డ్రగ్స్ కేసులో మళ్లీ టాలీవుడ్‌కు ఈడీ సెగ !

ముగిసిపోయిందనుకున్న డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ ఎక్సైజ్ శాఖ తమ వద్ద ఉన్న ఆధారాలన్నింటినీ ఎట్టకేలకు ఈడీకి ఇచ్చింది. హైకోర్టు పదే పదే ఆగ్రహం వ్యక్తం చేయడం.. చివరికి సీఎస్‌తో పాటు ఎక్సైజ్ శాఖ కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ కేసులకు నిర్ణయించడంతో అధికారులు దిగి వచ్చారు. ఈడీకి అధారాలు ఇచ్చారు. ఇక్కడా ఏమైనా జిమ్మిక్కులు చేశారా.. మొత్తం ఆధారాలు ఇచ్చారా అన్నది ఈడీ అధికారులే చెప్పాల్సి ఉంది. ఈడీ అధికారులకు ఇచ్చిన సమాచారంలో..కోర్టుకు సమర్పించని కీలకమైన వాంగ్మూలాలు ఇతర డిజిటల్ ఆధారాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

వీటిని పరిశీలించి టాలీవుడ్ డ్రగ్స్ నిందితులకు ఈడీ ప్రత్యేకంగా నోటీసులు జారీ అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈడీ అధికారులు ఓ సారి ప్రశ్నించారు. కానీ అప్పుడు వారికిఎలాంటి ఆధారాలు దొరకలేదు. అప్పట్లో తెలంగాణ ఎక్సైజ్ అధికారులు కూడా ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. దీంతో ఎవరూ బయటపడలేదు. దాదాపుగా క్లీన్ చిట్ ఇచ్చారు. నిజానికి ఈడీ దర్యాప్తు చేసేది డ్రగ్స్ వాడారా లేదాఅనేది కాదు… డ్రగ్స్ కోసం చెల్లింపులు ఎలా చేశారన్నదానపైనే. అక్రమ నగదు లావాదేవీల కోణంలోనే ఈ దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇలా డబ్బులు చెల్లించిన విషయం బయటకు వస్తే.. నిజంగానే వారు డ్రగ్స్ కొన్నట్లుగా తేలిపోతుంది. అదే జరిగితో మరో రకంగా ఇరుక్కుంటారు.

అంటే.. అన్ని విధాలుగా కేసుల్లోకి వెళ్లిపోతారు. ఇప్పుడు డ్రగ్స్ కొనలేదని .. డబ్బులు చెల్లించలేదని ఎలాగోలా నిరూపించేసుకుంటే సమస్య ఉండదు. ఈడీ విచారణలో ఎవరైనా పొరపాటున డ్రగ్స్ కోసం డబ్బులు చెల్లించినట్లుగా బయటపడితే… ఇక చిక్కులు తప్పనట్లే. ఆ ఒక్కలింక్ నుంచి మొత్తం ఈడీ బయటకు లాగే అవకాశం ఉంది. ఎలా చూసినా టాలీవుడ్‌ను మళ్లీ డ్రగ్స్ కేసు వెంటపడటం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బోల్డ్ గా భయపెట్టిన లైగర్

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లైగర్ షూటింగ్ దాదాపు పూర్తయింది. తాజగా లైగర్ నుండి ఒక స్టన్నింగ్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఈ...

ఎన్టీఆర్ కథ గోపిచంద్ కు

దర్శకుడు హరి మాస్ సినిమాల స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. 'సింగం' ఆయన సక్సెస్ఫుల్ సిరిస్. ఈ సిరిస్ కి తెలుగులో కూడా ఆకట్టుకుంది. హరికి ఎప్పటి నుండో నేరుగా ఒక తెలుగు...

సీఎం జగన్ పేరుతో సైబర్ నేరాలు !

అప్పుడెప్పుడో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. కోట్లు కొట్టేయడానికి దర్జాగా కోల్‌కతా సూట్ కేస్ కంపెనీల పేరుతో చెక్‌లు జమ చేశారు. ఆ కేసు ఇంత వరకూ తేలలేదు. కానీ ఇప్పుడు...

ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ – పబ్లిసిటీ బడ్జెట్ కోట్లకు కోట్లే !

సోషల్ మీడియా సంస్థలకు.. మీడియా సంస్థలకు పండగ లాంటి సమయం ఇది. వద్దంటే రాజకీయ పార్టీలు కుప్పలు కుప్పలుగా ప్రకటనలు ఇస్తున్నాయి. రూ. కోట్లకు కోట్లు ఆదాయం తెచ్చి పెడుతున్నాయి. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close