సీఎంగా చంద్రబాబు “ఓటీఎస్” వద్దన్నారని ఫుల్ పేజీ యాడ్స్‌ ! ఎవరికి పబ్లిసిటీ ?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చింది. ఈ సారి రాజకీయ దుమారం రేపుతున్న వన్ టైం సెటిల్మెంట్ స్కీం గురించి అవగాహన కోసం ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చారు. తహసీల్దార్ల దగ్గర్నుంచి వాలంటీర్ల వరకూ లబ్దిదారులకు వరుసగా రోజుకు మూడు సార్లు అవగాహన కల్పిస్తున్నా.. ఇంకా అవగాహన రావడం లేదనుకున్నారేమో కానీ ఈ సారి రూ. కోట్లు ఖర్చు పెట్టి ప్రకటనలు ఇచ్చారు. ఈ సారి ప్రకటనల్లో గత ప్రభుత్వంలోని రెండు పత్రాలను కూడా ప్రచురించారు. అందులో ఏముందోఎవరికీ కనిపించదు కానీ దాని సారాంశం మాత్రం గతంలో ఓటీఎస్ పెడదామని అధికారులు చంద్రబాబును అడిగితే ఆయన వద్దన్నారు. ఒక సారి కాదు నాలుగు సార్లు అలాగే అడిగితే వద్దన్నారు.

ఓటీఎస్ స్కీమ్ చంద్రబాబు వద్దన్నారని ప్రచారం చేస్తే అది వైసీపీకి ప్లస్సా ? మైనస్సా ?. ఎప్పుడో ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లకు ఇప్పుడు డబ్బులు వసూలు చేయడం అనే కాన్సెప్టే వింతగా ఉంది. అందునా … తీసుకున్న రుణానికి మించి వసూలు చేయాలనుకోవడం మరీ వింత. రెందు దశాబ్దాల కింద ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ పోను.. ఇచ్చిన రుణం రూ . ఇరవై వేలు కూడా ఉండదు. ఇప్పుడు అంత మొత్తం వసూలు చేస్తున్నారు. ఇలా పేదల నుంచి వసూలు చేయడం మంచి పద్దతి కాదన్న ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం వద్దనుకుందేమో కానీ ఆ విషయాన్ని ఇప్పుడు జగన్ సర్కార్ పేపర్ ప్రకటనలు ఇచ్చి మరీ హైలెట్ చేస్తోంది.

పేద ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడం అనే కాన్సెప్ట్‌ను ఏ రాజకీయ నాయకుడూ అంగీకరించరు. పైగా వారు ఉంటున్న ఇంటికి వారికి హక్కులిస్తామని చెప్పడం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ విషయాలను పట్టించుకోకుండా దాదాపుగా రూ. నాలుగు వేల కోట్లను ప్రజల వద్ద నుంచి వసూలు చేయాలని నిర్ణయించుకున్న జగ‌న్ సర్కార్.. గత ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పెట్టినా అమలు చేయలేదని వాదిస్తోంది. ఇంత వ్యతిరేకత వస్తున్న ఈ పథకాన్ని గత ప్రభుత్వం అమలు చేయలేదంటే అప్పటి సీఎంకు ప్లస్ అవుతుంది కానీ మైనస్ అవుతుందా..?

పేదలపై భారం పడకూడదనే తాము ఓటీఎస్ అమలు చేయలేదని… టీడీపీ ఇప్పుడు వాదిస్తుంది. అందుకే వచ్చాక ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తామని ఇప్పటికే ప్రకటిస్తోంది. పేద ప్రజలకు మేలు చేయాలంటే ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయవచ్చు కదా.. ఇలా వసూలు చేయడం ఎందుకని టీడీపీ ప్రశ్నిస్తోంది. దీనికి వైసీపీ వద్ద ఆన్సర్ ఉండదు. ఎలా చూసినా.. ఓటీఎస్ విషయంలో ఏపీ ప్రభుత్వం కిందా మీదా పడుతోంది. చివరికి మెడకు చుట్టుకునేలా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ కానిస్టేబుల్ హత్య ఏపీ పోలీసు వ్యవస్థ బలహీనతకు సాక్ష్యం !

నంద్యాలలో ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ను రౌడిషీటర్లు దారుణంగా హత్య చేసిన ఘటన ఇప్పుడు పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమమవుతోంది. విధి నిర్వహణలో కటువుగా ఉండే హెడ్ కానిస్టేబుల్ రోడ్‌పై ఒంటరిగా కనిపిస్తే ఆరుగురు...

ఫ‌స్టాఫ్ లాక్ చేసిన అనిల్ రావిపూడి

ఎఫ్ 3తో.. త‌న విజ‌య యాత్ర‌ని దిగ్విజ‌యంగా కొన‌సాగించాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు త‌న దృష్టంతా బాల‌కృష్ణ సినిమాపైనే ఉంది. అనిల్ రావిపూడితో బాల‌య్య సినిమా ఓకే అయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం...

కేసీఆర్ కన్నా మేఘానే టార్గెట్ చేస్తున్న షర్మిల!

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర వాయిదా వేసుకుని మరీ గవర్నర్ తమిళిసైను కలిశారు. ఓ పెద్ద ఫైల్ తీసుకెళ్లారు. అందతా కాళేశ్వరంలో జరిగిన అవినీతి అని.. గవర్నర్‌కు ఆధారాలిచ్చామని చెప్పారు....

మీడియా వాచ్ : కులాల మధ్య చిచ్చుపెట్టి చానళ్లు ఎంత సంపాదించుకుంటాయి ?

రాజకీయ మీడియా వలువలు వదిలేసింది. విలువ కట్టుకుని.. వసూలు చేసుకుని నగ్నంగా ఊరేగుతోంది. కులాల పేర్లు పెట్టి ఆ రెండు కులాలు కొట్లాడుకుంటున్నాయని ప్రచారం చేస్తోంది. చర్చలు నిర్వహిస్తోంది. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close