అడివిశేష్ హిట్ ట్రాక్ లోనే వున్నాడు. వరుసగా థ్రిల్లర్ కథలని చేస్తూ డీసెంట్ విజయాలు అందుకుంటున్నాడు. ఇప్పుడు తన నుంచి రాబోతున్న సినిమా ‘డకాయిట్’. షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఫైర్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు.
ఇదొక ప్రేమ కథని ముందు నుంచి చెబుతున్నారు. మృణాల్ జూలియట్ పాత్రలో కనిపించారు. ‘జూలియట్ నిన్ను అందరూ మోసం చేశారు. నేను అందుకు రాలేదు..’ అంటూ శేష్ చిత్తూరు యాసలో చెప్పిన డైలాగ్ ఆసక్తికరంగా వుంది. డైలాగ్ చివర్లో ఓ నాటు మాట కూడా వుంది. గ్లింప్స్ చూస్తుంటే కథ బ్యాక్ డ్రాప్, హీరో క్యారెక్టరైజేషన్ యూనిక్ గానే డిజైన్ చేసినట్లు కనిపిస్తోంది. టైటిల్ కి తగ్గట్టుగానే టీజర్ లో కార్లు, ట్రైన్ తో కూడిన ఒక ఫైర్ యాక్సిడెంట్ వుంది.
డిసెంబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. శేష్ ఇప్పటివరకూ హాలీడేస్ లో ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు క్రిస్మస్ సెలవులకి రావడం కలిసొచ్చే అంశం. సుప్రియా యార్లగడ్డ, సునీల్ నారంగ్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగులో పాటు హిందీలో ఏకకాలంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.