అయితే “ఆదిపురుష్” బీజేపీ ప్రచార చిత్రం కాదన్న మాట !

ఆదిపురుష్ అనే సినిమాలో నటించడానికి ప్రభాస్ అంగీకరించినప్పటి నుండి చాలా మందికి ఆ సినిమాపై డౌట్స్ ఉన్నాయి. ఇటీవల కేటీఆర్ అది బీజేపీ ప్రచార చిత్రమని.. వచ్చే ఎన్నికలకు ముందు అయోధ్య రామాలయం ప్రారంభించి ఆ ఊపులో ఈ సినిమాను కూడా విడుదల చేస్తారని … రాముడ్నిఅలా రాజకీయాలకు వాడుకుంటారని చెప్పారు. ఇది నిజమేనని ఎక్కువ మంది అనుకున్నారు. తీరా ఇప్పుడు ఆదిపురుష్ ట్రైలర్ చూసిన తరవాత బీజేపీ నేతలే ఉలిక్కి పడుతున్నారు. ఇది రాముడి సినిమానా అని బిత్తరపోతున్నారు.

మధ్యప్రదేశ్ హోం మంత్రి ఏకంగా ఆదిపురుష్ డైరక్టర్‌కే వార్నింగ్ ఇచ్చారు. చాలా మంది బయటకు చెప్పకపోయినప్పటికీ ఎక్కువ మంది అభిప్రాయం అదే. రాముడి కథ అని చెప్పడమే కానీ అందులో రాముడి కథకు సంబంధించిన పాత్రలేవీ కనిపించడం లేదన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది. పైగా అది పూర్తిగా ప్రభాస పేరును ఉపయోగించుకుంటూ.. తీస్తునన యానిమేషన్ సినిమా.ఈ సినిమా ట్రైలర్ చూశాక వస్తున్న ట్రోల్స్‌కు లెక్క లేకుండా పోయింది. రాజకీయంగా ఇది బీజేపీకి సంబంధం లేదని తేలిపోతోంది.

నిజానికి సినిమాలతో సంబంధం లేనట్లుగా సీరయస్ గా స్టార్లతో… తమ భావజాలం ఉన్న సినిమాలు తీయించుకోవడంలో బీజేపీ పెద్దలు సిద్ధహస్తులు.ఈ విషయం చాలా సినిమాల వియంలో రుజువు అయింది. చాలా మంది దర్శకులు వారు అనుకున్న ఔట్ పుట్ ఇచ్చారు కూడా. అజయ్ దేవగణ్‌తో తీసిన ఓ సినిమా చూసిన తర్వాత ఓం రౌత్‌కు కూడా అలాంటి టాస్క్ ఇచ్చారేమో కానీ ఆయన మాత్రం పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. ఇప్పుడీ సినిమాకు తమకూ సంబంధం లేదని బీజేపీనే చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎగ్జిట్ పోల్స్ : గుజరాత్‌లో మళ్లీ బీజేపీ – హిమాచల్‌లో టఫ్ ఫైట్ !

రెండు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకే మొగ్గు కనిపిస్తోందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. హిమాచల్ ప్రదేశ్‌లో పోలింగ్ నెలకిందటే ముగిసింది. అయితే ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉంది. గుజరాత్...

రోజాకు ఇంత అవమానమా !

మంత్రి రోజా అంటే ఫైర్ బ్రాండ్. నోరు తెరిస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే. ఆ నోరుకు భయపడే మంత్రి పదవి ఇచ్చారనే టాక్ కూడా ఉంది అది వేరే విషయం. కానీ మంత్రి...

3 రాజధానులు కాదు 3 రాష్ట్రాలు చేయాలన్న పయ్యావుల !

రాయలసీమ గర్జన పేరుతో వైసీపీ నిర్వహించిన సభ ద్వారా ప్రజల మూడ్ ఏమిటో వైసీపీ పెద్దలకు అర్థమయ్యే ఉంటుందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సెటైర్ వేశారు. సీమ గర్జన పేరుతో...

విజయ్ ఫ్యామిలీతో జాన్వీ కపూర్ బాండింగ్

విజయ్‌ దేవరకొండ కి బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ వుంది. లైగర్ సినిమాకి ముందే విజయ్ అక్కడ క్రేజ్ తెచ్చుకున్నాడు. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా విజయ్ అంటే ఇష్టపడతారు. జాన్వీ కపూర్ కి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close