వ్యాపారానికి వైరస్ : విమానయాన రంగం దివాలా..!

కరోనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దివాలా దిశగా తీసుకెళ్తోంది. ఆ రంగం ఈ రంగం అనే తేడా లేదు.. నష్టపోని వారంటూ లేరు. ఈ క్రమంలో ఆయా రంగాల దుస్థితిపై తెలుగు360 రోజువారీగా అందిస్తున్న కథనాల్లో నేడు విమానాయాన ఎదుర్కొంటున్న దీన పరిస్థితులని విశ్లేషిస్తున్నారు. కరోనా ఔట్ బ్రేక్ తర్వాత లాక్ డౌన్‌తో సంబంధం లేకుండా.. మొట్టమొదటగా ఎఫెక్ట్ అయిన రంగం ఎయిర్ వేస్. మొదట్లో ప్యాసింజర్లు తమ టిక్కెట్లు క్యాన్సిల్ చేసుకోవడంతో ప్రారంభమైన సంక్షోభం తర్వాత ఎయిర్‌లైన్స్ సంస్థలు తమ ఫ్లైట్లను క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు.. ఇక సంక్షోభాన్ని తట్టుని నిలబడటం కష్టం.. దివాలా ప్రకటించడం మంచిదనే ఆలోచనకు వస్తున్నాయి. ప్రపంచంలో కొన్ని సంస్థలు ఇప్పటికే.. ఆ దిశగా నిర్ణయాలు కూడా తీసుకున్నాయి.

ట్రిలియన్ డాలర్ల ఆదాయం లాస్..!

ప్రస్తుతం ప్రపంచంలో అత్యవసర సరకు రవాణా విమానాలు మాత్రమే గాల్లోకి ఎగురుతున్నాయి. ఇక ప్రయాణికులను మోసుకెళ్లే అంతర్జాతీయ విమానాలు 80 నుంచి 90 శాతం ఎగరగడం లేదు. అభివృద్ధి చెందిన దేశాల్లో… డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. యూరోపియన్ దేశాల మధ్య బస్సులు తిరిగినట్లు విమానాలు తిరిగేవి. ఇప్పుడు అన్నీ… హ్యాంగర్లకే పరిమితమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా… విమానయాన సంస్థలన్నీ కలిపి.. ట్రిలియన్ డాలర్లు ఆదాయం కోల్పోతాయని ఇండస్ట్రీ ప్రముఖులు అంచనా వేశారు. విమానయానరంగం ఇంతటిసంక్షోభాన్ని గతంలో ఎప్పుడూ ఎదుర్కోలేదు. న్యూయార్క్‌పై సప్టెంబర్ 11 దాడుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఓ భయానక వాతావరణం ఏర్పడింది. అంతర్జాతీయ విమాన సర్వీసులను అప్పుడు కూడా రద్దు చేశారు. కానీ.. అప్పుడు విమానయాన రంగం కష్టాలను ఎదుర్కొంది కానీ ఉనికి కోల్పోయేంత సంక్షోభం కాదు. ఇప్పుడు మళ్లీ విమానాలు ఎగురుతాయా అన్న సందేహం వచ్చేంత కష్టం వచ్చంది.

లే ఆఫ్స్.. జీతం కట్… బలవంతపు సెలవులు..!

ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ విమానయాన కంపెనీలుగా పేరు పొందినవన్నీ.. ఇప్పటికే .. ఉద్యోగులకు జీతాలు కట్ చేశాయి. ప్రపంచంలో అతి పెద్ద విమానాయాన సంస్థల్లో ఒకటి అయిన.. క్వాంటాస్ ఎయిర్ వేస్ 30వేల మందికి వేతనం లేని సెలవులు ఇచ్చేసింది. డెల్టా ఎయిర్ వేస్ సగం జీతం కట్ చేసింది. ఇవి మంచి ఆర్థిక వనరులన్న సంస్థలు ఇవే తట్టుకోలేకపోతే..ఇక వేల కోట్ల నష్టాల్లో సాగుతూ.. మంచి రోజుల కోసం ఎదురు చూసే… విమానయాన సంస్థలు ఇక బయటపడటం అసాధ్యం. భారత్‌లో మార్కెట్‌ వాటాపరంగా దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థగా కొనసాగుతున్న ఇండిగో ఎయిర్‌లైన్స్‌ తమ ఉద్యోగుల వేతనాల్లో భారీ కోత విధిస్తున్నట్టు ప్రకటించింది. ఎయిర్‌ ఇండియా కూడా 5 శాతం మేరకు కోత విధించే అవకాశాలు ఉన్నాయి. “గోఎయిర్‌’ సంస్థ కూడా తమ నిర్వహణ ఖర్చులను తగ్గించుకొనేందుకు వేతనరహిత సెలవు ప్రకటించంది.

ఇండియాలో రెండే ఎయిర్‌లైన్ సంస్థలు మిగిలే చాన్స్..!

ఇండియాలో ఆరు పెద్ద విమానయాన సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం వాటిలో నాలుగు దివాలా తీయడం ఖాయం అయినట్లే. విమాన సర్వీసులు ఎప్పటి వరకూ నిలిపివేస్తారో తెలియడం లేదు. అంతర్జాతీయ సర్వీసులు .. కరోనాపై పరిస్థితి ఎంత మెరుగుపడినా జూన్ వరకూ ప్రారంభమయ్యే అవకాశం లేదు. దీంతో.. మొదటి మూడు నెలల్లో అంటే.. జూన్ నాటికి ఎయిర్ లైన్స్ సంస్థలు కోల్పోయే మొత్తం రూ. 27వేల కోట్లు. ఏవియేషన్‌ కన్సల్టెన్సీ సెంటర్‌ ఫర్‌ ఆసియా పసిఫిక్‌ ఏవియేషన్‌ ఇండియా ఈ అంచనా వేసింది. విమాన రంగం మీద పరోక్షంగా ఆధారపడే ఎన్నో రంగాలు కూడా.. నష్టాలను చవి చూస్తున్నాయి. విమానయాన కంపెనీలు 175 కోట్ల డాలర్లు, విమానాశ్రయాలు 150-175 కోట్ల డాలర్లు. గ్రౌండ్‌ హ్యాండర్లు 8-9 కోట్ల డాలర్ల నష్టాలను భరించాల్సి ఉంది. ఎయిర్‌ ఇండియాకు రోజుకు రూ. 35 కోట్ల నష్టాన్ని భరిస్తోంది. ప్రస్తుతం దేశంలో ఉన్న విమానయానరంగ సంస్థల ఆర్థిక పరిస్థితిని అంచనా వేస్తే.. రెండు మాత్రమే.. మళ్లీ కోలుకునే అవకాశం ఉందని..మిగతా నాలుగు సంస్థలు దివాలా దిశగా ఉన్నాయని ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు.

బెయిలవుట్ ప్యాకేజీలిస్తేనే ఫ్లయింగ్..!

అమెరికా నుంచి ఇండియావరకూ.. విమానయానరంగ సంస్థలన్నీ ప్రభుత్వాల వైపే చూస్తున్నాయి. బెయిలవుట్ ప్యాకేజీలు ప్రకటిస్తే తప్ప.. తాము కోలుకోవడం కష్టమని ఇప్పటికే ఆయా దేశాల ప్రభుత్వాలకు నేరుగా సంకేతాలు పంపుతున్నాయి. కొన్ని కొన్ని దేశాల్లో ప్రభుత్వాల చేతిలోనే… అతి పెద్ద విమానాయసంస్థలు ఉండటంతో.. వాటికి ఎలాంటి ఇబ్బంది ఉండటం లేదు. కానీ ఇలాంటి సంస్థలు తక్కువ. విమానయానరంగం ఎంత బాగా పని చేస్తే.. తమ దేశ ఆర్థిక వృద్ధి కూడా అంత బాగుంటుందని భావించే దేశాలు ఎక్కువ ఉంటాయి.అయితే ఇప్పుడు కరోనా కారణంగా దేశాలకే ఆర్థిక సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఎంత వరకూ బెయిలవుట్ ప్యాకేజీలు ప్రకటించి ఆదుకుంటారన్నదే ఆసక్తికరం. కరోనా వైరస్.. విమానయారంగాన్ని.. జీవశ్చవంగా మార్చేసిందని అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ ఎమ్మెల్యే కూడా పార్టీ మారడం లేదని క్లారిటీ ఇచ్చేశారు..!

వైసీపీలో చేరబోతున్నారని ప్రచారం జరిగిన రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కూడా..ఖండించారు. తాను పార్టీ మారబోవడం లేదని ప్రకటించారు. ఎప్పటిలాగే తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. పార్టీలోని కొంత మంది వ్యక్తులు కూడా...

ఎస్ఈసీ ఆర్డినెన్స్‌పై హైకోర్టు తీర్పును సవాల్ చేసిన ఏపీ సర్కార్..!

ఎస్ఈసీ అర్హతలు మార్చుతూ తెచ్చిన ఆర్డినెన్స్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ.. ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు కొనసాగుతున్నప్పటికీ...ఎస్ఎల్పీ దాఖలు...

శంకించొద్దు.. జగన్‌కు విధేయుడినే : విజయసాయిరెడ్డి 

తాను చనిపోయేవరకు జగన్‌కు, ఆయన కుటుంబానికి విధేయుడిగానే ఉంటానని.. నన్ను శంకించాల్సిన అవసరం లేదని ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా ముఖంగా వెల్లడించారు. వైఎస్ జగన్ కు... అత్యంత ఆప్తునిగా పేరు తెచ్చుకున్న ఆయన...

అమిత్‌షాతో భేటీకి మంగళవారం ఢిల్లీకి జగన్..!?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం అత్యవసరంగా ఢిల్లీకి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు మీడియా ప్రతినిధులకు అనధికారిక సమాచారం అందింది. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్తారని.. కేంద్ర హోంమంత్రి అమిత్...

HOT NEWS

[X] Close
[X] Close