విమానాల వాయిదా : తొందరపడినా ప్రభుత్వం సిద్ధం కాలేకపోయిందా..?

దేశమంతా విమనాశ్రయాలు ఓపెన్ అయ్యాయి.. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం.. ఒక్క రోజు వాయిదా పడ్డాయి. కారణాలేమైనా కావొచ్చు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… లాక్ డౌన్ ఎత్తేసి.. సాధారణ కార్యకలాపాలు ప్రారంభించాలని.. లాక్‌డౌన్ 1.0 అయిపోయినప్పుడే ఆత్రపడింది. జగన్మోహన్ రెడ్డి ఆ మేరకు.. నేరుగా ప్రధానమంత్రికే ప్రపోజల్ పెట్టారు. అలాంటిది.. లాక్‌డౌన్ 4.0 అయిపోవస్తున్న సమయంలో.. విమాన ప్రయాణాలు ప్రారంభిస్తున్నామని కేంద్రం ప్రకటిస్తే… తమకు మరో రోజు సమయం కావాలని ఏపీ సర్కార్ అడిగాల్సి వచ్చింది. అంటే… కార్యకలాపాలను యథావిధిగా నిర్వహించుకోవాలన్న ఆలోచనే తప్ప.. ఆచరణ ప్రారంభించలేదన్న విషయం స్పష్టమవుతోందని అంటున్నారు.

ఇరవై ఐదో తేదీ నుంచి దేశీయ విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయని వారం రోజుల కిందటే.. విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటించారు. ఏ ఏ సర్వీసులు నడపడానికి అనుమతి ఇచ్చారో కూడా.. ప్రకటించారు. కొన్ని రాష్ట్రాలు ముందుగానే అభ్యంతరాలు చెప్పాయి. మరికొన్ని రాష్ట్రాలు.. స్వాగతించాయి. అనూహ్యంగా..ఒక్క రోజు ముందు మాత్రం… ఏపీ సర్కార్.. తమకు మరో రోజు సమయం కావాలని అడిగింది. రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ప్రస్తుతం అత్యవసరం కాబట్టి.. కేంద్ర ప్రభుత్వం మరో మాట లేకుండా.. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి ఆమోదం తెలిపింది. దాంతో విమాన ప్రయాణాలు మంగళవారానికి వాయిదా పడ్డాయి.

ఆంధ్రప్రదేశ్ అధికార వర్గాలు.. మాత్రం… కేంద్ర విమానయానశాఖతో ఏర్పడిన మిస్ కమ్యూనికేషన్ వల్లనే ఈ రోజు.. విమానాల రాకపోకలకు సాధ్యం కావడం లేదని చెబుతున్నారు. నిజానికి మ్యూనికేషన్ గ్యాప్ రావాల్సింత హడావుడిగా కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. వారం రోజుల క్రితమే ప్రకటించారు. విమాన సర్వీసుల విషయంలో.. మహారాష్ట్ర, బెంగాల్ తమ అభ్యంతరాలను ముందుగానే చెప్పాయి. కేంద్రంతో సంప్రదింపులు జరిపాయి. ఫలితంగా ఇరవై ఎనిమిది నుంచి బెంగాల్‌లో సర్వీసులు ప్రారంభమవుతున్నాయి. మహారాష్ట్ర కొన్ని నిబంధనలతో నేటి నుంచే సర్వీసులు నడపడానికి అంగీకారం తెలిపింది.

కరోనా విషయంలో ఏపీ సర్కార్ చాలా క్లారిటీగా ఉంది. కరోనాతో కలిసి జీవించాల్సిందేనని.. ఇంకా ఎంతో కాలం.. ఇలా ఉండలేమని ఎప్పటి నుంచో చెబుతోంది. దాని ప్రకారం.. ప్రజలు జాగ్రత్తలు తీసుకుని.. రోజువారీ కార్యకలాపాలు నిర్వహించుకునేలా చేయడానికి అనేక సడలింపులు ఇస్తూ పోతోంది. ఈ కారణంగా.. ఏపీలో కంటెయిన్‌మెంట్ జోన్లు తప్ప.. మిగతా చోట్ల.. సాధారణ జీవితం నెలకొంది. ఇంత పకడ్బందీగా చేస్తున్న ఏపీ సర్కార్.. విమాన ప్రయాణాల విషయంలో మాత్రం.. వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close