సమీక్ష ….ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ

తెలుగు360 రేటింగ్‌: 3/5

తెలుగులో ఫన్ థ్రిల్లర్లు చాలా అరుదుగా పలకరిస్తుంటాయి. థ్రిల్లర్లు తీయడం సులువు. దానికి ఫన్ యాడ్ చేయడం కష్టం. ఎందుకంటే థ్రిల్లింగ్ ఫీలింగ్స్ పోకూడదు. అదే స్క్రిప్ట్ కు లైటర్ ఫన్ మూవ్ మెంట్స్ జోడించాలి. ఈ ఫీట్ చేయడం అంటే కాస్త కష్టం. అందుకే రెగ్యులర్ థ్రిల్లర్లు, రేసీ ధ్రిల్లర్లు అటెంప్ట్ చేసినంతగా ఈ ఫన్ థ్రిల్లర్లు అటెంప్ట్ చేయరు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఫన్ మూవ్ మెంట్స్ మిక్స్ చేసిన ఇన్వెస్టిగెటివ్ థ్రిల్లర్. ఓ విధంగా కొంచెం కొత్త జోనర్. ఎందుకంటే చంటబ్బాయ్ ఎంటర్ టైన్ మెంట్ ఎక్కువ, థ్రిల్లింగ్ పాలు తక్కువ. స్వామిరారా లో ఎంటర్ టైన్ మెంట్, థ్రిల్లింగ్ మూవ్ మెంట్స్ సమానంగా వుంటాయి. కానీ ఇన్వెస్టిగేషన్ వుండదు. సస్సెన్స్ వుండదు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయలో ఇటు ఫన్ అటు ఇన్వెస్టిగేషన్, కాస్త థ్రిల్లింగ్ మూవ్ మెంట్స్ జోడించి ఒక కొత్త జోనర్ ట్రయ్ చేసారు.

ఇప్పటికీ టీజర్, ట్రయిలర్ చూసి సినిమాలో హీరో క్యారెక్టర్ మీద ఓ అంచనా వచ్చేసింది ప్రేక్షకులకు. సాయి శ్రీనివాస్ ఆత్రేయ (నవీన్ పోలిశెట్టి) ఔత్సాహిక డిటెక్టివ్. ఫాతిమా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అలియాస్ ఎఫిబిఐ నెల్లూరు అనే సంస్థ అతగాడిదే. షెర్లాక్ హోమ్స్ సినిమాలు లెసెన్స్ గా ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాడు. అతగాడికి ఓ అసిస్టెంట్ స్నేహ (శృతి శర్మ) కూడాను. చిన్న చిన్న పెట్టీ కేస్ లు పరిశోధించే అతగాడికి ఓ పేద్ద కేసు తగులుతుంది. దాని చిక్కుముడులు విప్పుదాంటే, ఆ చిక్కు ముడులు అన్నీ అతనికే చిక్కుకునేలా తయారవుతాయి. అప్పుడు ఆత్రేయ ఏం చేసాడు? అసలు ఏమిటి వ్యవహారం అన్నది మిగిలిన సినిమా.

డిటెక్టివ్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాకు కీలకమైన పాజిటివ్ విషయం కొత్తగా ఆలోచించి, ప్లాన్ చేసిన క్రయిమ్ స్క్రిప్ట్. క్రయిమ్, క్రిమినల్స్, వారి ప్లాట్ అన్నీ చాలా ఇంటిలిజెంట్ గా, కొత్తగా వుంటాయి. అదే ఈ సినిమాకు మెయిన్ బ్యూటీ. ఈ బ్యూటీ చుట్టూ అల్లిని మిగిలిన సంగతులన్నీ అదనపు హంగులు. చంటబ్బాయ్ లాంటి క్యారెక్టరైజేషన్ ను ఇంట్రడ్యూస్ చేయడం ఆ అదనపు హంగుల్లో ఒకటి. వాస్తవానికి ట్రయిలర్, టీజర్ లాంటివి చూసి, సినిమా జోనర్ ను వేరే విధంగా ఊహిస్తారు. ఇదేదో చంటబ్బాయ్ 2.0 అనుకుంటారు. కానీ అది కాదు వ్యవహారం. సినిమాలో సీరియస్ క్రయిమ్ వుంది. దాని మీద సీరియస్ ఇన్వెస్టిగేషన్ వుంది. దానికి చిన్న సెంటిమెంట్ అద్దకం వుంది. ఆపై మూఢ నమ్మకాల చాదస్తంపై చెర్నాకోలా చళుకు కూడా వుంది.

డిటెక్టివ్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా టేకాఫ్ జనం ఊహలకు అందే రేంజ్ లోనే వుంటుంది. చంటబ్బాయ్ క్యారెక్టర్ ఈ జనరేషన్ కు తగినట్లు మారితే ఎలా వుంటుందో అలా వుంటాడు ఆత్రేయ. ఆరంభంలో వచ్చే సీన్లు కావచ్చు, తరువాత లీడ్ సీన్లు కావచ్చు. కాస్త ఇంటలెక్చ్యుల కామెడీ అన్నట్లు సాగుతాయి. షార్ప్ గా వినాలి. తదేకంగా చూడాలి. లేదూ అంటే ఫన్ అంత సులువుగా పుట్టదు. అలా చూసి, విన్న వాళ్లు ఆ ఫన్ ను ఎంజాయ్ చేయగలుగుతారు.

అయితే అలా అని ఫ్రథమార్థంలో సీన్లు అన్నీ అద్భుతంగా వున్నాయని కితాబు ఇవ్వలేం. ప్రారంభంలో చూపించిన ఫన్ జనరేట్ చేసే ఉత్సాహాన్ని స్క్రిప్ట్ రైటర్లు ఇద్దరూ అంతలా కంటిన్యూ చేయలేకపోయారు. అదే విధంగా స్టాండింగ్ కమెడియన్ మాదిరిగా ఎక్కువగా డైలాగులు హీరో చేత చెప్పించడం అన్నది కొత్తగా ట్రయ్ చేయడం వరకు ఓకె. దానికి తగినట్లు సీన్లు కూడా కాస్త ఉత్సాహంగా వుంటే ప్రథమార్థానికి మంచి మార్కులు పడేవి.

అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర నుంచి ఇక సినిమా స్పీడు అందుకుంటుంది. అక్కడి నుంచి సినిమా చకచకా సాగడమే కాకుండా, ఊహించని మలుపులు కూడా తిరుగుతుంది. అలాంటి మలుపులు కొత్తగా, ఆసక్తికరంగా వుంటాయి. క్రిమినాలజీ తెలిసిన క్రిమినల్ వాడే తెలివితేటలు ఇంటిలిజెంట్ గా వుంటాయి. హీరో దాన్ని డీకోడ్ చేసిన విధానం కూడా బాగా నేరేట్ చేసారు.

సినిమాకు ద్వితీయార్థం అంతా ప్లస్ నే. ఎందుకంటే ద్వితీయార్థం అంతా కేస్ స్టడీ జరుగుతూనే వుంటుంది. ఒకదాంట్లోంచి మరో దాంట్లోకి లీడ్ దొరుకుతూనే వుంటుంది. ఆఖరికి సినిమా లాస్ట్ లీడ్ వరకు ఆలా ఇంట్రెస్టింగ్ గా వెళ్తూనే వుంటుంది. సినిమాకు అనవసరపు లీక్ లు ఇవ్వకుండా వుండడానికి దర్శకుడు చాలా పాత్రలను చాలా లిమిటెడ్ గా వాడుకున్నాడు. ఆఖరికి మెయిన్ విలన్ పాత్రతో సహా. అంతే కాదు ప్రేక్షకులను తన లీడ్ లతో మిస్ లీడ్ చేసేలా కూడా ప్రయత్నించాడు. దీనివల్ల సరైన ఆన్సర్ వచ్చినపుడు కాస్త థ్రిల్లింగ్, ట్విస్టింగ్ ఫీలయ్యే అవకాశం వుంటుంది. కానీ తొలిసగంలో వున్నంత ఫన్ మూవ్ మెంట్స్ మలిసగంలో వుండవు. పైగా ప్రథమార్థం కాస్త బోరింగ్ గా వున్న ఫాస్ట్ గా మూవ్ అయిపొతుంది. ద్వితీయార్థం ఫాస్ట్ గా మూవ్ అయినా కాస్త లెంగ్తీ అనిపిస్తుంది. అయితే ఇన్వెస్టిగేషన్ ఆసక్తికరంగా సాగడంతో పెద్దగా ఇబ్బంది అనిపించదు.

క్లయిమాక్స్ ఇంకాస్త బెటర్ గా వుంటే బాగుండేది. చటుక్కున, చకచకా ఎండ్ చేసిన ఫీల్ వస్తుంది. కాస్త ఎక్సర్ సైజ్ వుంటే అది వేరుగా వుండేది. టోటల్ గా చూసుంటే సినిమా కొత్త క్రయిమ్, కొత్త జొనర్, కొత్ నటులు, కాస్త కొత్త టేకింగ్ కలిపి డిఫరెంట్ మూవీ చూసిన పీల్ అయితే ఇస్తుంది.

నవీన్ పోలిశెట్టి సినిమాకు అస్సెట్ అనే చెప్పాలి. ఆ క్యారెక్టర్ ను బాగానే డీల్ చేసాడు. నటనలో అతనికి వున్న చలాకీతనం ప్లస్. శృతి శర్మ పాత్ర ఇంకాస్త బాగా డిజైన్ చేసుకుంటే ఆమెకు కూడా మంచి ప్రశంసలు దక్కేవి. కానీ అవసరం మేరకే ఆమె పాత్రను వాడారు. కొత్త నటుడు సుహాస్ ఒక్కో సినిమాతో తనకు ఓ ఐడెంటిటి తెచ్చుకుంటున్నాడు. ఈ సినిమా కూడా అతనికి ప్లస్ నే.

టెక్నికల్ గా బ్యాక్ గ్రవుండ్ స్కోర్ బాగుంది కానీ, సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకె అనిపించుకుంటుంది. సినిమాను కాస్త బడ్జెట్ లో తీయాలని అనుకోవడం కూడా అందుకు ఓ కారణం కావచ్చు. దర్శకుడు స్వరూప్ ఆర్ ఎస్ జె కు తొలి సినిమాగా మంచి పేరే వస్తుంది. ఎందుకంటే ఎక్కడా తడబాటు లేదు. పక్కదారి లేదు. టోటల్ గా థ్రిల్లర్లు ఇష్టపడేవారికి పక్కాగా నచ్చే సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ.

ఫినిషింగ్ టచ్…ఇంటిలిజెంట్..ఏజెంట్

తెలుగు360 రేటింగ్‌: 3/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close