జగన్‌పై మరోసారి కోపం తెచ్చుకున్న అద్నాన్ షమీ !

నాటునాటు పాటకు ఆస్కార్ నామినేషన్ వచ్చినప్పుడు ఏపీ సీఎం జగన్ చేసిన ట్వీట్ .. ప్రాంతీయ తత్వంతో ఉందని… జాతీయాభిమానం జగన్ కు లేదని మండిపడిన ప్రముఖ బాలీవుడ్ సింగర్.. అవార్డు వచ్చిన సందర్భంగా సీఎం జగన్ చేసిన అభినందన ట్వీట్ పై మరోసారి విరుచుకుపడ్డారు. ప్రాంతీయ తత్వంతో నూతిలో కప్పలా ఉండి.. సముద్రం గురించి ఊహించలేకపోతున్నారని విమర్శించారు. ప్రాంతీయ విబేధాలు రెచ్చగొడుతున్నందుకు సిగ్గుపడాలన్నారు. అద్నాష్ షమీ వ్యాఖ్యలు ఘాటుగా ఉండటంతో ఇతర పార్టీల నేతలు ఎక్కువగా షమీ ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తున్నారు.

తెలుగు జెండా రెపరెపలాడుతోంది. మన జానపద వారసత్వాన్ని ఎంతో అందంగా జరుపుకునే తెలుగు పాట పట్ల నేను గర్వపడుతున్నాను. ఈ రోజు అంతర్జాతీయంగా దానికి తగిన గుర్తింపు లభించింది. రాజమౌళి, ఎంఎం కీరవాణి, ఎన్టీఆర్, రామ్‌చరణ్.. మన తెలుగు ఖ్యాతిని ఖండాంతరాలకు విస్తరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది తెలుగు ప్రజలను.. భారతీయులందరినీ గర్వపడేలా చేసినందుకు ధన్యవాదాలు’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేసారు. భారతీయులు గర్వపడేలా చేశారని అన్నా… తెలుగు జెండా అనే సరికి షమీకి కోపం వచ్చింది.

అయితే గతంలో షమీ జగన్ పై చేసిన ట్వీట్లకు చాలా మంది వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. అయితే ఇప్పుడు మళ్లీ అద్నాన్ షమీ జగన్ పై విరుచుకుపడ్డారు. ఆయనకు ఏపీ సీఎంపై ఎందుకో కోపం ఉందని వైసీపీ నేతలు అనుకుంటున్నారు. సంగీత పరమైన విషయం కాబట్టే షమీ స్పందించారని..సంగీతానికి తెలుగు…లాంటి బ్యారియర్స్ ఉండవని..అది జాతీయం అని షమీ భావన అని కొంత మంది అంటున్నారు. కారణం ఏదైనా షమీ ఇలా సీఎం జగన్ ట్వీట్లను టార్గెట్ చేయడం.. వైసీపీ నేతలకు ఇబ్బందికరంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

ప్రభాకర్ రావు వచ్చాకే అసలు ట్యాపింగ్ సినిమా !

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో నిందితులైన హైదరాబాద్‌ మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావును గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన గట్టు మల్లును ఇన్స్‌పెక్టర్ ను పెట్టుకుని ఓ మాఫియా నడిపారని...

డేరింగ్ అండ్ డాషింగ్ కేజ్రీవాల్

అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి వచ్చి అవినీతి కేసులో అరెస్టు అయ్యాడన్న ప్రచారం చేస్తున్నారు. సామాన్యుడు కాదు లంచగొండి అని గట్టిగా ప్రజల మైండ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తన సీఎం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close