`నీలి చంద్రుడు’ వస్తున్నాడు

శుక్రవారం, అనగా 2015 జులై 31న `నీలి చంద్రుడు’ వచ్చేస్తున్నాడు. ఇదేమీ శుక్రవారం రిలీజ్ అయ్యే సినిమా అనౌన్స్ మెంట్ కాదండీ. నిజంగానే రేపు శుక్రవారం సాయంత్రంవేళ చీకటి పడ్డాక తూర్పుఆకాశంవైపు ఓసారి చూడండి. పున్నమి చంద్రుడు ఉదయిస్తుంటాడు. అతగాడే `బ్లూమూన్’. ఉదయిస్తున్న చంద్రుడిని చూశాక మీరు అసంతృప్తి చెందవచ్చు. `అదేమిటీ, చంద్రుడు బ్లూ కలర్ లో ఉంటాడనుకుంటే, మామూలుగానే ఉన్నాడేమిటా’అని. వాస్తవమేమంటే, జులై31న ఉదయించే చంద్రుడు బ్లూమూన్ గానే వ్యవహరిస్తారు. కానీ, నిజంగా బ్లూకలర్ లో ఉండడు. మరి ఆ పదం ఎందుకు వాడుకలో వచ్చిందో అసలు కారణాలేమిటో తెలుసుకుందాం…

1.
`వన్స్ ఇన్ ఏ బ్లూమూన్’ అన్న ఫేజ్ చాలాకాలం నుంచీ వాడుకలో ఉంది. చాలా అరుదుగా సంఘటన రిపీట్ అయినప్పుడు ఈ ఫేజ్ వాడుతుంటారు.

2.
క్యాలెండర్ లో పౌర్ణమిలు గమనిస్తుంటే మామూలుగా ప్రతినెలా ఒక పౌర్ణమి, ఒక అమావాస్య వస్తుంటాయి. కానీ ఇందుకు విరుద్ధంగా ఒకే నెలలో రెండుసార్లు పౌర్ణమి (ఫుల్ మూన్స్) లు ఒక్కోసారి వస్తుంటాయి. ఇలా క్యాలెండర్ మన్త్ ప్రకారంగా ఒకే నెలలో రెండోసారి వచ్చే పున్నమిని బ్లూమూన్ అనిపిలుస్తుంటారు. 2015 జూలైలో 2వ తేదీన, తిరిగి 31న పౌర్ణమిలు వచ్చాయి. ఈ కారణంగా శుక్రవారంనాటి పౌర్ణమిని బ్లూమూన్ గా వ్యవహరిస్తున్నారు.

3.
మళ్ళీ మనం బ్లూమూన్ చూడాలంటే మూడేళ్లు ఆగాలి. అంటే, 2018లోగానీ సాధ్యంకాదు. ఆ ఏడాది క్యాలెండర్ ప్రకారం, రెండుసార్లు (డబుల్) బ్లూమూన్ లు చూడొచ్చు. ఇది మరో అరుదైన ఘటన. జనవరిలోనూ, మార్చిలోనూ రెండేసిసార్లు పౌర్ణమిలు రావడమే ఈ సదవకాశానికి కారణం. 1999లో కూడా రెండుసార్లు బ్లూమూన్ లు చూడగలిగాము. ఆ ఏడాది జనవరిలో రెండుసార్లు పౌర్ణమిలు వచ్చాయి. ఒకటి – జనవరి 1, జనవరి 31న పార్ణమిలు రాగా, మరోసారి అంటే ఏప్రిల్ 1, ఏప్రిల్ 30న పౌర్ణమిలు వచ్చాయి.

4.
పున్నమి చంద్రుడు నీలంగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, దీనికీ మనం ఇప్పుడు పిలుస్తున్న బ్లూమూన్ సంఘటనలకు సంబంధంలేదు. వాతావరణంలో డస్ట్ పార్టికల్స్ బాగా పేరుకుపోయిన సందర్భంలో చంద్రుడు నీలివర్ణంలో మారడం జరుగుతుంటుందని శాస్త్రవేత్తలు చెబుతుంటారు.

5.

1883లో నిజంగానే బ్లూమూన్ కనిపించింది. ఇండోనేషియాలోని క్రాకటో అనే అగ్నిపర్వతం ప్రేలడంతో వాతావరణంలో దట్టమైన పొగ ఆవరించింది. ఈ పొగలోని డస్ట్ పార్టికిల్స్ కారణంగా చంద్రుడు నీలిరంగులో కనిపించాడు. అప్పటినుంచే `వన్స్ ఇన్ ఏ బ్లూమూన్’ అన్న ఫేజ్ వాడుకలోకి వచ్చిఉంటుంది. చాలా అరుదుగా కనిపించే, లేదా జరిగే సంఘటనలకు ఈ ఫేజ్ వాడటం మొదలైంది. ఈ మధ్యకాలంలో నిజంగానే చంద్రుడు నీలివర్ణంలో మారిపోవడమన్నది 1950లో జరిగింది. ఎడిన్ బర్గ్ , స్కాట్ లాండ్ లో సెప్టెంబర్ మాసంలో ఈ వింత చోటుచేసుకుంది. కెనడాలోని ఒక అడవిలో కారుచిచ్చు చెలరేగడంతో దట్టమైన పొగలు వాతావరణంలో కలిసిపోయాయి. ఈ ధూళికణాల కారణంగా చంద్రుడు అప్పట్లో నీలివర్ణంలో మారిపోయాడు.

6.
రేపు (శుక్రవారం జులై 31) నాటి పున్నమికి ఒక ప్రత్యేకత బ్లూమూన్ అయితే, మరో ప్రత్యేకత గురుపౌర్ణమి. ఆషాఢశుద్ధ పౌర్ణమిని గురుపూర్ణమిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. గురువులను సేవించే పండుగ ఇది. వ్యాసమహాముని పుట్టినరోజు కనుక వ్యాసపూర్ణమి అని కూడా పిలుస్తారు. షిర్డీ సాయిబాబాని గురువుగా భావించేవారు గురుపౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు చేస్తుంటారు.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close