు విచారణ..!

జమ్మలమడుగు బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి.. వైఎస్ వివేకా హత్య కేసును విచారిస్తున్న సిట్.. నోటీసులు పంపింది. విచారణకు ఎట్టి పరిస్థితుల్లోనూ హాజరు కావాలని ఆయనకు తాఖీదులు పంపారు. నిజానికి వివేకా హత్య కేసులో.. ఆదినారాయణరెడ్డికి ఇప్పటికే మూడు సార్లు నోటీసులు పంపినట్లుగా తెలుస్తోంది. అయితే వాటిని తీసుకునేందుకు ఆదినారాయణరెడ్డి నిరాకరించారు. దాంతో .. మరోసారి సిట్ నోటీసులు జారీ చేసింది. టీడీపీ హయాంలో మంత్రిగా చేసిన ఆదినారాయణరెడ్డి ఎన్నికల ఫలితాల తర్వాత… బీజేపీలో చేరారు.

ఈ ఏడాది మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి తన నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యారు. ఆ సమయంలో…కడప జిల్లా నుంచి మంత్రిగా ఆదినారాయణరెడ్డి ఉన్నారు. మొదటగా.. గుండెపోటుగా చెప్పుకొచ్చిన.. వైసీపీ నేతలు.. హత్యగా నిర్ధారణ అయిన తర్వాత చంద్రబాబు, లోకేష్, ఆదినారాయణల కుట్రఅంటూ.. ఆరోపణలు గుప్పించారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో… వ్యవహారం.. సద్దుమణిగింది. ఇటీవలి కాలంలో… బాబాయ్ హత్య కేసును.. కూడా పరిష్కరించలేని ముఖ్యమంత్రి అని విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తూండటంతో.. సిట్ విచారణలో వేగం పెంచింది. టీడీపీ నేతల్ని.. ఇతర ఆరోపణలున్నవారికి నోటీసులు జారీ చేసి ప్రశ్నిస్తోంది.

నిజానికి వైఎస్ వివేకా హత్య కేసు… పెద్ద పజిల్ కాదని…క్రైమ్ ను ఫాలో అయ్యే వారందరికీ అర్థమవుతుంది. సాక్ష్యాలు తుడిచేయాలనుకున్న వారితోనే క్లూ విడిపోతుందని.. క్రైమ్ సీరియళ్లు చూసేవారికి కూడా తెలిసిపోతుంది. అయితే.. పోలీసులు అసలు వ్యక్తుల్ని కాకుండా.. విచారణ.. ఎక్కడెక్కడో కొనసాగిస్తున్నారేనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు నిజాల కన్నా.. అవసరం లేని విషయాల్లో విచారణ జరుపుతున్నారనే ఆరోపణలు బలంగానే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీ, బీజేపీ నేతలకు.. సిట్ నోటీసులు జారీ చేస్తూండటం.. వివాదాస్పదంగా మారుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సోనూసూద్‌కి ఐరాస పుర‌స్కారం

నటుడు సోనూసూద్ కు అరుదైన పురస్కారం ప్ర‌క‌టించింది ఐక్య‌రాజ్య స‌మితి. ఐరాస అనుబంధ సంస్థ‌ యునైటెడ్‌ నేషన్స్ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యుఎన్‌డిపి) స్పెషల్‌ హ్యుమానిటేరియన్‌ యాక్షన్ అవార్డుని ఈ యేట...

గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడో చెప్పేసిన కేటీఆర్..!

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నవంబర్‌లో నిర్వహించాలన్న ఆలోచన టీఆర్ఎస్ సర్కార్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.ఈ విషయంలో మంత్రి కేటీఆర్ స్పష్టమైన సంకేతాలను పార్టీ నేతలు ఇచ్చేశారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ఆ పరిధిలోని ఎమ్మెల్యేలతో...

బ్లడ్ క్యాంప్‌ కోసం పిలుపిస్తే నారా రోహితే లీడరనేస్తున్నారు..!

తెలంగాణ తెలుగుదేశం నేతలు ఎవరైనా నాయకుడు కనిపిస్తాడా అని చకోరా పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులు ఎలా ఉన్నాయంటే.. చివరికి పార్టీ ఆఫీసులో తలసేమియా బాధితుల కోసం ఓ...

బీజేపీకీ ఈవీఎం ఎన్నికలే కావాలట..!

భారతీయ జనతాపార్టీ ఈవీఎంలతో మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని కోరుతోంది. కరోనా కాలంలో ఒకే ఈవిఎం బటన్‌ను అందరూ అదే పనిగా నొక్కితే కరోనా వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుందని ఆందోళనలు వినిపిస్తున్న సమయంలో......

HOT NEWS

[X] Close
[X] Close