చిరు ప‌క్క‌న ఐష్‌ ఫిక్స‌యిన‌ట్టే…. కానీ

చిరంజీవి ప్ర‌స్తుతం ఉన్నారు. 80వ ద‌శ‌కంలో ఓ వెలుగు వెలిగిన‌ ద‌క్షిణాది తార‌లంతా ప్ర‌తీ యేటా గెట్ టు గెద‌ర్ ఏర్పాటు చేసుకొంటారు. రెండ్రోజుల పాటు విందు – వినోదాల‌తో పండ‌గ చేసుకొంటారు. ఈసారి ఆ వేడుక చైనాలో జ‌రుగుతోంది. అందుకోసం చిరు చైనా విమానం ఎక్కేశాడు. చిరు తిరిగిరావ‌డానికి మ‌రో వారం రోజులైనా ప‌డుతుంది. ఈలోగా.. ఇక్క‌డ చిరు 151వ సినిమా కోసం ముమ్మ‌ర ఏర్పాట్లు జ‌రిగిపోతున్నాయి. చిరు జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఆగ‌స్టు 22న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించి, సెప్టెంబ‌రులో రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లెడ‌తారు. క‌థానాయిక‌గా చాలామంది పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నా.. చివ‌రికి ఐశ్వ‌ర్య‌రాయ్ పేరే ఖ‌రార‌య్యే అవ‌కాశాలున్నాయి.

ఈ ప్రాజెక్టులో పాలు పంచుకోవ‌డానికి ఐష్ ఓకే అనేసింద‌ని టాక్‌. అయితే.. పారితోషికంగా రూ.6 కోట్లు డిమాండ్ చేసింద‌ట‌. కాల్షీట్లు కూడా ప‌రిమితంగానే ఆఫ‌ర్ చేసింద‌ని, ఈ డీల్ చ‌ర‌ణ్ అండ్ టీమ్‌కీ న‌చ్చింద‌ని తెలుస్తోంది. ద‌క్షిణాదిన ఎన్నో హిట్ చిత్రాల‌కు కెమెరామెన్‌గా వ్య‌వ‌హ‌రించిన ర‌వి వ‌ర్మ ఈ సినిమాకి ఛాయాగ్ర‌హ‌ణ బాధ్య‌త‌లు నిర్వ‌హించ‌నున్నారు. సంగీత ద‌ర్శ‌కులుగా బాలీవుడ్ దిగ్గ‌జాల పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. ఇవ‌న్నీ జులై చివ‌రి వారంలోగా డిసైడ్ అయిపోతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉరిమి ఉరిమి ప్రైవేట్ ల్యాబ్స్‌పై పడుతున్న తెలంగాణ సర్కార్..!

కరోనా టెస్టుల విషయంలో తెలంగాణ సర్కార్ తప్పు అంతా ప్రైవేటు ల్యాబ్స్‌ మీద నెట్టేస్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణలో టెస్టులు చేస్తున్న పదహారు ప్రైవేటు ల్యాబుల్లో పదమూడింటికి ప్రభుత్వం నోటీసులు జారీ...

అమరావతికి ఎయిర్‌పోర్టు ఉందా..? రైల్వే స్టేషన్ ఉందా..?

అమరావతి పోరాటం విషయంలో ప్రభుత్వం ఎదురుదాడి చేయడానికి విచత్రమైన కారణాలను ఎదుర్కొంటోంది. ఉద్యమం ప్రారంభమై 200 రోజులు అయిన సందర్భంగా పెద్ద ఎత్తున దేశ, విదేశాల నుంచి రైతులకు సంఘిభావం తెలియచేశారు. ఈ...

కాళేశ్వరం సబ్ కాంట్రాక్టర్లు ఫిరాయింపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలా..?

కొండపోచమ్మ సాగర్ కాలువకు పడిన గండిని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రాజకీయంగా ఉపయోగపడుతోంది. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు అతి సమీపంలో ఉండే వెంకటాపూర్ గ్రామాన్ని ఆ నీరు ముంచెత్తింది. అయితే.. సమస్య అది...

చికాగో నగరం లో అమరావతి ప్రొటెస్ట్

చికాగో నగరం లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ కి చెందిన పలువురు ప్రవాస భారతీయులుఅమరావతి ఉద్యమం 200 రోజులకు చేరిన సందర్భంగా తమ సంపూర్ణ మద్దతుతెలియజేస్తూ ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతో కొవ్వుత్తుల...

HOT NEWS

[X] Close
[X] Close